ఆ పరిశ్రమపై కన్నేసిన ఆపిల్!!
ఆ పరిశ్రమపై కన్నేసిన ఆపిల్!!
Published Wed, Sep 28 2016 11:59 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
ఆపిల్ అనగానే.. మనకు మొదట గుర్తొచ్చేది ఐఫోన్ మాత్రమే. కానీ ఆపిల్ కేవలం స్మార్ట్ఫోన్లపైనే కాక ప్రజాఆరోగ్యం, హెల్త్ కేర్ ఇండస్ట్రి పైనాఎక్కువగా దృష్టిపెట్టిందట. ప్రపంచవ్యాప్తంగా 8 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న హెల్త్ కేర్ ఇండస్ట్రి ద్వారా ఎక్కువ రెవెన్యూలను ఆర్జించాలని ఆపిల్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజా ఆరోగ్యం కోసం వినూత్నమైన సాప్ట్వేర్లను ఎప్పడికప్పుడూ ఆవిష్కరిస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆపిల్ ఇంక్ హెల్త్ కిట్ ఇది యూజర్లకు తెలిసేఉంటోంది. ప్రస్తుతం ఈ హెల్త్కిట్ను ఓ టూల్లాగా మార్చి రోగనిర్ధారణ కనుగునే స్థాయికి తీసుకెళ్లాలని ఆపిల్ మెడికల్ టీమ్ అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకుందని తెలుస్తోంది.
ప్రస్తుతమున్న ఈ హెల్త్కిట్ కేవలం యూజర్లు వాడే డివైజ్ ద్వారా ఫిట్నెస్ డేటాను మాత్రమే సేకరించగలదు. డేటాను సేకరించడమే కాకుండా దాన్ని విశ్లేషించేలా కొత్త సాప్ట్వేర్ను ఆపిల్ రూపొందిస్తోంది. ఈ సాప్ట్వేర్ యూజర్లకు, డాక్టర్లకు , ఇతరులకు సలహాలు కూడా ఇస్తుందట.ఎలక్ట్రానిక్ హల్త్ రికార్డు సాప్ట్వేర్ను మెరుగుపరచడానికి ఆపిల్ ఇటీవల హెల్త్ కేర్ నిపుణులు భారీగా నియమించుకుంటుంది. దీంతో పేషెంట్ డేటాను మరింత విశ్లేషించి, అర్థం చేసుకోవడానికి వీలవుతుందని కంపెనీకి చెందిన ఒకరు చెప్పారు.
అదేవిధంగా ఆపిల్ వాచ్ల్లో కొత్త కొత్త యాప్ల రూపకల్పనకు ఇది దోహదం చేస్తుందట. ఆపిల్ కొత్తగా రూపొందించే యాప్ల ద్వారా యూజర్ల నిద్రను ట్రాక్ చేయడం, హార్ట్ రేట్ బట్టి ఫిట్నెస్ను గుర్తించడం వంటివి చేపట్టవచ్చట. అయితే హార్ట్ రేటును కొలవడానికి ఆపిల్ ఇంతకమునుపే ఓ యాప్ను రూపొందించింది. కానీ ఆ యాప్ ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించలేం. ప్రస్తుతం తీసుకొస్తున్న యాప్ ద్వారా హార్ట్ రేటు సేకరించడమే కాకుండా దాన్ని విశ్లేషించుకోవచ్చు. ఆపిల్ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ సాప్ట్వేర్లు రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని చీప్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. వీటితో యూజర్లు ఎక్కువగా తమ కంపెనీ డివైజ్పైనే ఆధారపడాలని భావిస్తున్నారు.
Advertisement