mptc election
-
నారావారిపల్లెలో చంద్రబాబుకు షాక్
-
రెండో విడత పరిషత్ ఎన్నికలు: 80 శాతం పోలింగ్ నమోదు
-
రెండోదశ పరిషత్ పోరుకు ముగిసిన ప్రచారం
-
వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న బ్యాలెట్ పేపర్
నేలకొండపల్లి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంపీటీసీ–3 పరిధిలోని పోలింగ్ బూత్‌లో ఓ యువకుడు తాను ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టిన సంఘటన హల్చల్ చేస్తోంది. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం తాను ఏ పార్టీకి ఓటు వేశాననే బ్యాలెట్ పేపర్‌ను వాట్సాప్‌లో పెట్టడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ఎన్నికల పోలింగ్‌కు వడదెబ్బ ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పరిషత్ తొలిదశ ఎన్నికల పోలింగ్‌పై వడదెబ్బ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎండ ప్రభావంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. 44డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 7 నుంచి 9 వరకు ఓటర్లు బారులు తీరినా, 10 తర్వాత పోలింగ్ కేంద్రాలు బోసిపోయాయి. ఎండ దెబ్బకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. -
కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
సాక్షి, హైదరాబాద్ : పరిషత్ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో అత్యంత కీలకంగా మారిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ విడతలో భాగంగా 195 జెడ్పీటీసీ స్థానాలకు 882 మంది, 2,096 ఎంపీటీసీ స్థానాల్లో 7,072 మంది (2 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ ఏకగ్రీవాలు మినహాయించి)అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సోమవారం సాయంత్రం 5 వరకు (5 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకే) సాగనుంది. నాగరకర్నూల్ జిల్లా గగ్గనపల్లి ఎంపీటీసీ స్థానంలో ఏకగ్రీవ ఎన్నికను రద్దుచేయడంతో పాటు, ఆ స్థానానికి విడిగా ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఎన్నిక నిర్వహించనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీటీసీ స్థానాలుండగా.. ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలు జరగడం లేదు. దీంతో 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలుంటాయి. -
పరిషత్ పోరు: తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
-
అధికార పార్టీలో టికెట్ల పోరు
ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిత్వాల ఖరారు అధికార పార్టీ టీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది. జిల్లాలో 20 జెడ్పీటీసీ, 189 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఒక్కో స్థానానికి సగటున ముగ్గురు చొప్పున టికెట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్... అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించిన నేపథ్యంలో అభ్యర్థిత్వాల ఖరారుపై ‘గులాబీ’ ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. ఇదేక్రమంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలో ఇంకా నిశ్శబ్దం వీడని పరిస్థితి ఉంది. –సాక్షి, మెదక్ ఇటీవల అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో కారు జెట్ స్పీడ్‌లో దూసుకుపోయిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ.. అందులోనూ ఘన విజయం సాధిస్తామనే ధీమా ఆ పార్టీలో ఉంది. ఇలా వరుస ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న క్రమంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో విజయం నల్లేరుపై నడకేనని భావిస్తున్న టీఆర్ఎస్లో ద్వితీయ శ్రేణి నాయకులు అధిక సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ టీసీ పదవులకు పోటీచేసేందుకు ఎగబడుతున్నారు. కొన్ని చోట్ల జెడ్పీటీసీ పదవిని నలుగురైదుగురు.. ఎంపీటీసీ పదవిని ఐదారుగురు ఆశిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీలో భిన్న పరిస్థితులు వరుస ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంటే.. వరుస ఓటమితో కాంగ్రెస్, బీజేపీల్లో పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. గుర్తింపు ఉన్న నేతలైనప్పటికీ.. ఎన్నికల్లో పోటీచేసి నెగ్గగలమా, పైసలు దండగ అంటూ పలువురు పోటీకి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. కొన్ని మండలాల్లో బరిలో దిగేందుకు అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. పలుచోట్ల అభ్యర్థుల కో సం హస్తం, కమలం నేతలు వెతుకులాటలో నిమగ్నమైనట్లు సమాచారం. జెడ్పీటీసీ స్థానాలపై మొ గ్గు చూపిస్తున్నప్పటికీ.. ఎంపీటీసీ బరిలో నిలిచే ందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మండలాల పరిధిలో ఇలా.. ►రేగోడు మండలంలో జెడ్పీటీసీ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈ స్థానం నుంచి టికెట్‌ను అధికార పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు ఆశి స్తున్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ గాడ్ఫాదర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ మండల పరిధిలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఒక్కోస్థానానికి టీఆర్ఎస్ నుంచి నలుగురు, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒక్కొక్కరు మాత్రమే టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ►పెద్దశంకరంపేట మండలంలో జెడ్పీటీసీ పదవిపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి సైతం ముగ్గురు ఆశావహులు టికెట్‌ను ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ మండల పరిధిలో 12 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. ఒక్కో స్థానానికి టీఆర్ఎస్ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు చొప్పున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నుంచి ఇప్పటి వరకు పోటీ చేసేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. మరోవైపు పెద్దశంకరంపేట మేజర్ పంచాయతీ పరిధిలో మూడు ఎంపీటీసీ స్థానాలకు స్వతంత్రులుగా నామినేషన్ వేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. ►చిన్నశంకరంపేట మండలంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు జనరల్ మహిళలకు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ పదవిని టీఆర్ఎస్ నుంచి ఆరుగురు మహిళలు ఆశిస్తుండగా.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీపీ పదవిని టీఆర్ఎస్ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఆశిస్తున్నట్లు తెలిసింది. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, నలుగురు ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా రు. కాంగ్రెస్ నుంచి ఒక్కరు చొప్పున మాత్రమే టికెట్ కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. ►శివ్వంపేట జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు జనరల్‌గా రిజర్వ్ అయ్యాయి. టీఆర్ఎస్ నుంచి ఎంపీపీ పదవిని నలుగురు, జెడ్పీటీసీ పదవిని ఐదుగురు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం ఒక్కరు మాత్రమే టికెట్‌ను ఆశిస్తున్నారు. ►నర్సాపూర్ మండలంలో జెడ్పీటీసీ స్థానం ఎస్టీకి రిజర్వేషన్ అయింది. తుల్జారంపేట తండాకు చెందిన ఒకరు.. నంద్యా తండాకు చెందిన మరొకరు టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి లింగాపూర్ తండాకు చెందిన ఒకరు టికెట్‌ను ఆశిస్తున్నారు. ఎంపీపీ సైతం ఎస్టీ మహిళకు రిజర్వేషన్ కాగా.. ఇద్దరు మాజీ ఎంపీపీలు టీఆర్ఎస్ నుంచి టికెట్ల వేటలో మునిగినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. బీజేపీలో ఇప్పటివరకు చలనం లేదు. ►వెల్దుర్తి మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు జనరల్‌కు కేటాయించారు. ఎంపీపీ పదవిని టీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా ముందుకు రాలేదు. జెడ్పీటీసీ పదవులను టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఆశిస్తున్నట్లు సమాచారం. ఎంపీటీసీ పదవులకు సంబంధించి టీఆర్ఎస్లో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. ఒక్కో స్థానంలో ముగ్గురు చొప్పున బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
చెయ్యి.. అందిస్తాం రా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాజకీయ భవిష్యత్తుకు సోపానంగా భావించే జిల్లా పరిషత్ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న టీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్వల విసురుతోంది. టీఆర్ఎస్లో ఎమ్మెల్యేల ఆదరణకు నోచుకోక, టికెట్టుకు దూరమవుతున్న మండల నాయకులను పార్టీలోకి ఆహ్వానించి, భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయిన నేతలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల కోసం టీఆర్ఎస్ అసంతృప్తి వాదులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. ‘గెలిచిన తరువాత పార్టీ మారబోను’ అనే అఫిడవిట్ సమర్పించిన బలమైన టీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకొని టికెట్టు ఇవ్వాలని ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యేల టికెట్టు కోసం పోటీపడి, సిట్టింగ్‌లకు సీట్లివ్వడంతో మిన్నకుండిపోయిన బలమైన టీఆర్ఎస్ నాయకులకు ఈసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు ఇచ్చేందుకు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అనాసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీపీగా మండలంలో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న నాయకులకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. పార్టీ ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించి బీఫారాలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పంపిం చింది. స్థానిక నియోజకవర్గ ఇన్చార్జిలు, సీనియర్ నేతలతో సంప్రదించిన తరువాత ఏకాభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షులు బీఫారాలను అభ్యర్థులకు అందజేయాల్సి ఉంటుంది. తొలి విడత ఎన్నికలు జరిగే మండలాలకు సంబంధించి బుధవారంలోగా బీఫారాలు ఇచ్చే అవకాశం ఉంది. వలసలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దృష్టి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాలలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో టీఆర్ఎస్కు షాక్ ఇచ్చేలా గత కొద్దిరోజులుగా పావులు కదుపుతున్నారు. కరీంనగర్, సిరిసిల్ల జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యమని చెబుతున్న ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జమ్మికుంట మునిసిపల్ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామిని టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేర్పించిన పొన్నం.. రామస్వామి సతీమణికి ఇల్లందకుంట జెడ్పీటీసీ టికెట్టు ఇవ్వనున్నారు. హుజూరాబాద్‌లో టికెట్టు వచ్చే అవకాశం లేని వారితో మాట్లాడి ఆయన కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో సైతం పొన్నం ఇదే రీతిన టీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. సిరిసిల్లలో ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావును కాదని పార్టీ మారే ధైర్యం నాయకులకు లేదు. టికెట్టు వచ్చినా, రాకపోయినా టీఆర్ఎస్లోనే కొనసాగుతామని వారు చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లేకపోవడం కూడా వలసలు పోయేందుకు వీల్లేని పరిస్థితి నెలకొంది. జగిత్యాలలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉన్నారని భావిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మంగళవారం అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభించనున్నారు. ధర్మపురిలో టీఆర్ఎస్ టికెట్టు కోసం పోటీ ఎక్కువగానే ఉన్నప్పటికీ, పార్టీ మారేందుకు నాయకులు ఆసక్తి చూపడం లేదని సమాచారం. పెద్దపల్లిలో మారనున్న సమీకరణలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి దాదాపుగా అన్ని మండలాలకు జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేశారు. సుల్తానాబాద్, పెద్దపల్లి, శ్రీరాంపూర్, జూలపల్లి, ఓదెల మండలాల్లో ఒక్కో చోట ముగ్గురేసి అభ్యర్థులు పోటీ పడుతుండగా, వారితో విడివిడిగా సమావేశమై టికెట్టు కేటాయింపుపై స్పష్టత ఇచ్చారు. జెడ్పీటీసీ పోటీలో ముందున్న ఆశావహులకు ఎంపీపీ హామీలతో బుజ్జగిస్తున్నారు. కాగా కొందరు సిట్టింగ్ జెడ్పీటీసీ, ఎంపీపీలకు ఆయన మొండి చేయి చూపనున్నారని స్పష్టమైంది. టికెట్టు రాని వారి గురించి మాజీ ఎమ్మెల్యే సిహెచ్.విజయరమణారావుకు సమాచారం అందడంతో ఆయన బలమైన అభ్యర్థులుగా భావిస్తున్న వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్‌లో టీఆర్ఎస్కు తిరుగుబాట్లు తప్పకపోవచ్చు. సుల్తానాబాద్‌లో జెడ్పీటీసీ టికెట్టు విషయంలో వివాదం తలెత్తింది. ఈ నియోజకవర్గంలోనే ఓ సిట్టింగ్ ఎంపీపీ, సీనియర్ నాయకుడికి జెడ్పీటీసీ టికెట్టు నిరాకరిస్తున్నట్లు తెలిసింది. మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు టీఆర్ఎస్ జెడ్పీటీసీ, ఎంపీపీ ఆశావహులపై వల విసురుతున్నారు. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా నిలవడంతో టీఆర్ఎస్ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చూస్తున్నారు. రామగుండంలో కాంగ్రెస్ నేత రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అసంతృప్తి మండల నాయకులను టీఆర్ఎస్లో చేర్పించే పనిలో ఉన్నారు. -
292మంది పోటీకి అనర్హులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల వ్యయాన్ని చూపించని వారిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. వారు మూడేళ్లపాటు ఎన్నికలకు అనర్హులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇలా జిల్లాలో 292 మందిని అనర్హులుగా పేర్కొంది. జిల్లాలో 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలామంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేశారు. వారు ఆ ఎన్నికల్లో ఎన్ని నిధులు ఖర్చు చేశారనేది ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఖర్చును అధికారులకు అప్పగించడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో సీరియస్ అయిన ఎన్నికల సంఘం వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించింది. 88 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు అనర్హులు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీచేసిన వారిలో 292 మంది ఓటమిపాలయ్యారు. పోలింగ్ ముగిసిన అనంతరం ప్రచారంలో వారు చేసిన ఖర్చులు చూపించాలని ఎన్నికల అధికారులు పలుమార్లు సూచించినా అభ్యర్థులు పెడచెవిన పెట్టారు. వీరిలో 88మంది జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. 2014 ఎన్నికల్లో వీరంతా జెడ్పీటీసీలుగా ఆయా మండలాల్లో పోటీ చేశారు. వారు నిబంధనల ప్రకారం ఎన్నికల్లో వారు పెట్టిన ఖర్చుల వివరాలను ఎన్నికల అధికారులకు తెలియపర్చాలి. కానీ ఓడిపోవడంతో వారు వాటిపై దృష్టి సారించలేదు. దీంతో ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకొని మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదంటూ అనర్హులుగా ప్రకటించింది. ఈ విషయాన్ని జనవరి మాసంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అనర్హత పొందిన వారు... జెడ్పీటీసీగా పోటీ చేసి లెక్కలు చూపనందుకు అనుముల మండలంలో 9 మంది, చందంపేటలో ఇద్దరు, చండూరులో 9, చింతపల్లి 6, చిట్యాల ఒకరు, దామరచర్ల, దేవరకొండలో 6 చొప్పున, గుండ్రపల్లిలో నలుగురు, గుర్రంపోడులో ఐదుగురు, కనగల్ 6, కట్టంగూర్ 5, కేతెపల్లి 5, మిర్యాలగూడ 7, మునుగోడు, నకిరేకల్‌లో ముగ్గురు చొప్పున, వేములపల్లి, నల్లగొండ, నార్కట్‌పల్లిలో ఒక్కొక్కరూ, పీఏపల్లి, పెద్దవూరలో 4గురు చొప్పున మొత్తం 88 మంది ఉన్నారు. వీరంతా అనర్హత వేటుకు గురయ్యారు. 204 మంది ఎంపీటీసీ పోటీదారులు ఎంపీటీసీలుగా పోటీ చేసి ఖర్చుల వివరాలను ఇవ్వకపోవడంతో 204 మందిని అనర్హులుగా ఈసంవత్సరం జనవరిలోనే ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో అనుముల మండలంలో ఒకరిపై అనర్హత వేటుకు గురికాగా, చండూరులో 33 మంది, దామరచర్లలో ఒకరు, గుర్రంపోడులో 30, కట్టంగూర్ 38, మునుగోడులో 21, నకిరేకల్‌లో 26, నిడమనూరులో 4గురు, పెద్దవూరలో 34మంది, వేములపల్లిలో 13 మంది ఉన్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో కోర్టు అనుమతితో కొందరు పోటీ.... ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వీరు పోటీకి అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. వారు సర్పంచులుగా పోటీ చేసేందుకు అనర్హులని ఎన్నికల అధికారులు పేర్కొనడంతో జిల్లాలో చాలామంది కోర్టును ఆశ్రయించారు. తాము ఎన్నికల్లో ఓటమి పాలవడం వల్ల ఎన్నికల ఖర్చుల వివరాలు అప్పగించాలనేది తెలియలేదని, దీంతో అప్పగించలేకపోయామని, వేరే ఉద్దేశం లేదని విన్నవించారు. దీంతో కోర్టు అనుమతితో దాదాపు 15 మంది వరకు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన చేపూరి యాదయ్య కోర్టు నుంచి అనుమతి పొంది సర్పంచ్‌గా పోటీ చేశాడు. చాలామంది కోర్టును ఆశ్రయించకపోవడంతో వారు పోటీ చేయలేకపోయారు. -
