సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు దశల వారీగా నీళ్లు అంది స్తామని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన పంపులు, మోటార్లు త్వరలోనే వస్తున్నాయని, వాటిని బిగించేందుకు అన్ని పనులు పూర్తి చేయాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించా మన్నారు. మిషన్ భగీరథ పనుల పురో గతిపై చీఫ్ ఇంజనీర్లు, అన్ని జిల్లాల ఎస్‌ఈ లతో బుధవారం ప్రశాంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనుల పురో గతిపై నివేదికలు తయారు చేయాలన్నారు. ఇంటెక్‌వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, పైప్‌లైన్ పనుల వివరాలతో సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. ఈ సమా వేశంలో చీఫ్ ఇంజనీర్లు కృపాకర్‌రెడ్డి, విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment