చిన్నారెడ్డిపై దాడి తగదు: ఉత్తమ్
Published Mon, Sep 11 2017 4:02 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
సాక్షి, హైదరాబాద్: వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి పై పెబ్బేరులో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దాడులతో ప్రజా పోరాటాలను అడ్డుకోవాలని చూస్తే ఉద్యమాలు మరింత ఉదృతమవుతాయంటూ హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక 39 జీవో పైన ఉద్యమం చేయడం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతని పేర్కొన్నారు.
చిన్నారెడ్డి పైన నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నాయకులు దాడులు చేయడం ఇది రెండో సారి అని వెల్లడించారు. ఇలాగే దాడులు చేసి ప్రతిపక్షాలను అడ్డుకోవాలని చూస్తే ప్రతిఘటిస్తామని చెప్పారు. ప్రజల పక్షాన పోరాటాలు ఆగవని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తూనే ఉంటామని తెలిపారు
Advertisement
Advertisement