వరండా, చెట్లకిందే పాఠాలు పట్టించుకోని అధికారులు
శాయంపేట : ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పాఠశాలలు సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలికాయి. ఏళ్లు గడుస్తున్నా పాఠశాలల్లో సమస్యలు మాత్రం తీరడం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. బడులు ఇం కెప్పుడు బాగుపడతాయో అని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. మండల కేంద్రంలోని ఏంఈఓ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల పైకప్పు పగిలిపోయి ఏళ్లు గడుస్తున్నాయి. ప్రతి ఏడాది అధికారులు, ప్రజాప్రతినిధులు బాగు చేయిస్తామని అంటున్నారే తప్పా పాఠశాలల స్థితిగతులను మార్చిన దాఖలాలు లేవు. పాఠశాలలో గదుల పైకప్పులు పగిలిపోవడంతో విద్యార్థులంతా ఒకే చోట వరండాలో కూర్చోబెట్టి పాఠాలు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చెట్ల కిందే చదువులు..
గణపురం: మండలంలోని చెల్పూరు ప్రాథమిక పాఠశాలలో గదులు లేక విద్యార్థులు చె ట్ల కిందే చదువుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాలలో 150 మంది వరకు విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. ఐదు గదులున్నాయని అవి సరిపోవడ ం లేదని, మూడు గదుల అవసరం ఉందని పాఠశాల ఉపాధ్యాయులు తెలి పారు. అధికారులు అనుమతి ఇస్తే ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభిస్తామని హెచ్‌ఎం బాబు తెలిపారు.
రేగొండలో..
రేగొండ: మండలంలోని తిరుమలగిరి శివారు గుట్టకింది రావులపల్లి పాఠశాల శిథిలావస్తకు చేరుకుం ది. సోమవారం పాఠశాల ప్రారంభం కాగా శిథిలావస్తలో ఉన్న పాఠశాలకు తమ పిల్లలను పంపిం చేందుకు తల్లిదండ్రులు సందేహలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్‌లో ఇంగ్లిష్ విద్యను అందిస్తేనే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గ్రామస్తులు అంటున్నారు.
సౌకర్యాలు కరువు..
చిట్యాల : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కరువయ్యాయి. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 13 ఉన్నత పాఠశాలలు, ఏడు ప్రాథమికోన్నత, 48 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 20 పాఠశాలల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని పాఠశాలల్లో వేసవికాలంలో చేతిపంపులు చెడిపోయి దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామాలలోని పాఠశాల గదులు శిథిలావస్థకు చేరాయి. పాఠశాలల దుస్తితి కడుదయానీయంగా ఉన్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడనే విమర్శలు వినబడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.