ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు.
మేడ్చల్: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం జరిగింది. చెక్‌పోస్ట్ వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కిన యువకుడు తన ప్రియురాలితో పెళ్లి జరిపించాలని లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.