వడదెబ్బతో ఒక గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది.
బాలానగర్ (హైదరాబాద్) : వడదెబ్బతో ఒక గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్ బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల ప్రకారం.. బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఐడీపీఎల్ బస్‌స్టాప్ వద్ద ఒక మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వడదెబ్బతో మరణించినట్లుగా గుర్తించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా మృతురాలి వివరాలు తెలియడంలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.