ఖమ్మం,మయూరిసెంటర్: అర్బన్ ప్రాంతంగా ఉండి.. చైతన్యవంతమైన ప్రజలు ఉన్న నియోజకవర్గంలో పోలింగ్ సరళిలో మాత్రం మార్పు రావడం లేదు. జిల్లాకేంద్రమైన ఖమ్మంలో ఎక్కువగా చదువుకున్న యువత, ఉద్యోగులు, వ్యాపారులు, మేధావులు ఎక్కువగా నివసిస్తుంటారు. వీరికి ఓటు హక్కు విలువ గురించి చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సంవత్సరాలుగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఎక్కడ కూడా ఓటింగ్ నమోదు శాతంలో మాత్రం మార్పు రావడం లేదు.
గత ఎనిమిది ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ సరళిని పరిశీలిస్తే 70 నుంచి 75శాతం మధ్యలోనే ఉంటోంది. ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం కేంద్రంతోపాటు రఘునాథపాలెం మండలం ఉంది. అయితే మండలానికన్నా.. అర్బన్ ప్రాంతంలోనే ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 1983 నుంచి 2014 వరకు ఓటింగ్ సరళి ఈ కింది విధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment