ఆ‘పత్తి’ తీరేనా?
నేటి నుంచి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ప్రారంభంకానున్న కొనుగోళ్లు
సెలవు రోజుల్లో మిల్లుల వద్దపత్తి కొనుగోళ్లు
భారీగా తరలిరానున్న పత్తి కొనుగోళ్లు సాఫీగా జరగాలని రైతుల ఆకాంక్ష
వరంగల్ సిటీ : వారం రోజుల పండుగ సెలవులు పూర్తయ్యూరుు. నేటి(సోమవారం) నుంచి వరంగల్ వ్యవసాయ మార్కెట్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవనున్నారుు. ఇప్పటిదాకా కొనుగోళ్లు జరిగిన తీరు రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. యంత్రాలు, సామగ్రి, సిబ్బంది, అధికారులు ఇలా అందరూ అందుబాటులో ఉన్నా..పత్తి కొనుగోళ్లు కనీస అంచనాలను అందుకోవడం లేదు. దీంతో సీసీఐ సేవల పరిస్థితి అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయూరైంది. ఈనెల 1న సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 81వేల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు రాగా, సీసీఐ అధికారులు కేవలం 676 క్వింటాళ్లే కొన్నారు. దీన్ని బట్టి కొనుగోళ్లలోని వైఫల్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. నేటి నుంచి జరిగే కొనుగోళ్లైనా సాఫీగా జరగాలని రైతులు కోరుకుంటున్నారు. పెద్దఎత్తున పత్తి మార్కెట్‌కు తరలిరానుంది. మార్కెట్‌కు లూజు పత్తి కాకుండా ప్రతిరోజూ కనీసం 40 నుంచి 60 వేల పైచిలుకు పత్తి బస్తాలు అమ్మకానికి రానున్నట్లు మార్కెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కావాలని ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్ల నుంచి తప్పుకున్నా, తక్కువ ధరతో కొనుగోళ్లు చేపట్టినా మళ్లీ గొడవలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు.
నామమాత్రంగా ‘సీసీఐ’ కొనుగోళ్లు
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 84 సీసీఐ సెంటర్లను ఏర్పాటు చేసింది. క్వింటాలుకు రూ.4100 ధరకు పత్తి కొంటామని ప్రకటించింది. అరుునా ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 10 సెంటర్లే ప్రారంభమయ్యాయి. వీటిలో నామమాత్రంగా నడుస్తున్నవి 6 సెంటర్లు. మిగతా 4 సెంటర్లను తూతూమంత్రంగా నడిపిస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రకటించే నిర్ణయూల అమలులో క్షేత్రస్థారుులో జరుగుతున్న వైఫల్యానికి ఇదొక నిదర్శనంగా నిలుస్తోంది.
చెక్‌పోస్టుల్లో వసూళ్ల దందా..
వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించక..రోజుకు 15 నుంచి 20 లారీల పత్తి గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలిపోతోంది. ఇక సెలవురోజుల్లో పత్తి మిల్లుల వద్ద బ్రోకర్లు కొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 20 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా, మామూళ్లకు అలవాటు పడిన సిబ్బంది పత్తి లోడ్‌లు తరలివెళ్లేందుకు సహకరిస్తున్నారు. ప్రతీ చెక్‌పోస్టు వద్ద రూ.2500 నుంచి రూ.3000 ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మార్కెట్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. కమర్షియల్ ట్యాక్స్ రూపేణా వచ్చే ఆదాయం సైతం తగ్గిపోతోంది. కాగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో పత్తికి క్వింటాలుకు రూ.4500 నుంచి రూ.4800 ధర పలుకుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నారుు.
అందుబాటులోకి మరిన్ని తేమ యంత్రాలు
సెలవుల అనంతరం వరంగల్ మార్కెట్‌కు పెద్ద ఎత్తున పత్తి రాానున్నదనే సమాచారంతో మార్కెట్ కార్యదర్శి మరో 5 తేమను కొలిచే యంత్రాలను తెప్పించారు. ఇప్పటికే తేమ శాతాన్ని కొలిచే 10 చిన్న మిషన్లు, 5 పెద్ద మిషన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈసారి సీసీఐ పత్తి కొనుగోళ్లను భారీ ఎత్తున చేపడుతోందని, మార్కెట్‌లో ప్రత్యేకంగా 6 వే బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు సీసీఐ కోసం ప్రత్యేక పత్తి యార్డును ఏర్పాటు చేశారు. కానీ సీసీఐ మాత్రం అంచనాలకు అనుగుణంగా పత్తి కొనుగోళ్లను చేపట్టడం లేదు. రైతులకు మద్దతు ధర అందించక తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి.
వరంగల్ మార్కెట్‌లో.. శర్మ ఔట్
వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్ల కోసం 2 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రధాన ఇన్‌చార్జి అధికారిగా ఆర్‌కే శర్మను నియమించారు. పత్తి కొనుగోళ్ల విషయంలో మార్కెట్ వెనుకంజకు ఆయనే కారణమనే ఆరోపణలున్నారుు. ఇటువంటి నిర్లక్ష్య వైఖరి కారణంగా పెద్ద ఎత్తున పత్తి నిల్వలు లారీలలో ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇక వరంగల్ మార్కెట్‌లో సీసీఐ ఇన్‌చార్జిగా సేవలందిస్తున్న శర్మ ప్రస్తుత పరిస్థితులను చూసి ఈ సారి లాభాలు గడించే అవకాశం లేదని నిర్ణయించుకొని సెలవు రోజుల్లో స్వయంగా వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో వరంగల్ మార్కెట్‌కు ఇన్‌చార్జి అధికారిగా ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదు. ఈ క్రమంలో సీసీఐ వరంగల్ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు మరీ కష్టంగా మారారుు.