ఎంపీటీసీ, జెడ్పీటీసీల లెక్కతేలింది! | Zptc, Mptc Voters List In Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ, జెడ్పీటీసీల లెక్కతేలింది!

Published Tue, Apr 2 2019 7:06 PM | Last Updated on Tue, Apr 2 2019 7:07 PM

Zptc, Mptc Voters List In Mahabubnagar - Sakshi

సాక్షి, జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తూ ఓటర్‌ జాబితాను విడుదల చేశారు. శనివారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ వసంతకుమారీ ఓటర్‌ జాబితాను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జెడ్పీ కార్యాలయంలో మండలాల వారీగా జాబితాను ప్రచురించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పునర్విభజన ప్రక్రియతోపాటు రిజర్వేషన్లను ఇప్పటికే ఖరారు చేశారు. ఇక ఓటర్‌ జాబితా కూడా సిద్ధం కావడంతో ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్‌ వచ్చేది మాత్రమే మిగిలి ఉంది.   


పెరిగిన స్థానాలు 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో 64 జెడ్పీటీసీ, 982 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. ప్రస్తుతం 71 జెడ్పీటీసీలు, 805 ఎంపీటీసీకు చేరింది. ఈ మేరకు ఫిబ్రవరి నెల 20వ తేదీన ఎంపీటీసీ స్థానాల లెక్క తేల్చేందుకు మండలాల్లో పునర్విభజన డ్రాఫ్ట్‌ నోటిపికేషన్‌ జారీ అయింది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీ పదవీకాలం జూలై 4వ తేదీతో ముగుస్తుంది. జూన్‌లో ఈ ఎన్నికల ప్రక్రియ ముగించేలా ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదనలు పంపింది. జూలై 3, 4 తేదిల్లో ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీల కాల పరిమితి ముగియనుండటంతో ఈ వెంటనే కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఏర్పడేలా చర్యలు తీసుకుంటున్నారు.  


805 ఎంపీటీసీ స్థానాలు 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీల లెక్క ఇప్పటికే తేలింది. జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీల సంఖ్యను తేల్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 184 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. ఇందులో గండీడ్‌ మండలంలో అత్యధికంగా 20 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడగా నవాబ్‌పేట్‌లో 19 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అత్యల్పంగా మూసాపేట్, రాజాపూర్‌ మండలాల్లో 8 చొప్పన ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. జర్చర్లలో 15 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడగా ఇందులో జడ్చర్ల ఎంపీటీసీ స్థానానికి 2020 వరకు పాలక మండలి గడువు ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ ఒక్క స్థానానికి ఎన్నిక జరుగదు. మహబూబ్‌నగర్‌లో 441 గ్రామ పంచాయతీలు ఉంటే ఇందులో 184 ఎంపీటీసీ స్థానాలు  ఏర్పడ్డాయి.  

  • నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 453 పంచాయతీలు ఉంటే 212 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. ఇందులో బిజినపల్లి మండలంలో 35 గ్రామ పంచాయతీలుంటే 21 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. అత్యల్పంగా పదర మండలంలో 10 గ్రామ పంచాయతీలు ఉంటే 5 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేశారు.  
  • వనపర్తి జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉంటే 128 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేశారు. ఇందులో అత్యధికంగా పాన్‌గల్‌ మండలంలో 28 పంచాయతీలు ఉంటే కొత్తగా 14 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. అత్యల్పంగా అమరచింత మండలంలో 14 పంచాయతీలకు గాను    5 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.  
  • గద్వాల జిల్లాలో మొత్తం 255 పంచాయతీ ఉం టే ఇందులో 141 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. ఇందులో అత్యధికంగా అయిజ, గట్లు మండ లాల్లో 16 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. అత్యల్పకంగా వడ్డేపల్లిలో 6 ఎంపీటీసీ స్థానాలు అయ్యాయి.  
  • నారాయణపేట జిల్లాలో మొత్తం 280 గ్రామపంచాయతీలుంటే ఇందులో 140 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడగా అత్యధికంగా మద్దూర్‌ మండలంలో 19, అత్యల్పంగా మాగనూర్‌లో 7 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి.  

805 ఎంపీటీసీ స్థానాలు 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 982 స్థానాలు ఉండేవి. ఉమ్మడి జిల్లా  పరిదిలోని 6 జిల్లాలా వ్యాప్తంగా 805 స్థానాలకు ఏర్పాడ్డాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27,80,971 జనాబా ఉంది. దీని ఆదారంగానే ఎంపీటీసీల స్థానాలను అధికారులు గుర్తించారు. ప్రతి ఎంపీటీసీ ప్రదేశిక నియోజకవర్గంలో పంచాయతీరాజ్‌ ఎన్నిల నిబందనల మేరకు  3500 జనాబా ఉండేలా జాగ్రత్త పడ్డారు. దానికి అనుగుణంగానే ఎంపీటీసీ స్థానాలను గుర్తించారు. 2014లో ఎన్నికలు జరిగిన సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33,07,170 జనాభా ఉంది. దీని ప్రకారం ఎంపీటీసీ స్థానాలను నిర్ధారించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 982 ఎంపీటీసీ స్తానాలు ఉండేవి. గత 2014లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల 982 స్థానాలకు, 64 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కొన్ని మండలాలు ఇతర జిల్లాల్లో కలిశాయి. దీంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ప్రస్తుత జిల్లాలో 27,80,971 జనాభా ఉంది. దాని ప్రకారం ఎంపీటీసీ స్థానాలను గుర్తించారు. దానికి అనుగునంగా ప్రస్తుతం 805 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాడ్డాయి.  


ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గ్రామీణ ఓటర్ల వివరాలు 


71 జెడ్పీటీసీ స్థానాలు  
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 జెడ్పీటీసీలు స్థానాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో 64 జెడ్పీటీసీలు ఉండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ప్రతి మండల ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మూసాపేట్, రాజాపూర్, గండీడ్‌ (రంగారెడ్డి నుంచి జిల్లాలో కలిసింది), గద్వాల జిల్లాలో ఉండవెల్లి, రాజోలి, కేటీ దొడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పెంట్లవెల్లి, ఊరకొండ, చారకొండ, పదర, నారాయణపేట జిల్లాలో కృష్ణ, మరికల్, రంగారెడ్డి జిల్లాలో కడ్తాల్, నందిగామ, చౌదర్‌గూడ, వనపర్తిలో రేవల్లి, శ్రీరంగాపూర్, చిన్నంబావి, మదనాపూర్, అమరచింత మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటికి అధికారులు జెడ్పీటీసీ స్థానాలుగా గుర్తించారు. వీటిలో వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు.


ఏప్రిల్‌ 8న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ 
జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల నేపథ్యంలో ఏ ప్రిల్‌ 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తారు. 8వ తేదీన డ్రాఫ్ట్‌ గుర్తింపుకోసం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పోలింగ్‌స్టేషన్‌ ఏర్పాటులో ఏమైనా  అభ్యంతరాలు వస్తే స్వీకరిస్తారు. ఈ మేరకు 17వ తేదీన గుర్తుంపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. స మావేశంలో పోలింగ్‌ స్టేషన్లపై వచ్చే అభ్యంతరాల ను వారికి వివరించి సూచనలు, సలహాలు తీసుకుంటారు. 18వ తేదీన గుర్తించిన పోలింగ్‌ స్టేషన్‌ వివరాలతో కలెక్టర్‌కు నివేదిక పంపిస్తారు. 20వ తేదీన పోలింగ్‌స్టేషన్ల తుది జాబితా విడుదల చేస్తారు.  


పార్లమెంట్‌ ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్‌? 
ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల సందడి నడుస్తోంది. ఏప్రిల్‌ 11వ తేదీన పార్లమెంట్‌ ఎన్నికలు జరగను న్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన తరువాత ఎప్పుడై నా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. సమయం తక్కువగా ఉన్నం దున అధికార యం త్రాంగం ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియతోపాటు ఓటర్‌ జాబితా కూడా సిద్ధం చేశారు. ఇక ఎన్నికలు  నిర్వహించడమే తరువాయి. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల కోలాహలం నెలకుంది. ఈ ఎన్నికలు పూర్తి కాగానే స్థానిక సమయం మొదలు కానుంది.  

జెడ్పీటీసీ, ఎంపీసీటీ పునర్విభజన స్థానాల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. 71 జెడ్పీటీసీ, 805 ఎంపీటీసీ స్థానాలుగా అధికారులు గుర్తించారు. ఈ నివేదికలను కలెక్టర్‌ అప్రొవల్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు పంపించారు. వాటిని పరిశీలించిన అనంతరం ఎన్నికల కసరత్తు ప్రారంబించనున్నారు.  


ఓటర్‌ జాబితాను విడుదల చేశాం  
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పునర్విభజన ప్ర క్రియ ఇప్పటికే పూర్తి చేశాం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏ ర్పాట్లు అయిపోయా యి. ఓటర్‌జాబితాను సిద్ధం చేసి జెడ్పీ కా ర్యాలయంలో ప్రచురించాం. ఈ జాబితాను ఎన్నికల సంఘానికి నివేదిస్తాం. తదుపరి ఎ న్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే నెల 8న పోలింగ్‌ కేంద్రాలకు డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి 20న తుది జాబితా విడుదల చేస్తాం.  
– వసంతకుమారీ, జెడ్పీ సీఈఓ 


 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement