ఆ కేసు అంతు తేల్చేందుకు 40 మంది | 40-member CBI team to reach Bhopal today to take over probe in Vyapam scam | Sakshi
Sakshi News home page

ఆ కేసు అంతు తేల్చేందుకు 40 మంది

Published Mon, Jul 13 2015 8:29 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

ఆ కేసు అంతు తేల్చేందుకు 40 మంది - Sakshi

ఆ కేసు అంతు తేల్చేందుకు 40 మంది

భోపాల్: దేశంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం కేసును పరిష్కరించేందుకు సీబీఐ వేగంగా ముందుకు కదులుతోంది. ఆ శాఖకు చెందిన 40 మంది అధికారులు మరికొన్ని గంటల్లో మధ్యప్రదేశ్ చేరుకోనున్నారు. వీరందరికి జాయింట్ డైరెక్టరేట్ లెవల్ అధికారి సారథ్యం వహించనున్నారు. అయితే, ఆ అధికారులు ఎవరనే సమాచారం మాత్రం సీబీఐ బయటకు వెల్లడించలేదు. కనీసం సారథ్యం వహించే వ్యక్తి పేరును కూడా తెలియజేయలేదు.

మరోపక్క, బీహార్కు చెందిన ఓ అధికారి ఈ టీంకు నేతృత్వం వహిస్తున్నారని వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవాలు, ఆధారాలు లేనివని ఖండించారు. మధ్యప్రదేశ్లో ఉన్నత స్ధాయి ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల్లో భారీ స్థాయి కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు ప్రముఖులు నిందితులు ఉండగా వారిలో ఒక్కోక్కరు అనుమానాస్పద స్థితిలో చనిపోతుండటంతో దేశంలోనే సంచలనాత్మ కేసుగా మిగిలింది. దీంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కేసును సీబీఐకి అప్పగించడంతో విచారణ ప్రారంభమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement