సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియను ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలోనే జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎంపీటీసీల ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం.. మంగళవారం మండల ప్రజా పరిషత్, జెడ్పీటీసీల రిజర్వేషన్లను ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో 20 మండలాలకుగాను.. 6 ఎంపీపీ స్థానాలను ఎస్టీలకు, 6 స్థానాలను ఎస్సీలకు, 8 స్థానాలను జనరల్ స్థానాలుగా ప్రకటించారు.
ఇందులో ఎస్సీలకు రిజర్వు చేసిన 6 స్థానాల్లో మూడు మహిళలకు, ఎస్టీలకు రిజర్వు చేసిన 6 స్థానాల్లో మూడు మహిళలకు కేటాయించగా.. జనరల్ స్థానాలుగా ఉన్న ఎనిమిదింట్లో 4 స్థానాలు మహిళలకు, 4 జనరల్ స్థానాలుగా ప్రకటించారు. ఇక జెడ్పీటీసీ స్థానాల్లో ఎస్సీలకు 4, బీసీలకు 2, ఎస్టీలకు 4, జనరల్‌కు 10 స్థానాలు కేటాయించారు. ఎస్సీలకు కేటాయించిన నాలుగింట్లో రెండు మహిళలకు, బీసీల్లో కేటాయించిన రెండింట్లో ఒకటి మహిళకు, ఎస్టీలకు కేటాయిం చిన నాలుగింట్లో రెండు మహిళలకు, జనరల్‌కు కేటాయించిన పది స్థానాల్లో 5 మహిళలకు రిజర్వు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 మండలాలకుగాను.. 18 ఎంపీపీ స్థానాలను ఎస్టీలకు కేటాయించగా.. అందులో మహిళలకు 9 స్థానాలు కేటాయిం చారు. ఇక జనరల్ స్థానాలు రెండు కేటాయించగా.. అందులో ఒక ఎంపీపీ స్థానం మహిళకు కేటాయించారు. ఒక స్థానం ఎస్సీ మహిళకు కేటాయించారు. అలాగే జెడ్పీటీసీల్లో 10 స్థానాలు ఎస్టీలకు కేటాయించగా.. అందులో ఐదు మహిళలకు రిజ ర్వు చేశారు. 11స్థానాలను జనరల్‌కు కేటాయిం చారు. అందులో 6 మహిళలకు రిజర్వు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెంలో ఎంపీటీసీల రిజర్వేషన్లు ఇలా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీటీసీలు మొత్తం 220 స్థానాలు ఉన్నాయి. వాటిలో ఎస్టీ మహిళలు 62, ఎస్టీ జనరల్ 56, ఎస్సీ మహిళలు 3, ఎస్సీ జనరల్ 2, జనరల్ మహిళలకు 45, జనరల్ విభాగానికి 52 స్థానాలను కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment