
మద్య నిషేధం కోరుతూ మహిళల ర్యాలీ
వాంకిడి (ఆదిలాబాద్): మద్యపాన నిషేధం కోరుతూ ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబార గ్రామ మహిళలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. శనివారం గ్రామంలోని మహిళలంతా మహిళా సమాఖ్య జీఆర్పీ సునీత ఆధ్వర్యంలో ఏకమై ఈ కార్యక్రమం తలపెట్టారు.
మద్యానికి బానిసలైన పురుషులు కుటుంబాలను పట్టించుకోవటం మానేశారని ఆరోపించారు. గ్రామంలోని బెల్టుషాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇకపై గ్రామంలో మద్యం విక్రయాలు కొనసాగితే ఊరుకోబోమని హెచ్చరించారు.