
నిండు ప్రాణాన్ని బలిగొన్న వివాహేతర సంబంధం
వీడిన జూపాక హత్య కేసు మిస్టరీ
భార్య, అత్తమామల పథకం ప్రకారమే హత్య
హుజూరాబాద్‌టౌన్ : వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. హుజురాబాద్ మండలం జూపాక గ్రామ శివారులో గత నెల 20న గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి బండరాళ్లు కట్టి వ్యవసాయ బావిలో పడవేసిన హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించా రు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతోనే భర్తను ఓ భార్య తనతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని హత్యచేశారు. బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిఐ సిహెచ్.శ్రీనివాస్, ఎస్సైలు బొల్లం రమే ష్, రాజేందర్‌లతో కలిసి వివరాలను వెల్లడించారు. మృతుడు వరంగల్ జిల్లా కేంద్రంలోని శివనగర్‌కు చెందిన సాంబశివరావుగా పోలీసులు గుర్తించారు. మృతుడికి వరంగల్ జిల్లా మొగుళ్ళపెల్లి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన లకిడె రమ అలియాస్ కావ్యతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగిం ది. వీరికి ఇద్దరు కూతుళ్ళు జన్మించారు.
రమకు బంధువైన కమలాపూర్ మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన భాసిడి ఓంకార్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు సాంబశివరావు గుర్తించాడు. తన భర్త అడ్డును తొలిగించాలనుకొని ఓంకార్‌కు రూ.50 వేలిచ్చి హతమార్చాలని చెప్పింది. దీనికి రమ తల్లిదండ్రులు లింగంపల్లి రాములు, కమలాభాయిల సహకారం ఉంది.ఈక్రమంలో ఓంకార్ సాంబశివరావును హత్య చేసేందుకు నేరేళ్ల గ్రామానికి చెందిన పైడి, దేవేందర్, కుమారస్వామి, స్వామిలతో ఒప్పందం కుదుర్చుకుని హత్య చేశారు. హత్యచే యాలని పథకం పన్నిన రమా, తల్లి దండ్రులు పరారీలో ఉన్నారు. ప్రాధాన నిందితుడైన ఓంకార్‌తో పాటు నలుగును నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. పరారీలోఉన్న నిందితులను కూడా పట్టుకుంటామన్నారు.