హరితహారానికి వ్యతిరేకం కాదు..
► ప్రభుత్వం చెప్పేదొకటి... చేసేది మరొకటి..
► 10 నెలల్లో 800 మంది రైతుల ఆత్మహత్యలు
► సీపీఐ శాసన సభా పక్షనేత రమావత్ రవీంద్రకుమార్
మహబూబాబాద్ : హరితహారానికి సీపీఐ వ్యతిరేకం కాదని, అయితే ఆ పథకం పేరిట రైతులకు సంబంధించిన పోడు భూములను లాక్కునే విషయంలో మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు ఆ పార్టీ శాసనసభా పక్షనేత, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పోడు భూ ములకు పట్టాలివ్వాలంటూ సీపీఐ, ఏఐకేఎస్ ఆధ్వర్యంలో శనివారం మానుకోటలోని వీరభవన్ నుంచి అటవీశాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మహాధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా రవీంద్రకుమార్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన 10 నెలల కాలంలో సుమారు 800 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల నుంచి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషి యో చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల పో డు భూమి ఉందని... లక్షలాది మంది రైతులు ఆ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. కేవలం లక్షా 15 వేల ఎకరాల భూమికి సంబంధించిన రైతులకు మాత్రమే పట్టాలిచ్చి.. మిగిలిన రైతులకు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.
మానుకోట నియోజకవర్గంలోనే 15 వేల ఎకరాలకు సంబంధించిన రైతులకు పట్టాలు రాలేద ని, ఇప్పుడు అటవీ అధికారులు ఆ భూములను లాక్కొని రైతులను రోడ్డున పడే పరిస్థితిని ప్రభుత్వమే తెస్తోందన్నా రు. భూములను లాక్కుంటున్న విషయం తన దృష్టికి రాలేదని సీఎం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం చెప్పేది ఒకటి... చేసేది మరొకటిలా ఉందన్నారు. పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్‌లో పోడు భూముల సమస్యలపై సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.
శాసనసభలో పోడు భూముల విషయం పై మరోసారి చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నా రు. సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, రైతు సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు తమ్మెర విశ్వేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సమీర్ రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి అజయ్, కౌన్సిలర్లు రామ్మూ ర్తి, ఫాతిమా, నాయకులు పెరుగు కుమార్, నవీన్, రవి, యాకాంబ్రం, కట్లోజు పాండురంగాచారి, తో ట బిక్షపతి, వెంకన్న, తాళ్ళపూసపల్లి సర్పంచ్ సుధాకర్, ఎంపీటీసీ పెద్ది జయమ్మ పాల్గొన్నారు.