
హైదరాబాద్: తాను వైద్యుడిని కానని సామాజిక చైతన్యం తీసుకొచ్చే కార్యకర్తను మాత్రమేనని డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ అన్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కిడ్నీలు చెడిపోవడానికి మధుమేహం ఎంత మాత్రం కారణం కాదని చెప్పారు. దీని కోసం తీసుకునే ట్రీట్‌మెంట్‌తో అనేక సైడ్ ఎఫెక్ట్స్ సంక్రమిస్తాయని తెలిపారు.
పేద, మధ్య తరగతి ప్రజలను డయాబెటిస్ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. తాను చేసే ఆరోగ్య విధానం రోగాలను నయం చేస్తుందే తప్ప అనారోగ్యానికి గురి చేయదని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా కిడ్నీ చెడిపోయిందని నిరూపిస్తే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని చెప్పారు.