
కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర
రుణమాఫీకి ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ రైతులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు.
తలమడుగు, న్యూస్‌లైన్ : రుణమాఫీకి ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ రైతులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. కేసీఆర్ వైఖరిని వ్యతిరేకిస్తూ రుయ్యాడి, త లమడుగు, సుంకిడి గ్రామాల్లో రైతులు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ర్యాలీ, రాస్తారోకో నిర్వహిం చారు. ఈ సందర్భంగా రైతులు ప్రేమ్‌సాగర్‌రెడ్డి, నర్సింహు లు, తిరుపతిరెడ్డి, రాజన్న తదితరులు మాట్లాడారు. బ్యాంకు రుణాలు చెల్లించొద్దు, అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తామ ని ఎన్నికల సమయంలో కేసీఆర్ రైతులను నమ్మించాడని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి అయ్యాక వారం తిరక్కముందే మాట తప్పి ఒక ఏడాది పంటరుణాలకే మాఫీ వర్తిస్తుంద ని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎలాం టి ఆంక్షలు లేకుండా రూ.లక్షలోపు ఉన్న పంటరుణాలన్నిం టినీ మాఫీ చేయాలని, లేనిపక్షంలో రైతులంతా కలిసి ఆందోళనలు చేడతామని హెచ్చరించారు. తెలుగు యువత నాయకుడు ప్రేమ్‌సాగర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, నర్సింహులు, నర్సింగ్, లింగల రాజన్న, ఆనంద్, వెంకన్న, ఆశన్న పాల్గొన్నారు.