సెల్‌ఫోన్‌లో మరణ వాంగ్మూలం
వేధింపులు భరించలేక గృహిణి ఆత్మహత్య
హైదరాబాద్: ‘భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు భరించలేక చనిపోతున్నాను.. మన్నించమ్మా .. అంటూ తల్లి సెల్‌ఫోన్‌లో మరణ వాంగ్మూలాన్ని రికార్డు చేసి మరీ ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఎర్ర కుంట మినార్ కాలనీకి చెందిన ఆరీఫ్ తన కుమార్తె అంజుమ్ (20)ను.. యాకుత్‌పురాకు చెందిన వస్త్ర దుకాణ కార్మికుడు ఇర్ఫాన్ అలియాస్ ఆరీఫ్ (25)కు ఇచ్చి ఈ ఏడాది జనవరి 13న వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.50 వేల నగదుతో పాటు మూడు తులాల బంగారం ఫర్నిచర్ అందజే శారు.
వివాహం అయిన కొన్నాళ్లకే భర్త, అత్త, ఆడపడుచులు అదనపు కట్నం తీసుకు రావా లని అంజుమ్‌ను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. పది రోజుల క్రితం ఆమె భర్త అదనపు కట్నం తీసుకురావాలని మీనార్ కాలనీలోని అత్తగారింట్లో వదిలేసి వెళ్లాడు. దీంతో గత పదిరోజులుగా తీవ్ర మానసిక వేదన అనుభవించిన ఆమె.. మంగళవారం రాత్రి తల్లి సెల్ ఫోన్ తీసుకొని అందులో తాను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడు తున్నానో వివరిస్తూ వీడియో రికార్డు చేసింది. అందులో భర్త ఆరీఫ్, అత్త ఆజియా ఉన్నీసా, ఆడపడుచులు అర్షియా, సాదియాలు తనను ఎలా వేధింపులకు గురిచేస్తున్నారో పూస గుచ్చినట్లు వివరించింది. అనంతరం బాత్‌రూమ్‌కు వెళ్లి తాడుతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.