
సాక్షి, అనంతగిరి: ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ నెలకోసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలి. సిబ్బంది, ప్రజల సమస్యలను పరిశీలించాలి’ అని సూచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బుధవారం వికారాబాద్ నుంచి అసెంబ్లీ వరకూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ముందుగా వికారాబాద్ బస్టాండ్‌కు చేరుకున్న అనంతరం బస్సులో హైదరాబాద్ వచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బస్సు ప్రయాణం చేసినట్లు తెలిపారు. వికారాబాద్ బస్ డిపో మేనేజర్ ...బస్సుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పారని, ఆ సంఖ్యను పెంచామన్నారు. అలాగే ప్రయాణికుల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకే తాను ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు చెప్పారు. ఇక మహిళలకు కేటాయించిన సీట్లలో వారిని మాత్రమే కూర్చోనిద్దామని ఎమ్మెల్యే సూచించారు.