మెజారిటీ జెడ్పీ స్థానాలు సాధించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న పరిషత్తు ఎన్నికల్లో మెజారిటీ జెడ్పీ స్థానాలను సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్ని కలకు సంబంధించిన సమీక్షతోపాటు రాబోయే స్థాని క సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు అన్ని నియోజకవర్గాలలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఓటింగ్ సరళి ఉన్నట్లు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రధానిగా నరేంద్రమోదీనే ఉండా లన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అయినట్లు పేర్కొన్నారు. అలాగే ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలన్న దృక్పథం ప్రజల్లో వచ్చినట్లు సమావేశం అభిప్రాయపడింది. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం టీఆర్ఎస్ బీజేపీ మధ్యే పోటీ జరిగినట్లుగా ఉందని, టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రజలు భావించినట్లు కూడా సమావేశం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పూర్తి సామర్థ్యంతో పోటీ చేయాలని, మెజారిటీ జెడ్పీ స్థానాలు కైవసం చేసుకునేలా సన్నద్ధం కావాలని నిర్ణయించింది. టీఆర్ఎస్పై పోరాటం: లక్ష్మణ్ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. హంగ్ వచ్చే అవకాశముందని, కచ్చితంగా టీఆర్ఎస్ సహాయంతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందని, కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఖాయమని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్సే కాదు ఏ ఇతర పార్టీ సహకారం లేకుండానే ఎన్డీయే పూర్తిస్థాయిలో మెజారిటీ స్థానాలు సాధిస్తుందని వెల్లడించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ క్షేత్రస్థాయి పోరాటాన్ని ఉధృతం చేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను బట్టబయలు చేస్తామన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి అయోమయంలో ఉందని, అసలు ప్రభుత్వం పనిచేస్తుందా? లేదా అనే అనుమానాలు ప్రజలకు వస్తున్నాయని పేర్కొన్నారు. పాలనను గాలికి వదిలేసి, ఎన్నికలపైనే దృష్టి సారిస్తున్న ప్రభుత్వ పెద్దలు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల ప్రక్షాళన అనేది కేవలం ఉద్యోగులపై కక్ష సాధింపునకేనన్నారు. ఉద్యోగుల మధ్యంతర భృతి, పీఆర్ఎస్ ఏమైందని, కొత్త్త కొలువుల సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిత వ్యాన్ని త్రిశంకు స్వర్గంలో ఉంచారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేస్తామని, రాబో యే స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలాన్ని చాటుతామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ ఆహిర్, ఎంపీ బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, శాసనమండలి పక్ష నాయకులు ఎన్.రాంచందర్‌రావు, కిషన్‌రెడ్డి, ఇతర రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జిలు పాల్గొన్నారు. -
‘స్థానిక’ సమరానికి సన్నద్ధం
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో 42 ఎంపీటీసీ, నాలుగు ఎంపీపీ, నాలుగు జెడ్పీటీసీ స్థానాలతోపాటు జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ స్థానానికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై మరో సమరానికి సన్నద్ధమవుతోంది. మే నెలలో మూడు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో 61 గ్రామ పంచాయతీల పరిధిలో 42 ఎంపీటీసీలు, నాలుగు జెడ్పీటీసీ, నాలుగు ఎంపీపీ స్థానాలు మాత్రమే ఉండటంతో మొదటి దశలోనే స్థానిక ఎన్నికలను పూర్తి చేస్తామని జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు నివేదించింది. ఈ నెల 18న జరిగే కలెక్టర్ల సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశం ఫైనల్ కానున్నట్లు సమాచారం. జిల్లాలోని శామీర్‌పేట్ మండలంలో కొత్తగా ఏర్పడిన మూడు చింతలపల్లి రెవెన్యూ మండలంగా మాత్రమే కొనసాగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మండల పరిషత్ విషయానికి వస్తే మూడు చింతలపల్లి ఉమ్మడి శామీర్‌పేట్ మండలం పరిధిలోనే ఉంటుందని పేర్కొంటున్నారు. 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం మేడ్చల్ జిల్లాలో 61 గ్రామ పంచాయతీల పరిధిలో 42 ఎంపీటీసీ స్థానాల్లో 1.39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున 297 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన యంత్రాంగం అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో రెండు వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.39 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికార యంత్రాంగం అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోనుంది. 4 మండలాలతో మేడ్చల్ జెడ్పీ సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీ)నాలుగు మండలాలకు మాత్రమే పరిమితమైంది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగతా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు జీహెచ్ఎంసీ పరిధితో పాటు మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. దీంతో మేడ్చల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, 61 గ్రామ పంచాయతీలు, 42 ఎంపీటీసీ స్థానాలతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిజర్వేషన్లు ఇలా.. మేడ్చల్ జెడ్పీ చైర్మన్ స్థానాన్ని జనరల్ కేటగిరికి రిజర్ చేశారు. దీంతో నాలుగు మండలాల పరిధిలోని జెడ్పీటీసీ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో 61 గ్రామ పంచాయతీలు ఉండగా, 42 ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఘట్కేసర్ మండలంలో 11 గ్రామ పంచాయతీలకు సంబంధించి తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు, కీసర మండలంలో 11 గ్రామ పంచాయతీల పరిధిలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు, శామీర్‌పేట్ మండలంలో 22 గ్రామ పంచాయతీలకు సంబంధించి 15 ఎంపీటీసీ స్థానాలు, మేడ్చల్ మండలంలో 17 గ్రామ పంచాయతీలకు సంబంధించి 10 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. ఘట్కేసర్ మండలంలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీకి రెండు రిజర్వు చేయగా, ఇందులో ఒకటి ఎస్సీ జనరల్, ఒకటి ఎస్సీ మహిళకు కేటాయించారు. బీసీకి రెండు స్థానాలు రిజర్వు చేయగా ఒకటి బీసీ మహిళ, ఒకటి బీసీ జనరల్, ఇతరులకు ఐదు స్థానాలు రిజర్వు చేయగా, ఇందులో మహిళలకు రెండు , జనరల్‌కు మూడు కేటాయించారు. ♦ కీసర మండలంలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో ఎస్సీ మహిళకు ఒకటి రిజర్వు చేశారు. బీసీలకు మూడు స్థానాలు కేటాయించారు. ఇందులో రెండు స్థానాలు బీసీ జనరల్‌కు కేటాయించగా, ఒక స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఇతరులకు నాలుగు స్థానాలు కేటాయించారు. వీటి రెండు స్థానాలు మహిళలకు, రెండు స్థానాలు జనరల్‌కు రిజర్వు చేశారు. ♦ మేడ్చల్ మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఒకటి ఎస్టీ మహిళకు రిజర్వు చేశారు. ఎస్సీలకు సంబంధించి ఒకటి మాత్రమే కేటాయించగా మహిళలకు రిజర్వు చేశారు. బీసీలకు మూడు స్థానాలు కేటాయించగా ఇందులో ఒకటి మహిళలకు, రెండు స్థానాలు బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఇతరులకు ఐదు స్థానాలు రిజర్వు చేశారు. ఇందులో మహిళలకు రెండు స్థానాలు, జనరల్‌కు మూడు స్థానాలు కేటాయించారు. ♦ శామీర్‌పేట్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఇందులో ఎస్టీ మహిళకు ఒకటి రిజర్వు చేశారు. ఎస్సీలకు మూడు స్థానాలు కేటాయించగా.. ఇందులో ఒకటి మహిళకు, రెండింటిని జనరల్ (ఎస్సీ)కు రిజర్వు చేశారు. బీసీలకు మూడు స్థానాలు రిజర్వు కాగా, ఇందులో ఒకటి మహిళ, రెండు జనరల్‌కు కేటాయించారు. ఇతరులకు ఎనిమిది స్థానాలు రిజర్వు చేయగా, ఇందులో నాలుగు మహిళ, నాలుగు జనరల్‌కు కేటాయించారు. ఎంపీపీ ఇలా.. జిల్లాలో నాలుగు మండలాలు ఉన్నాయి. శామీర్‌పేట్ ఎంపీపీ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేశారు. కీసర ఎంపీపీ స్థానం బీసీ జనరల్, ఘట్కేసర్ ఎంపీపీ స్థానాన్ని ఆన్రిజర్వుడ్కు కేటాయించారు. మేడ్చల్ ఎంపీపీ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వు చేశారు. జెడ్పీటీసీ ఇలా.. శామీర్‌పేట్ జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. కీసర జెడ్పీటీసీ స్థానాన్ని బీసీ జనరల్‌కు, ఘట్కేసర్ స్థానాన్ని అన్‌రిజర్వుడ్‌కు కేటాయించారు. మేడ్చల్ జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వు చేశారు. -
అన్ని జిల్లాల జెడ్పీ పీఠాలే లక్ష్యం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మరోసారి ఘనవిజయం సాధిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మొత్తం 32 జిల్లాలకు 32 జెడ్పీ ఛైర్మన్ పీఠాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. దీంతో పాటు ఎన్నికలు జరుగనున్న సుమారు 530పైగా మండల పరిషత్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు రానున్న ఎన్నికల్లోనూ నిరాశ తప్పదన్నరు. ఈ మేరకు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ఎన్నికల కమిషన్‌ను కోరిన నేపథ్యంలో రానున్న వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలన్నరు. ఈ సమావేశంలో జిల్లాల వారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కేటీఆర్ ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. గత నెల రోజులుగా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించామని, ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మరోసారి బ్రహ్మరథం పట్టనున్నారని కేటీఆర్ తెలిపారు. ఇదే తరహాలో వచ్చే స్థానికసంస్థల ఎన్నికల్లో పనిచేయాలన్నరు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల సేవలను వినియోగించుకొనేలా ముందుకు పోతామన్నరు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేస్తారని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీల లెక్కతేలింది!
సాక్షి, జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తూ ఓటర్ జాబితాను విడుదల చేశారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ వసంతకుమారీ ఓటర్ జాబితాను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జెడ్పీ కార్యాలయంలో మండలాల వారీగా జాబితాను ప్రచురించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పునర్విభజన ప్రక్రియతోపాటు రిజర్వేషన్లను ఇప్పటికే ఖరారు చేశారు. ఇక ఓటర్ జాబితా కూడా సిద్ధం కావడంతో ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వచ్చేది మాత్రమే మిగిలి ఉంది. పెరిగిన స్థానాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో 64 జెడ్పీటీసీ, 982 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. ప్రస్తుతం 71 జెడ్పీటీసీలు, 805 ఎంపీటీసీకు చేరింది. ఈ మేరకు ఫిబ్రవరి నెల 20వ తేదీన ఎంపీటీసీ స్థానాల లెక్క తేల్చేందుకు మండలాల్లో పునర్విభజన డ్రాఫ్ట్ నోటిపికేషన్ జారీ అయింది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీ పదవీకాలం జూలై 4వ తేదీతో ముగుస్తుంది. జూన్‌లో ఈ ఎన్నికల ప్రక్రియ ముగించేలా ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ప్రతిపాదనలు పంపింది. జూలై 3, 4 తేదిల్లో ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీల కాల పరిమితి ముగియనుండటంతో ఈ వెంటనే కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఏర్పడేలా చర్యలు తీసుకుంటున్నారు. 805 ఎంపీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీల లెక్క ఇప్పటికే తేలింది. జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీల సంఖ్యను తేల్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 184 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. ఇందులో గండీడ్ మండలంలో అత్యధికంగా 20 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడగా నవాబ్‌పేట్‌లో 19 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అత్యల్పంగా మూసాపేట్, రాజాపూర్ మండలాల్లో 8 చొప్పన ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. జర్చర్లలో 15 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడగా ఇందులో జడ్చర్ల ఎంపీటీసీ స్థానానికి 2020 వరకు పాలక మండలి గడువు ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ ఒక్క స్థానానికి ఎన్నిక జరుగదు. మహబూబ్‌నగర్‌లో 441 గ్రామ పంచాయతీలు ఉంటే ఇందులో 184 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 453 పంచాయతీలు ఉంటే 212 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. ఇందులో బిజినపల్లి మండలంలో 35 గ్రామ పంచాయతీలుంటే 21 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. అత్యల్పంగా పదర మండలంలో 10 గ్రామ పంచాయతీలు ఉంటే 5 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉంటే 128 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేశారు. ఇందులో అత్యధికంగా పాన్‌గల్ మండలంలో 28 పంచాయతీలు ఉంటే కొత్తగా 14 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. అత్యల్పంగా అమరచింత మండలంలో 14 పంచాయతీలకు గాను 5 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గద్వాల జిల్లాలో మొత్తం 255 పంచాయతీ ఉం టే ఇందులో 141 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. ఇందులో అత్యధికంగా అయిజ, గట్లు మండ లాల్లో 16 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. అత్యల్పకంగా వడ్డేపల్లిలో 6 ఎంపీటీసీ స్థానాలు అయ్యాయి. నారాయణపేట జిల్లాలో మొత్తం 280 గ్రామపంచాయతీలుంటే ఇందులో 140 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడగా అత్యధికంగా మద్దూర్ మండలంలో 19, అత్యల్పంగా మాగనూర్‌లో 7 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. 805 ఎంపీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 982 స్థానాలు ఉండేవి. ఉమ్మడి జిల్లా పరిదిలోని 6 జిల్లాలా వ్యాప్తంగా 805 స్థానాలకు ఏర్పాడ్డాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27,80,971 జనాబా ఉంది. దీని ఆదారంగానే ఎంపీటీసీల స్థానాలను అధికారులు గుర్తించారు. ప్రతి ఎంపీటీసీ ప్రదేశిక నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఎన్నిల నిబందనల మేరకు 3500 జనాబా ఉండేలా జాగ్రత్త పడ్డారు. దానికి అనుగుణంగానే ఎంపీటీసీ స్థానాలను గుర్తించారు. 2014లో ఎన్నికలు జరిగిన సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33,07,170 జనాభా ఉంది. దీని ప్రకారం ఎంపీటీసీ స్థానాలను నిర్ధారించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 982 ఎంపీటీసీ స్తానాలు ఉండేవి. గత 2014లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల 982 స్థానాలకు, 64 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కొన్ని మండలాలు ఇతర జిల్లాల్లో కలిశాయి. దీంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ప్రస్తుత జిల్లాలో 27,80,971 జనాభా ఉంది. దాని ప్రకారం ఎంపీటీసీ స్థానాలను గుర్తించారు. దానికి అనుగునంగా ప్రస్తుతం 805 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాడ్డాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రామీణ ఓటర్ల వివరాలు 71 జెడ్పీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 జెడ్పీటీసీలు స్థానాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో 64 జెడ్పీటీసీలు ఉండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ప్రతి మండల ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మూసాపేట్, రాజాపూర్, గండీడ్ (రంగారెడ్డి నుంచి జిల్లాలో కలిసింది), గద్వాల జిల్లాలో ఉండవెల్లి, రాజోలి, కేటీ దొడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలో పెంట్లవెల్లి, ఊరకొండ, చారకొండ, పదర, నారాయణపేట జిల్లాలో కృష్ణ, మరికల్, రంగారెడ్డి జిల్లాలో కడ్తాల్, నందిగామ, చౌదర్‌గూడ, వనపర్తిలో రేవల్లి, శ్రీరంగాపూర్, చిన్నంబావి, మదనాపూర్, అమరచింత మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటికి అధికారులు జెడ్పీటీసీ స్థానాలుగా గుర్తించారు. వీటిలో వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు. ఏప్రిల్ 8న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల నేపథ్యంలో ఏ ప్రిల్ 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తారు. 8వ తేదీన డ్రాఫ్ట్ గుర్తింపుకోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పోలింగ్‌స్టేషన్ ఏర్పాటులో ఏమైనా అభ్యంతరాలు వస్తే స్వీకరిస్తారు. ఈ మేరకు 17వ తేదీన గుర్తుంపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. స మావేశంలో పోలింగ్ స్టేషన్లపై వచ్చే అభ్యంతరాల ను వారికి వివరించి సూచనలు, సలహాలు తీసుకుంటారు. 18వ తేదీన గుర్తించిన పోలింగ్ స్టేషన్ వివరాలతో కలెక్టర్‌కు నివేదిక పంపిస్తారు. 20వ తేదీన పోలింగ్స్టేషన్ల తుది జాబితా విడుదల చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్? ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందడి నడుస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరగను న్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన తరువాత ఎప్పుడై నా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. సమయం తక్కువగా ఉన్నం దున అధికార యం త్రాంగం ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియతోపాటు ఓటర్ జాబితా కూడా సిద్ధం చేశారు. ఇక ఎన్నికలు నిర్వహించడమే తరువాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోలాహలం నెలకుంది. ఈ ఎన్నికలు పూర్తి కాగానే స్థానిక సమయం మొదలు కానుంది. జెడ్పీటీసీ, ఎంపీసీటీ పునర్విభజన స్థానాల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. 71 జెడ్పీటీసీ, 805 ఎంపీటీసీ స్థానాలుగా అధికారులు గుర్తించారు. ఈ నివేదికలను కలెక్టర్ అప్రొవల్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు పంపించారు. వాటిని పరిశీలించిన అనంతరం ఎన్నికల కసరత్తు ప్రారంబించనున్నారు. ఓటర్ జాబితాను విడుదల చేశాం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పునర్విభజన ప్ర క్రియ ఇప్పటికే పూర్తి చేశాం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏ ర్పాట్లు అయిపోయా యి. ఓటర్‌జాబితాను సిద్ధం చేసి జెడ్పీ కా ర్యాలయంలో ప్రచురించాం. ఈ జాబితాను ఎన్నికల సంఘానికి నివేదిస్తాం. తదుపరి ఎ న్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే నెల 8న పోలింగ్ కేంద్రాలకు డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేసి 20న తుది జాబితా విడుదల చేస్తాం. – వసంతకుమారీ, జెడ్పీ సీఈఓ -
పరిషత్ ఎన్నికలకు కసరత్తు షురూ
సాక్షి, వరంగల్ రూరల్: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఏప్రిల్ మాసంలో లోకసభ ఎన్నికలు జరుగనుండడంతో.. వెనువెంటనే మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు.. ఓటరు జాబితా.. పోలింగ్‌కు అవసరమయ్యే సామగ్రి.. ఉద్యోగుల నియామకంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ మేరకు బుధవారం మండల స్థాయిలో ఎంపీటీసీ స్థానాలు, జిల్లా స్థాయిలో జెడ్పీ స్థానాలు వివరాలతో కూడిన ముసాయిదాను జాబితాను కలెక్టర్ల ఆమోదంతో విడుదల చేసింది. ఈ నెల 22 వరకు అభ్యంతరాలు స్వీకరించి 25న తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ అభ్యంతరాలను ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో స్వీకరించనున్నారు. కొత్త జిల్లాలు, కొత్తగా ఏర్పడ్డ మండలాలు, పంచాయతీలను దృష్టిలో ఉంచుకొని ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలను పునర్విభజించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఈ నెల 16న జిల్లా అధి కారులకు ఉత్తర్వులను జారీ చేసింది. 2011 జనా భా లెక్కల ప్రకారం ఈ ప్రాదేశిక నియోజకవర్గాలను గుర్తించాలని ఆదేశించింది. ఈ మేరకు రం గంలోకి దిగిన పంచాయతీరాజ్ అధికారులు బుధవారం పునర్ వ్యవస్థీకరించిన జెడ్పీ,మండల స్థానాలతో కూడిన ముసాయిదా జాబితాను వెల్లడించారు. ఈనెల 21, 22వ తేదీల్లో అభ్యంతరా లను స్వీకరిస్తారు. 23, 24వ తేదీల్లో వాటిని పరి శీలించి పరిష్కరిస్తారు. ఈ నెల 25న తుది జాబి తాను ప్రకటించనున్నారు. పూర్వపు వరంగ ల్ జిల్లాలో 705ఎంపీటీసీలు, 50జెడ్పీటీసీలున్నాయి. 3500 జనాభాకు ఒక ఎంపీటీసీ.. జిల్లాలో మండలం యూనిట్‌గా 2011 జనాభా ప్రాతిపదికన 3500 మంది జనాభాకు ఒక ఎంపీటీసీని కేటాయించారు. ఈ నెల నెల 25న తుది జాబితాను సిద్ధం చేసి తర్వాత ప్రభుత్వ ఆదేశానుసారం రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కొరతను అధిగమించేందుకు ఈ సారి బ్యాలెట్ విధానంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. -
జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల కసరత్తు షురూ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా రాష్ట్రంలో జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 2014లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉమ్మడి ఏపీలో జరిగాయి. గతంలో జిల్లా ప్రజాపరిషత్‌ల సంఖ్య 9 ఉండగా, ఇప్పుడు కొత్తగా జిల్లాలు (తాజాగా ప్రకటించిన రెండు జిల్లాలు కలిపి), మండలాల పునర్విభజనతో జిల్లాల సంఖ్య 32కు (ఆగస్టుతో కాలపరిమితి ముగియనున్న ఖమ్మం జెడ్పీ దాని పరిధిలోని భద్రాద్రి జిల్లా కలిపి) పెరగబోతోంది. వచ్చే జూలై 3, 4 తేదీలతో పాత జిల్లా పరిషత్‌ల కాలపరిమితి ముగియనుండటంతో కొత్తజిల్లా పరిషత్‌లకు ఎన్నిక లు జరగాల్సి ఉంది. మే చివరి కల్లా మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికల నిర్వహణ పూర్తయ్యేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తోంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీటీసీలు, వాటి పరిధిలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాల్సి ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల గుర్తింపు ఆ తర్వాత రిజర్వేషన్ల ఖరారు చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు: వచ్చే నెలాఖరులోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల ఖరారు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇదివరకే ఎస్ఈసీ సూచించింది. మే ఆఖరులోగా ఈ ఎన్నికలు పూర్తయితే జూలై 5న 30 జెడ్పీలు, ఆగస్టు 7న ఖమ్మం, భద్రాద్రి జెడ్పీ (ఉమ్మడి జెడ్పీ గడువు ముగిశాక) పాలకవర్గాలు బాధ్యతలు చేపడతాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, కొత్త గ్రామపంచాయతీల ప్రాతిపదికన జిల్లా, మండల ప్రజాపరిషత్ స్థానాలు ఖరారుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటోంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన 32 జెడ్పీలు, కొత్త మండలాల ప్రాతిపదికన మండల ప్రజాపరిషత్‌లు ఏర్పడతాయి. గతంలో 438 మండలాల నుంచి పునర్విభజన తర్వాత మరో 96 గ్రామీణ మండలాల ఏర్పాటుతో ఈ సంఖ్య 534కు పెరగగా తాజాగా మరో 4 మండలాలను పెంచడంతో 538కు చేరనుంది. దీంతో జెడ్పీటీసీల సంఖ్య కూడా 538కు పెరగనుంది. చిన్న జిల్లాల పరిస్థితేంటీ?: కొత్తగా ఏర్పడిన కొన్ని జిల్లాల్లో గ్రామీణ మండలాలు మరీ తక్కువ సంఖ్యలో ఉండటంతో ఆ జిల్లాల్లో జిల్లా పరిషత్‌ల ఏర్పాటు సాధ్యమేనా అన్న సందేహాలున్నాయి. ఈ జిల్లాల్లోని ఆయా మండలాలను పొరుగునే ఉన్న జిల్లాల్లో విలీనం చేస్తారా అన్న దానిపైనా ఇంకా స్పష్టత రాలేదు. -
పరిషత్ ఎన్నికలు ఎట్లా..?
