బీజేపీ మాటలను నమ్మవద్దు | BJP has still not fulfilled its promises: BSP Chief Mayawati | Sakshi
Sakshi News home page

బీజేపీ మాటలను నమ్మవద్దు

Published Sat, Jan 28 2017 5:58 PM | Last Updated on Thu, Mar 28 2019 8:40 PM

బీజేపీ మాటలను నమ్మవద్దు - Sakshi

బీజేపీ మాటలను నమ్మవద్దు

లక్నో: కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ గత లోక్సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే అర్హత బీజేపీకి లేదని అన్నారు. బీజేపీ హామీలను నమ్మవద్దని ఆమె ప్రజలను కోరారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా శనివారం లక్నోలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. పలు జనాకర్షక వరాలను ప్రకటించారు. అనంతరం మాయావతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ తప్పుడు హామీలను ఇచ్చిందని ఆరోపించారు. ఎన్నికలయ్యాక వాటిని పట్టించుకోదని చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం చేసిన సమయంలో మోదీ ఎన్నో హామీలను ఇచ్చారని, గెలిచాక వాటిని విస్మరించారని మాయావతి విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement