అమేథీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ నియోజకవర్గం అమేథీపై సమాజ్‌వాదీ పార్టీ నేతత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వరాలజల్లు కురిపించింది. ఫైజాబాద్ డివిజన్‌లో ఉన్న జిల్లాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల కన్నా అమేథీకి అత్యధికంగా రూ. 236.92 కోట్లు అభివద్ధి పనులకోసం కేటాయించింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ జగత్‌రాజ్ త్రిపాఠీ వెల్లడించారు. 2014-15 వార్షిక జిల్లా ప్రణాళిక బడ్జెట్‌లో భాగంగా ప్రభుత్వం ఈ నిధుల కేటాయించింది.
ఫైజాబాద్ డివిజన్‌లోని ఇతర జిల్లాల్లో బారాబంకీకి రూ. 167 కోట్లు, ఫైజాబాద్‌కు 150 కోట్లు, సుల్తాన్‌పూర్‌కు 124 కోట్లు, అంబేద్కర్ నగర్‌కు 122 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.