ఖమ్మం : పొలంలో బోరు మోటారు కాలిపోగా తండ్రి మందలిస్తాడనే భయంతో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు గ్రామానికి చెందిన మీరా, ముంతాజ్ దంపతుల కుమారుడు ఇమ్రాన్(21) ఇంటర్ వరకు చదువుకుని తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. బుధవారం రాత్రి పొలంలో బోరు మోటారు ఆన్ చేయటానికి వెళ్లాడు.
చిన్న పొరపాటు కారణంగా మోటారు కాలిపోయింది. దీంతో తండ్రి మందలిస్తాడేమోనని, ఇమ్రాన్ భయపడ్డాడు. అక్కడే ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం కూడా ఇమ్రాన్ ఇంటికి రాకపోయేసరికి మీరా పొలానికి వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. దీంతో ఇమ్రాన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.