ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ...! | 10 spectacular bird watching sites in india | Sakshi
Sakshi News home page

ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ...!

Published Tue, Sep 15 2015 6:12 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ...!

ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ...!

ఊర పిచ్చుకల కితకితలు, కోయిలమ్మ కూనిరాగాలు, రామచిలుకల సందడి, చల్లగ వీచే పిల్లగాలిలో తేలుతూ వచ్చే రకరకాల పక్షుల కువకువలు ఉదయాన్నే మేలుకొలిపితే...

ఊర పిచ్చుకల కితకితలు, కోయిలమ్మ కూనిరాగాలు, రామచిలుకల సందడి, చల్లగ వీచే పిల్లగాలిలో తేలుతూ వచ్చే రకరకాల పక్షుల కువకువలు ఉదయాన్నే మేలుకొలిపితే... ఎంత హాయిగా ఉంటుంది... మనమూ వాటిలాగా రెక్కలు కట్టుకొని స్వేచ్ఛగా ఎగిరిపోతే ఎంతబాగుంటుందనిపిస్తుంది కదూ... కాంక్రీట్ జంగిల్ మనకు ఎలాగూ సాధ్యం కాదు.. కానీ ఈ అనుభూతిని పొందే అవకాశం దేశంలో చాలా ప్రదేశాల్లో ఉంది. అవి ఎంటో, ఎక్కడున్నాయో ఓకసారి చూసొద్దాం...

పక్షుల స్వర్గంగా  కనిపించే పురాతన జాతీయ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో ఉన్న ఈ పార్క్ లో సుమారు 5 వందలకు పైగా పక్షి జాతులను దర్శించవచ్చు. రాజస్థాన్ లోని భరత్పూర్ బర్డ్ సంక్చరి కూడ ఓ అద్భుత సందర్శనా స్థలం. ఇక్కడి కేవల్ ఘనా నేషనల్ పార్క్ కు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా పేరుంది.

మూడు వందలకు పైగా పక్షి జాతులు ఇక్కడున్నాయి. దేశ రాజధాని ఢిల్లీనుంచి ఇక్కడకు మూడు గంటల ప్రయాణం.  అలాగే ఒడిషా లోని చిల్కా సరస్సు బర్డ్ సంక్చరి... ఆసియాలోనే అతి పెద్ద లోతట్టు ప్రాంతం. ఇది వలస పక్షులకు అతి పెద్ద స్థావరం.భువనేశ్వర్ కు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో వలస పక్షుల అందాలు సందర్శకులను కట్టిపడేస్తాయి.

హర్యానా గుర్గావ్ లోని సుల్తానా బర్డ్ సంక్చురీ రంగురంగుల పక్షిజాతులకు ఆలవాలంగా విరాజిల్లుతోంది. ఈ ప్రాంతం ఢిల్లీనుంచీ కేవలం ఒక్క గంట ప్రయాణంలోనే ఉంది. పక్షి ప్రేమికులను అమితంగా ఆకట్టుకునే ఈ ప్రదేశంలో సుమారు 250 పక్షి జాతుల అద్భుత దృశ్యాలు ఆవిష్కరిస్తాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని అతి పెద్ద చిత్తడినేల పక్షికేంద్రాల్లో పేరు పొందింది. అభిరుచి పేరిట ఉన్న ఇక్కడి పక్షి కేంద్రంలో 225 పక్షి జాతులు ఉన్నాయి.

పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణంతోపాటు... అద్భుత దృశ్యాలను ఆవిష్కరించే కేరళలోని కుమారకోం.. కొచ్చికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ సుందరమైన ప్రదేశం. వలస పక్షులకూ ఇదో ప్రత్యేక స్థావరం. ఇక్కడ ఏర్పాటు చేసిన పడవ ఇళ్ళు సందర్శకులకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని ఈగిల్ నెస్ట్ కేంద్రం 454 పక్షి జాతులతో అలరారుతోంది. అంతరించిపోతున్న ఎన్నో పక్షి జాతులను 1995లో ఇక్కడ కనుగొన్నారు.

వెస్ట్ బెంగాల్ లోని లావా, నియోర వాలీ నేషనల్ పార్క్ ప్రముఖ పక్షుల కేంద్రంగా గుర్తింపు పొందింది. ఆరుదైన పక్షి జాతులు ఇక్కడ దర్శనమిస్తాయి. అడవినుంచీ అందమైన కాలిబాటన ఈ క్షేత్రానికి చేరొచ్చు. అలాగే కేరళలోని తట్టేకాడ్లో, కర్నాటక కావేరి నదికి దగ్గరలోని రంగనాధిట్టు పక్షి కేంద్రాలుకూడ సందర్శకులకూ.. ప్రత్యేకంగా పక్షి ప్రేమికులను ఆకట్టుకుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement