
జహీరాబాద్‌లో రైల్వే లైఫ్‌లైన్!
స్థానిక రైల్వేస్టేషన్‌లో రైల్వే శాఖ లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ సేవలకు ప్రతిపాదించింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు అత్యాధునిక వైద్య సేవలను ఉచితంగా పొందేందుకు వీలు కలగనుంది.
జహీరాబాద్: స్థానిక రైల్వేస్టేషన్‌లో రైల్వే శాఖ లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ సేవలకు ప్రతిపాదించింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు అత్యాధునిక వైద్య సేవలను ఉచితంగా పొందేందుకు వీలు కలగనుంది. సెప్టెంబర్ 6 నుంచి 21వ తేదీవరకు రైల్వేస్టేషన్‌లోని గూడ్స్ ఫ్లాట్‌ఫాంపై ప్రత్యేక రైలు ద్వారా రోగులకు ఉచిత వైద్య సేవలను అందించనున్నారు. జిల్లాలోనే రైల్వే శాఖ మొదటి సారిగా లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా వైద్యశిబిరం నిర్వహించేందుకు ప్రతిపాదించింది. మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం సహకారంతో జహీరాబాద్‌లోని మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించేందుకు వీలుగా రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయించింది. జహీరాబాద్‌లో నిర్వహించేది 155వ ఉచిత వైద్య శిబిరం అవుతుందని రైల్వే శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ప్రత్యేక శిబిరం కొనసాగుతోందని, అక్కడి నుంచి జహీరాబాద్‌కు తరలించి వైద్య సేవలు అందించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
ఇప్పటి వరకు సుమారు 9 లక్షల మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలందించినట్టు వివరించాయి. శిబిరంలో ఆర్థోపెడిక్, కంటి, చెవి తదితర సమస్యలతో పాటు ఖరీదైన వైద్య సేవలందించనున్నట్టు, అవసరమైన వారికి ఆపరేషన్లకు కూడా నిర్వహిస్తారని వివరించాయి. ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా 1991లో రైల్వేశాఖ లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ వైద్య సేవలను ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరం కోసం అవసరమైన విద్యుత్, మంచినీరు తదితర సదుపాయాలను కల్పించేందుకు రైల్వే శాఖ, మహీంద్రా అధికారులు కృషి చేస్తున్నారు. రైళ్ల రాకపోకలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా గూడ్స్‌రైళ్లను నిలిపే ప్లాట్‌ఫాంపై ప్రత్యేక రైలును నిలిపి రోగులకు వైద్యసేవలందించేందుకు అధికారులు నిర్ణయించారు.