వారసత్వ రాజకీయాలకు ఓ సవాలు : కుమార్ విశ్వాస్
లక్నో: అమేథీలో ర్యాలీ నిర్వహించడం వారసత్వ రాజకీయాలు, అవినీ తికి సవాలువంటిదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ పేర్కొన్నా రు. అమేథీకి వెళుతూ మార్గమధ్యలో ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఇక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అమేథీయే. నేనొక సామాన్యుడిని. రాహుల్‌గాంధీ రాకుమారుడు. అమేథీ కోరుకుంటే వారసత్వ రాజకీయాలకు తెరదించవచ్చు. గెలుపు లేదాఓటమి అనేది విషయమే కాదు. అవినీతి, వారసత్వ రాజకీయాలను సవాలు చేయడమనేదే అత్యంత కీలకమైనది’ అని ఆయన పేర్కొన్నారు.
శనివారం నిర్వహించిన మీడియా సమావేశంవద్ద నిరసనపై నిరసన అంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. ‘అమేథీ వారసత్వ రాజకీయాలను సవాలు చేయకూడదనేదే కారణం కావొచ్చేమో. నేను చదివిన పద్యకవిత్వం కొందరికి బాధ కలిగించి ఉండొచ్చు. అందుకు నేను వారికి ఇప్పటికే క్షమాపణ చెప్పాను’ అని అన్నారు. కాగా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ వ్యక్తి కుమార్ విశ్వాస్‌పై కోడిగుడ్డు విసిరిన సంగతి విదితమే. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని ఆప్ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. కాగా అమేథీ పర్యటనకు వెళుతున్న కుమార్‌కు వ్యతిరేకంగా కొందరు స్థానికులు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు.