'ఇది ఒక అద్భుతమైన రోజు' | Big day for BJP as party worker unfurled flag, says amit Shah | Sakshi
Sakshi News home page

'ఇది ఒక అద్భుతమైన రోజు'

Published Fri, Aug 15 2014 3:16 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

'ఇది ఒక అద్భుతమైన రోజు' - Sakshi

'ఇది ఒక అద్భుతమైన రోజు'

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఒక సాధారణ పార్టీ కార్యకర్తలా ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసి పార్టీ కార్యకర్తలకు అద్భుతమైన రోజుగా మలిచారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఇది నిజంగా కార్యకర్తలు గర్వించదగిన రోజని స్పష్టం చేశారు.  అంతకుముందు ఒకసారి వాజ్ పేయ్ నేతృత్వంలో బీజేపీ అధికారం చేపట్టినా.. ఈసారి పూర్తి ఆధిక్యతో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు.

 

' ఆ ఆనందాన్ని తొలిసారి చూశాం. చాలా కాలం తర్వాత బీజేపీ కార్యకర్తల వల్ల పార్టీకి మంచి రోజులు వచ్చాయి. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక బీజేపీ కార్యకర్త దేశ  జెండాను ఎర్రకోటలో ఎగురవేశారు. ఇది నిజంగా ఒక గొప్ప రోజు' అని షా తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అమిత్ షా మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి దిశగా పనిచేస్తుందన్నారు. మరోవైపు కేంద్ర సమాచార, ప్రచారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మోడీ ప్రసంగంపై ప్రశంసలు కురిపించారు.  'ఆయన హృదయం నుంచి వచ్చిన మాటలు యావత్తు జాతిని హత్తుకున్నాయన్నారు.  మోడీ ప్రసంగం ఆద్యంతం స్ఫూర్తి దాయకంగా ఉందని  స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement