బావిలో పడి యువకుడు మృతి | Youth drowns in well | Sakshi
Sakshi News home page

బావిలో పడి యువకుడు మృతి

Published Fri, Dec 18 2015 6:11 PM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

Youth drowns in well

ఖానాపూర్ (ఆదిలాబాద్) : మతిస్థిమితం లేని ఓ యువకుడు బావిలో పడి మృతిచెందాడు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడుకు చెందిన ఎడ్ల పెద్ద మల్లేశ్, రాజవ్వ దంపతుల కుమారుడు మధు(20) ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఇంటి వద్దే తల్లిదండ్రులకు సాయంగా ఉంటున్నాడు. అయితే అతనికి మతిస్థిమితం సరిగా లేదు.

ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు. కాగా శుక్రవారం మండలంలోని జిల్లాపూర్ గ్రామం వద్ద ఉన్న వ్యవసాయ బావిలో మృతదేహం ఉండగా స్థానికులు గమనించి వెలికితీశారు. అది మధుగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement