
సచిన్ ను కలవనున్న ఆస్ట్రేలియా ప్రధాని
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ ఈ ఉదయం భారత వాణిజ్య రాజధాని ముంబైకి చేరుకున్నారు.
ముంబై: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ ఈ ఉదయం భారత వాణిజ్య రాజధాని ముంబైకి చేరుకున్నారు. రాజభవన్ లో మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావును ఆయన కలిశారు. హోటల్ తాజ్మహల్ ప్యాలెస్ వద్ద 26/11 అమరవీరులకు ఆయన నివాళి అర్పించారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను ఆసీస్ ప్రధాని కలవనున్నారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే కార్యక్రమంలో అబాట్ తో పాటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్ క్రిస్ట్, బ్రెట్ లీ కూడా సచిన్ ను కలుస్తారు.
ఈ మధ్యాహ్నం భారత వ్యాపారవేత్తలతో టోనీ అబాట్సమావేశం కానున్నారు. శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో ఆయన భేటీ అవుతారు.