రాజకీయ వ్యవస్థనూ ప్రక్షాళన చేయాల్సిందే
అవినీతి లేని దేశం దిశగా అడుగులు పడాలి: కేసీఆర్
- ఎన్నికల నిర్వహణలో భారీ సంస్కరణలు తేవాలి
- పార్టీల లావాదేవీలు, విరాళాలన్నీ బ్యాంకుల ద్వారానే నిర్వహించాలి
- నల్లడబ్బు సృష్టించింది కాంగ్రెస్ వారే
- అవినీతి ఉండొద్దంటుంటే ప్రధానితో చీకటి ఒప్పందమంటారా?
సాక్షి, హైదరాబాద్: ‘‘నూరు శాతం నల్లడబ్బు లేని, నూరు శాతం అవినీతి లేని దేశాన్ని తయారుచేయడం కోసం మా మద్దతు ఉంటుంది. ఎవరూ ఎవరినీ డబ్బు అడగని, వేధించని దిశగా దేశం అడుగులు పడాలి. నల్ల డబ్బు పూర్తి స్థారుులో నిర్మూలమైతేనే నోట్ల రద్దు వల్ల ప్రయోజనం. లేదంటే విఫల ప్రయోగం అవుతుంది. అన్ని రంగాలతో పాటు రాజకీయ వ్యవస్థనూ పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మన దేశంలో నల్లడబ్బును తెచ్చింది, పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయేనని కేసీఆర్ ఆరోపించారు. దేశాన్ని భ్రష్టు పట్టించిన నల్ల డబ్బు సృష్టికర్తలు కాంగ్రెస్ నేతలేనని మండిపడ్డారు.
అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు..
అవినీతి రహిత సమాజం రావాలని తాను కోరుకుంటుంటే... ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారంటూ కాంగ్రెస్, ఇతర విపక్షాల నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘‘నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం పడిపోతుందని నేను చెబితే.. బీజేపీ నేత కిషన్‌రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతడు. ఇన్ని రోజులు నల్లడబ్బు మీద రాష్ట్రాన్ని నడిపించారా అంటడు. నోట్లు రద్దు చేసిన నవంబర్ 8వ తేదీ వరకు నా ప్రభుత్వమే కాదు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా నల్లడబ్బుపైనే నడిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా నడిచింది నల్లడబ్బుపైనే కాదా? రిజర్వు బ్యాంకు కొత్త నోట్లను ఏపీకి ఎక్కువగా ఇచ్చిందని, తెలంగాణకు తక్కువగ ఇచ్చిందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శిస్తడు. ఆయన ఏమన్నా లెక్కలు చూసిండా..? రిజర్వుబ్యాంకు ఈయనకేమన్నా లెక్క చెప్పిందా.. అసలు ఈ స్కీమ్ పూర్తి వివరాలు తెలిస్తే నన్ను విమర్శిస్తున్న వారి గుండెలు పగిలి చస్తరు.
ఈ సన్నాసులకు అసలు వివరాలు తెలుసా? ఒక్క రూపారుు లంచం ఇవ్వని భారత్ రావాలంటే, ఏ రూపంలోనూ నల్లధనం ఉండని భారత్ కావాలంటే నోట్ల రద్దు స్కీమ్ బాగా అమలుకావాలని కోరిన. కానీ కాంగ్రెస్ నేతలు నాది చీకటి ఒప్పందం, చిల్లర మార్చుకోవడానికి వెళ్లిండంటరు. కొన్ని వ్యాఖ్యలు బాధ కలిగిస్తరుు. వీళ్లు నాయకులా.. వాళ్ల స్థారుుని వాళ్లే తగ్గించు కుంటున్నరు..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. నోట్ల రద్దు వివిధ అంశాలు, వ్యూహం ఉన్న పథకమని, దేశాన్ని గోల్‌మాల్ చేసేంత అవసరం ప్రధానికి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. రేపు మధ్యలో రూ.2 వేల నోటును కూడా రద్దు చేయొచ్చని, అన్ని వ్యూహాలూ బయటపెట్టరని స్పష్టం చేశారు. గుడ్డిగా వ్యతిరేకించవద్దని సూచించారు. పాలనలో ఏదైనా తేడా వస్తే పెద్ద పెద్ద నియంతలనే ప్రజలు బండకేసి కొడతారని, ఎమర్జెన్సీ విధిస్తే ఇందిరాగాంధీని ఓడించ లేదాని ప్రశ్నించారు. ఏదైనా తేడా జరిగితే ఫలితాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా నని ప్రధాని మోదీ కూడా అన్నారని కేసీఆర్ గుర్తుచేశారు.
అవినీతి రహిత సమాజం కోసం..
నోట్ల రద్దు తర్వాత ప్రాథమికంగా ఇబ్బందులు ఉంటాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో అవినీతి రహిత సమాజం కోసం రాజకీయ రంగాన్ని కూడా ప్రక్షాళన చేయాల్సి ఉందని వ్యాఖ్యానిం చారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీల ఖాతాలు, పార్టీలకు వివిధ మార్గాల్లో వచ్చే విరాళాలన్నింటినీ బ్యాంకుల ద్వారానే నిర్వహించేలా సంస్కరణలు తీసుకు రావాలని సూచించారు. మరిన్ని ఎన్నికల సంస్కరణలు తీసుకురా వాల్సిన అవసరం ఉందని... ఎన్నికల ప్రచార తీరు, సరళి కూడా మారాల్సి ఉందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాను ఆ దిశలో ప్రయత్నించానని, కేవలం ఒకే బహిరంగ సభతో ముగించానని తెలిపారు. మీడియా విసృ్తతమయ్యాక ఈ-క్యాంపెరుున్ విధానమే మెరుగైనదని, అనవసరమైన ఎన్నికల ఖర్చు తగ్గిపోతుందని... దీనికోసం కేంద్ర ప్రభుత్వం కఠినమైన సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘వర్షాకాల సమావేశాలు కేవలం ఒక రోజే జరిగారుు. అందుకే వర్షాకాల - శీతాకాల సమావేశాలను కలిపి డిసెంబర్‌లో జరపాలని ప్రాథమికంగా నిర్ణరుుంచాం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ఏం చేస్తున్నామో ప్రజలకు చెబుతాం..’’అని చెప్పారు. అరుుతే ఏ తేదీల్లో సమావేశాలు జరిపేదీ ఇంకా నిర్ణరుుంచలేదన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, హోంమంత్రి నారుుని నర్సింహారెడ్డి, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.