ఒడిశా రాష్ట్రంలోని భాగ్వాడ జిల్లాకు చెందిన వలస కార్మికులు జిల్లాలోని ఇటుక బట్టీల్లో దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. పొట్ట చేతపట్టుకొని పిల్లాపాపలతో ఇక్కడికి వచ్చిన అభాగ్యుల పట్ల ఇటుక బట్టీల నిర్వాహకులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు.
ఒడిశా రాష్ట్రంలోని భాగ్వాడ జిల్లాకు చెందిన వలస కార్మికులు జిల్లాలోని ఇటుక బట్టీల్లో దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. పొట్ట చేతపట్టుకొని పిల్లాపాపలతో ఇక్కడికి వచ్చిన అభాగ్యుల పట్ల ఇటుక బట్టీల నిర్వాహకులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో బట్టీల వద్ద గుడిసెల్లో బంధించి వారి చేత బలవంతంగా పనులు చేయిస్తున్నారు. తమ బాధలు చెప్పుకుందామంటే భాష రాక, నిర్బంధం నుంచి బయటపడే దారి తెలియక కన్నీళ్లతో కష్టాలను దిగమింగుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఒడిశా కార్మికులు, వారి కుటుంబాల పట్ల బట్టీల యజమానుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తుండగా, అది నిజమేనని చొప్పదండి ఘటనతో వెల్లడైంది. హైదరాబాద్‌లోని ఓ ఎన్‌జీవో పలుమార్లు అధికారులతో సంప్రదించి కార్మికుల దుర్భర జీవితాన్ని, ఇటుక బట్టీల యజమాని వికృత చేష్టలను కరీంనగర్ జిల్లా లోక్‌సత్తా ఉద్యమ సంస్థ నాయకుల సహకారంతో బయటపెట్టింది. ఇటుక బట్టీ యజమాని లింగంపల్లి కిషన్ ముక్కుపచ్చలారని ముగ్గురు బాలికలపై లైంగికదాడికి పాల్పడగా, పోలీసులు నిర్భయ చట్టం కేసు నమోదు చేశారు.