సాక్షి, మంచిర్యాల : పంచాయతీలతో పాటు జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు సైతం నిర్వహించేం దుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ రేపుతోం ది. కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటికీ, జిల్లా పరిషత్‌ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన గెజిట్‌ను విడుదల చేయకపోవడంతో పాత ఆదిలాబాద్ స్థాయిలోనే జెడ్పీ కొనసాగుతోంది. జిల్లాల పునర్విభజన తరువాత జిల్లా పరిషత్‌లు నామమాత్రంగానే తయారయ్యాయి. నామ్కేవాస్తే సమావేశాలు మినహా అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి ముందడుగు లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులను జిల్లా పరిషత్‌లకు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో 2016 నుంచి జెడ్పీల ద్వారా అభివృద్ధి పనులు ఆగిపోయాయి. అదే ఏడాది అక్టోబర్‌లో కొత్త జిల్లాలను ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఉన్న జెడ్పీ స్వరూపమే మారిపోయింది. ఇప్పటి వరకు కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు సంబంధించి జెడ్పీల విషయంలో ప్రభుత్వం గెజిట్ సైతం విడుదల చేయలేదు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలతోపాటు జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు కూడా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుండడం చర్చనీయాంశమైంది. జూలై 2019 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ఉన్నప్పటికీ, దాదాపు ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడం వెనుక ప్రభుత్వ ఆలోచన ఏమిటో నాయకులకు అర్థం కావడం లేదు. ఉమ్మడి జిల్లా యూనిట్‌గానే ఎన్నికలా..? జిల్లా పరిషత్‌లకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త విధివిధానాలు రాలేదు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపాలని నిర్ణయించినప్పటికీ జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వలేదు. దీనికి సంబంధించిన గెజిట్ కూడా విడుదల కాని నేపథ్యంలో కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటు అనేది ఇప్పట్లో అనుమానమే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలుగా ఉన్నప్పుడు ఎన్నికలు జరిగాయి. జిల్లాల పునర్విభజన తరువాత అవి 70కి పెరగడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఎన్నికలు జరిగితే ఈసారి 70 మంది జెడ్పీటీసీలు, 70 మంది ఎంపీపీలు జిల్లా పరిషత్‌లో కొలువు తీరుతారు. ఒకవేళ ప్రభుత్వం కొత్త జిల్లాల వారిగా జిల్లా పరిషత్‌లను నోటిఫై చేస్తే ఉమ్మడి ఆదిలాబాద్‌లో నాలుగు జిల్లా పరిషత్‌లు ఏర్పాటవుతాయి. కానీ కొత్త జిల్లాల వారీగా పరిషత్‌ల ఏర్పాటు ఇప్పట్లో వీలుకాదని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకపోయినా.. తీరా జెడ్పీటీసీల నుంచి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ను ఏ ప్రాతిపదికన ఎన్నుకుంటారనేదే ఇప్పుడు ప్రశ్న. సిద్ధమవుతున్న గ్రామాల ఓటర్ల జాబితా కొత్త పంచాయతీ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్ధమవుతోంది. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు దిశానిర్ధేశం చేశారు. ఈనెల 30న అన్ని గ్రామ పంచాయతీలలో ముసాయిదా ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచాలని తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని మే 17న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఆదేశించారు. దీనిని బట్టి జూన్‌లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. రాజకీయ పార్టీల్లో అయోమయం చివరిసారిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2014 ఏప్రిల్‌లో జరిగాయి. అయితే అప్పటికే తెలంగాణను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జూలైలో జెడ్పీలు కొలువుతీరాయి. అంటే జూలై 2019 వరకు ప్రస్తుత జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కొనసాగే అవకాశం ఉంది. అయినా ఏడాది ముందుగానే ఈ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేయడం వెనుక మతలబు ప్రభుత్వానికే తెలియాలని ఆసిఫాబాద్ జెడ్పీటీసీ కొయ్యల ఏమాజీ వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల విషయంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతగా ఆసక్తి చూపించని పరిస్థితి నెలకొంది. సాధారణ ఎన్నికల ముందు స్థానిక పంచాయతీ పెట్టుకుంటే సమస్యలు ఎదురవుతాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహిస్తే వర్గ పోరాటాలు, కుమ్ములాటలతో అసలుకే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ఉత్సాహంతో కనిపిస్తున్నప్పటికీ, ఆ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలకు కొదువ లేదు. బీజేపీ వేళ్ల మీద లెక్కించే స్థాయిలోనే కొన్ని మండలాల్లో ఉనికి చాటుకుంటోంది. టీడీపీ కనుమరుగు కాగా, కొత్త పార్టీలు తెలంగాణ జన సమితి, జనసేన పరిస్థితి అంచనా వేయలేం. -
రీపోలింగ్‌లో రిగ్గింగ్!
కొండాపురం: బ్యాలెట్ పేపర్లను చెదలు తినేయడంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పుయర్రబల్లి ఎంపీటీసీ పరిధిలో ఆదివారం రీపోలింగ్ నిర్వహించారు. ఈ సెగ్మెంట్ పరిధిలోని పొట్టిపల్లి, ఇస్కదామెర్ల, మన్నంవారిపల్లిలో పోలింగ్ జరిగింది. అయితే పొట్టిపల్లిలో టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు తెలిపారు. తమ ఏజెంట్లను బయటకు నెట్టేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ఒక్కొక్కరు రెండు, మూడు ఓట్లు వేశారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామన్నారు. -
టీఆర్ఎస్ సత్తా చాటింది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తం స్థానాలను కైవసం చేసుకుంది. పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి (పీఎస్ఆర్) ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాలలో జడ్పీ టీసీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పదిలమయ్యాయి. ఎంపీటీసీ స్థానాలలోనూ వారికి ఆధిక్యం లభించింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గం పరిధి లోని మొత్తం నాలుగింటిలో రెండు జడ్పీటీసీ స్థానాలు, మెజార్టీగా 33 ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధ న్కు మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు ‘స్థానిక’ంలో ఎదురుదెబ్బ తగిలింది. కాగా బాల్కొండ నియోజకవర్గంలోని ఐదు జడ్పీటీసీ స్థానాలకు గాను నాలిగింట టీఆర్ఎస్ గెలవగా ఒక్కటే కాంగ్రెస్‌కు దక్కింది. ఆర్మూరు నియోజకవర్గంలో మూ డు జడ్పీటీసీ స్థానాల్లో రెండు టీఆర్ఎస్ కు దక్కాయి. ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మా జీ విప్ ఈరవత్రి అనిల్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిలకు జడ్పీటీసీల్లో ఆధిక్యం ద క్కలేదు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఖాతా తెరవకుం డా పూర్తిగా పతనమై పోయిన తెలుగుదేశం పా ర్టీ ఎంపీటీసీ సభ్యుల విషయంలోను బీజేపీ కం టె వెనుకబడి పోయింది. మున్సిపల్, ‘పరిషత్’ ఎన్నికల్లో ఆ పార్టీ ఉనికిని కోల్పోయింది. క్షణక్షణం టెన్షన్ రెండు విడతలలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల లెక్కింపు మంగళవారం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. 36 జడ్పీటీసీ, 570 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీలలో రెండు విడతలలో ఎన్నికలు జరిగాయి. 36 జడ్పీటీసీలకు 195 మంది, 570 ఎంపీటీసీ స్థానాలకు 2,819 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, గ్రామీణ ప్రాంతాలలోని మొత్తం 14,15,153 మంది ఓటర్లకు గాను 10,87,821 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ధర్పల్లి మండలం మై లార ం, పిట్లం మండలం బండపల్లి ఎంపీటీసీలకు 18న రీ-పోలింగ్ జరగనుంది. కాగా నిజామాబాద్, బోధన్, కామారెడ్డి రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగింది. 24 జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్, 12 జడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీలు గెలుచుకున్నాయి. గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు 20, టీఆర్ఎస్కు 4, టీడీపీకి 12 జడ్పీటీసీ స్థానాలు దక్కగా, ఈ సారి టీడీపీకి ఒక్క స్థానం కూడ దక్కలేదు. మొదటి నుంచి టీడీపీకి కంచుకోటలా ఉన్న ఇందూరు జిల్లాలో బీటలు బారాయి. కాగా 581 ఎంపీటీసీ స్థానాలకుగాను టీఆర్ఎస్ 240, కాంగ్రెస్ 225 దక్కించుకున్నాయి. బీజేపీ 34, టీడీపీ 31, ఎంఐఎంకు రెండురాగా, 49 స్థానాల్లో స్వతంత్రులు, ఇతరులు గెలుపొందారు. ఎంపీటీసీ ఎన్నికల్లోను టీడీపీకి బీజేపీ కంటే మూడు స్థానాలు తక్కువ వచ్చాయి. -
ఇక ‘సార్వత్రిక’ సమరం
సాక్షి, నెల్లూరు: మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు దాదాపు పూర్తవడంతో ఇక అందరి దృష్టి సార్వత్రిక సమరంపై పడింది. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు, అభ్యర్థిత్వాలు ఖరారు చేసుకున్న వారు ప్రచారంలో, టికెట్ రేసులో ఉన్నవారు లాబీయింగ్‌లో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 11 గంటలకు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. సెలవులు మినహాయిస్తే మిగిలిన రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. నెల్లూరు ఎంపీ స్థానానికి సంబంధించి కలెక్టరేట్లో, తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించి నెల్లూరులోని జెడ్పీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. నెల్లూరు సిటీ అభ్యర్థులు స్థానిక కార్పొరేషన్కార్యాలయం, కోవూరు, ఉదయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరిలకు సంబధించి అక్కడి తహశీల్దార్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నెల్లూరు రూరల్, ఆత్మకూరు, గూడూరు, కావలి నియోజకవర్గాలకు సంబంధించి సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లోనూ, సర్వేపల్లి నియోజకవర్గం అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు వెంకటాచలం తహశీల్దార్ కార్యాలయంలోనూ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదు రోజులే.. నామినేషన్ల సమర్పణకు పేరుకు ఎనిమిది రోజులు సమయం ఉన్నప్పటికీ అం దులో మూడు రోజలు సెలవులు పోతున్నాయి. మిగిలిన ఐదు రోజుల్లో తమ పేరు న ఎప్పుడు మంచి ముహూర్తం ఉందోనని చూసుకునే పనిలో అభ్యర్థులు తలమునకలవుతున్నారు. మరోవైపు తమ పార్టీ అధిష్టానాల వద్ద అభ్యర్థిత్వాలు ఖరారు చేసుకున్న వారు ప్రచారంలో నిమగ్నం కాగా, ఆశావహులు మాత్రం టికెట్ రేసులో బిజిబిజీగా ఉన్నారు. అదే సమయంలో నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రిటర్నింగ్ అధికారులు వీరే నెల్లూరు, తిరుపతి ఎంపీ స్థానాలతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నియమించింది. నెల్లూరు ఎంపీ స్థానానికి కలెక్టర్ ఎన్.శ్రీకాంత్, తిరుపతి లోక్‌సభకు జాయింట్ కలెక్టర్ జి.రేఖారాణి రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. నెల్లూరు సిటీకి తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ విజయచందర్, నెల్లూరు రూరల్‌కు స్థానిక ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, ఉదయగిరికి డ్వామా పీడీ గౌతమి, వెంకటగిరికి డీఆర్డీఏ పీడీ చంద్రమౌళి, కోవూరుకు జెడ్పీ సీఈఓ జితేంద్ర, సర్వేపల్లికి పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కలెక్టర్ జి.మల్లికార్జున, కావలి, గూడూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు సంబంధిత ఆర్డీఓలు వెంకటరమణారెడ్డి, కె.శ్రీనివాసరావు, కోదండరామిరెడ్డి, సూళ్లూరుపేటకు నాయుడుపేట ఆర్డీఓ ఎంవీ రమణ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఖరారు కాని లెక్కింపు కేంద్రాలు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అధికారులు ఎంపిక చేసిన కేంద్రాల వివరాలను ఇప్పటికే కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. ఎన్నికల కమిషన్ ఆమోదించిన తర్వాత ఆ వివరాలను వెల్లడించనున్నారు. -
తారస్థాయిలో ప్రచారాలు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల ప్రచారాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనున్న మలివిడత మండలాల్లో బుధవారం సాయంత్రంతో ప్రచారపర్వం ముగియనుంది. దాంతో చివరి అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు ప్రచారాలతో గ్రామాలను హోరెత్తిస్తున్నాయి. ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ఓట ర్లకు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తొలివిడతలో 18 మండలాల్లో ఎన్నికలు జరగ్గా.. మిగిలిన 20 మండలాల్లో మలివిడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మండలాల్లోని 20 జెడ్పీటీసీ, 346 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వాస్తవానికి 358 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ 12 స్థానాలు ఏకగ్రీవం కావడంతో 346 ఎంపీటీసీ స్ధానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. జెడ్పీటీసీ స్థానాలకు 68 మంది, ఎంపీటీసీ స్థానాలకు 815 మంది పోటీ పడుతున్నారు. గత పది రోజులుగా వీరంతా ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. మరికొద్ది గంటల్లో బహిరంగ ప్రచారానికి తెర పడనుండటంతో తెరచాటు ప్రచారానికి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభపరిచే ప్రక్రియకు తెరలేపనున్నారు. మొదటి విడత పోలింగ్ సరళి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నట్లు తేలడంతో ఆ పార్టీ తరపున రెండో విడతలో బరిలో ఉన్న అభ్యర్ధులు మరింత ఉత్సాహంతో ప్రచారం చేసుకు వెళ్తున్నారు. కాగా రెండు విడతలోనైనా కోలుకోవాలన్న ఆశతో తెలుగుదేశం అభ్యర్ధులు అన్ని రకాల ఎత్తులు వేస్తున్నారు. ప్రజలు మాత్రం వైఎస్సార్సీపీకే బహిరంగ మద్దతు తెలుపుతుండడంతో ప్రలోభాలతోనైనా వారిని తమ వైపు తిప్పుకోవాలన్న ఆలోచనలో తెలుగుదేశం నేతలు ఉన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ సహకారం అందిపుచ్చుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం రాత్రి నుంచే మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందునుంచే భారీగా మద్యం కొనుగోలు చేసి రహస్య ప్రదేశాల్లో నిల్వ చేసుకున్నారు. ఇప్పుడు వాటిని బయటకు తీస్తున్నారు. పొందూరు మండలంలో సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతకు చెందిన మద్యం నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకోవడమే దీనికి నిదర్శనం. కాగా కొన్ని మండలాల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలను సిద్ధం చేసినట్లు భోగట్టా. -
తొలి పరీక్ష
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: తొలిదశ ప్రాదేశిక తుదిపోరుకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఓటరు మారాజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాడు. అటు అధికార యంత్రాంగం.. ఇటు అభ్యర్థులు అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. గత పది రోజులుగా ఓటర్ల మనసు చురగొని ఓట్లు కొల్లగొట్టేందుకు పోటీలో ఉన్న పార్టీలు, అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశారు. తొలివిడతలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు.. శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస, రాజాం, పాతపట్నం పరిధిలోని 18 మండలాల్లో జిల్లా పరిషత్, మండలపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పార్టీ గుర్తులపై జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో 7,95,214 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,98,927 మంది పురుషులు కాగా 3,96,280 మంది మహిళలతో పాటు ఏడుగురు ఇతరులు ఉన్నారు. ప్రశాంతంగా, పకడ్బందీగా పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేసి, శనివారం సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 18 మండలాల్లో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల పోలింగుకు 1042 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5807 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో వీరందరికీ పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. రూట్లు వారీగా విభజించి బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలతోపాటు సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు పంపించారు. సిబ్బంది, సామగ్రి రవాణా కోసం ఆర్టీసీతోపాటు ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీల మధ్యే పోటీ ఈ ఎన్నికల్లో పలు పార్టీలు, ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సగానిఇకపైగా స్థానాల్లో అభ్యర్థులనే నిలబెట్టలేని దీనస్థితిలో ఉండగా.. వైఎస్ఆర్సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ జరుగుతోంది. ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అధిక్యం స్పష్టంగా కనిపించడంతో అనేక చోట్ల కాంగ్రెస్, టీడీపీలు లోపాయికారి ఒప్పందాలతో పరస్పరం సహకరించుకోవడంతో పాటు డబ్బు, మద్యం పంపిణీ వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి. తొలివిడతలో 18 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నరసన్నపేట జెడ్పీటీసీ ఏకగ్రీవమైంది. దాంతో మిగిలిన 17 జెడ్పీటీసీలకు 53 మంది పోటీ పడుతున్నారు. అలాగే ఎంపీటీసీ స్థానాల్లో 12 ఏకగ్రీవం కావడంతో మిగిలిన 303 ఎమ్పీటీసీ స్థానాల్లో 680 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలి విడత లో శ్రీకాకుళం, గార, నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి, పాతపట్నం, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, మెళియాపుట్టి, కొత్తూరు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 18 మండలాల్లో 572 సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. ఆయా ప్రాంతాలతో పాటు మిగిలి ఉన్న గ్రామాల్లో 4023 మంది పోలీసులను బందోబస్తు విధులకు నియమించారు. ఎస్పీ నవీన్‌గులాఠీ ఆధ్వర్యంలో ఎనిమిది మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 80 మంది ఎసై ్సలు, 400 మంది ఏఎసై ్సలు, 1500 మంది కానిస్టేబుళ్లు, 60 మంది హోంగార్డులు, 1000 మంది ఏఆర్ పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ సిబ్బందికి అరకొర ఏర్పాట్లు కాగా ఎన్నికల సామగ్రి తీసుకెళ్లేందుకు వచ్చిన పోలింగ్ సిబ్బందికి వసతి, భోజన ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసేందుకు సిబ్బందిని మండల కేంద్రాలకు రప్పించారు. చాలా చోట్ల మధ్యాహ్నం సరైన ఆహారం సరఫరా చేయక పోవడంతో వీరు పస్తులు ఉండాల్సి వచ్చింది. మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో మహిళా సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకెన్ని అవస్థలు ఎదుర్కోవలసి ఉంటుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అంకెల్లో అభ్యర్థులు.. ఏర్పాట్లు ఎన్నిక జరిగే జెడ్పీటీసీలు.. 17 రంగంలో ఉన్న అభ్యర్థులు... 53 ఎన్నిక జరిగే ఎంపీటీసీలు ... 303 పోటీలో ఉన్న అభ్యర్థులు... 680 పోలింగ్ కేంద్రాలు... 1,042 ఎన్నికల సిబ్బంది సంఖ్య... 5,807 సమస్యాత్మక గ్రామాలు.. 572 పోలీస్ సిబ్బంది... 4,023 -
ఆగిన కౌంటింగ్
సాక్షి,చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్ సహా జిల్లాలో మరో ఆరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆగిపోరుుంది. బుధవారం కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా, హైకోర్టు వెలువరించిన తీర్పుతో ఈ పరిస్థితి ఏర్పడింది.రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఏప్రిల్ 9న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 10వ తేదీ లోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలకు లోబడి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో రాజకీయ పార్టీల నేతలు ఊహించినట్లుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు లాగా, మే 16 తరువాత మున్సిపల్ ఫలితాలు వెల్లడించాలని తీర్పు రాలేదు. ప్రధాన రాజకీయపార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే మున్సిపల్ ఫలితాలు వెల్లడించడం మేలేనన్నట్లుగా ఉన్నాయి. జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, పుంగనూరు, పలమనేరు, శ్రీకాళహస్తి, నగరి, మదనపల్లి మున్సిపాల్టీలకు 9వ తేదీన కౌటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. రెండు రోజుల తరువాత రిటర్నింగ్ స్వతంత్య్ర అభ్యర్థులు బరిలోనే ఉంటారు బి.కొత్తకోట, న్యూస్‌లైన్: తంబళ్లపల్లె నియోజకవర్గంలో జెడ్పీటీసీ బరిలో ఉన్న తన మద్దతుదారులు పోటీ నుంచి తప్పుకోరని తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి హైదరాబాదులో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన మంగళవారం రాత్రి జీ.శంకర్‌యాదవ్‌తో కలిసి బి.కొత్తకోటకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు మారిన వ్యక్తని, అందుకే టీడీపీలో చేరానని చెప్పారు. పార్టీలో చేరే విషయంలో చివరి వరకు అనుమానంగానే ఉండేదని, చివరకు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరానని చెప్పారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జెడ్పీటీసీ బరిలో ఉన్న స్వతంత్య్ర అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకొని టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తారా అన్న ప్రశ్నకు కలిచర్ల సమాధానమిస్తూ తన మద్దతుదారులు పోటీ నుంచి విరమించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆరుగురిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా గెలుస్తారని చెప్పారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన పాదరక్షల పార్టీ ఎక్కడా కనిపించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ నాయకుడు జీ.శంకర్ మాట్లాడుతూ ప్రభాకర్‌రెడ్డి బాటలో ముందుకుపోతామని చెప్పారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచే తమ కుటుంబం ఆయనతోనే ఉందన్నారు. ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీ పదవులను కైవశం చేసుకుంటామని జోస్యం చెప్పారు. నాడు ప్రత్యర్థులు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్‌యాదవ్, ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్, పీఆర్పీ అభ్యర్థులుగా పోటీపడ్డారు. ప్రభాకర్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడం, శంకర్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడంతో ఇద్దరూ ప్రత్యర్థులుగా మారారు. అప్పటి నుంచి కలిచర్ల శంకర్‌ను ఉద్దేశించి బెంగళూరు బీసీ వద్దు.. స్థానిక బీసీకి టికెట్ ఇచ్చుంటే మద్దతు ఇచ్చేవాడిని అంటూ పత్రికా, బహిరంగ సమావేశాల్లో బాహాటంగానే విమర్శలు చేశారు. ఈ పరిస్థితుల్లో శంకర్, కలిచర్ల ఇద్దరూ టీడీపీ గూటికే చేరి ఒక్కటి కావడం గమనార్హం.అధికారి గెలుపు అభ్యర్థులతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన 813 మంది అభ్యర్థుల భవితవ్యం ఏప్రిల్ 9వ తేదీన తేలనున్నది. చివరి నిమిషంలో కౌంటింగ్ వాయిదా ఆరు మున్సిపాల్టీలు, చిత్తూరు కార్పొరేషన్లో ఓట్లు లెక్కింపునకు సంబంధించి లెక్కింపు కేంద్రాల్లో ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు ప్రారంభించి ఆయా మున్సిపల్ కమిషనర్లు సిద్ధంగా ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో టీ.వీ చానల్స్‌లో హైకోర్టు ఏప్రిల్ 9వ తేదీకి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలను వాయిదా వేసినట్లు ప్రకటనలు రావడంతో రాష్ట్ర మున్సిపల్పరిపాలనా అధికారులను అడిగి నిర్థారించుకుని కౌంటింగ్ వాయిదావేశారు.అంతకు ముందే ఏప్రిల్ 2వ తేదీనే ఫలితాలు వెల్లడించమన్నా వెల్లడించే విధంగా డ్యూటీ సిబ్బందికి, మీడియాకు పాస్‌లు సిద్ధం చేశారు. అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు పాస్‌లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఫలితాల కోసం మరోవారం : మార్చి 30న నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం మరో వారం రోజులపాటు ఎదురుచూడాలి. వార్డుల్లో వివిధపార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వందలాది మంది అభ్యర్థులు తమ భవిష్యత్ తెలుసుకునేందుకు మరొక వారం రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.వెఎస్సాఆర్సీపీ, తెలుగుదేశం అభ్యర్థులతో పాటు, ఆయా మున్సిపాల్టీల్లో నాయకత్వం వహించి ప్రచార సారథ్యం వహించిన ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు కూడా తమ ఎన్నికల లెక్కలు సరైనవో కాదో తెలుసుకునేందుకు మరికొంత సమయం పట్టనున్నది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ప్రభావం? జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుందా అన్న మీమాంసలోనూ రాజకీయపార్టీలు ఉన్నాయి. అయితే జిల్లాలో అత్యధిక మున్సిపాల్టీలు కైవసం చేసుకునే దిశగా వైఎస్సాఆర్సీపీ ఉందని పోలింగ్‌సరళి అధారంగా తెలుస్తున్నది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు ఏప్రిల్ 6న మదనపల్లె డివిజన్లో, ఏప్రిల్ 11న తిరుపతి, చిత్తూరు డివిజన్లలో నిర్వహించనున్నారు. ఫలితాల ప్రభా వం స్థానిక ఎన్నికలపై ఎలా ఉంటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.