జాబ్ లేని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇంతమందా?
జాబ్ లేని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇంతమందా?
Published Sat, Mar 18 2017 8:35 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
న్యూఢిల్లీ : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత ఏ ఏడాదికాఏడాది పెరిగిపోతుంది. గ్రాడ్యుయేట్ పట్టా పొంది కాలేజీ నుంచి బయటికి వచ్చే వారిలో అరకొరమందికే ఉద్యోగాలు లభ్యమవుతున్నాయి. మిగతా వారందరూ నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఎంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారనే విషయంపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గణాంకాలు విడుదల చేసింది.
ఈ వివరాల్లో దేశవ్యాప్తంగా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వారిలో 60 శాతం మందికి పైగా అంటే ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులేనని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలిపింది. ఒక శాతం మంది కంటే తక్కువమందే సమ్మర్ ఇంటర్న్ షిప్ లో పాల్గొంటున్నారని పేర్కొంది.
కేవలం 15 శాతం ఇంజనీరింగ్ ప్రొగ్రామ్స్ నే ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయని వెల్లడైంది. ఈ పరిస్థితిని మార్చడానికి మానవ వనరుల అభివృద్ధి శాఖా టెక్నాలజీ ఎడ్యుకేషన్ ను పునరుద్ధరించడానికి ప్లాన్ చేస్తోంది. 2018 జనవరి నుంచి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికీ కలిపి ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని భావిస్తోంది. ఎంహెచ్ఆర్డీ సీనియర్ అధికారుల ప్రకారం పూర్తిగా కంప్యూటర్ ఆధారితంగా నేషనల్ టెస్టింగ్ సర్వీసు ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ ప్రొగ్రామ్స్ కు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ మాదిరిగా.. మెడికల్ కోర్సులకు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)ను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Advertisement