హాలీవుడ్ నటిపై కుక్కల స్మగ్లింగ్ ఆరోపణలు
లాస్‌ఏంజెలిస్: ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీడెప్ సతీమణి, నటి అంబర్ హెర్డ్ స్మగ్లింగ్ ఆరోపణల్లో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా రెండు వేర్వేరు జాతులకు చెందిన పెంపుడు కుక్కలను తరలించడంతో అక్కడి కస్టమ్స్ అధికారులు ఆమెపై పలు అభియోగాలు మోపుతూ కేసు నమోదుచేశారు.
చట్టవిరుద్ధంగా కుక్కలను ఆస్ట్రేలియాకు దిగుమతి చేయడం, తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండడం వంటి ఆరోపణలతో కేసు నమోదైంది. ఇందుకు గాను ఆమె క్వీన్‌ల్యాండ్ కోర్టు ఎదుట సెప్టెంబర్ 7న హాజరు కావాల్సి ఉంటుంది. హెర్డ్‌పై నమోదైన ఆరోపణలు రుజువైతే ఆమెకు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష, అత్యధికంగా 48 వేల అమెరికన్‌డాలర్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియన్ ప్రాసిక్యూటర్లు చెప్తున్నారు.