జైట్లీ మాటలు బాధించాయి: చంద్రబాబు | BJP makinf confusion on AP special status issue: CM Chandrababu naidu | Sakshi
Sakshi News home page

జైట్లీ మాటలు బాధించాయి: చంద్రబాబు

Published Fri, Jul 29 2016 10:31 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

జైట్లీ మాటలు బాధించాయి: చంద్రబాబు - Sakshi

జైట్లీ మాటలు బాధించాయి: చంద్రబాబు

విజయవాడ: పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి అన్యాయం అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో అన్న మాటలు తనను ఎంతగానో బాధించాయన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో చర్చ ముగిసిన అనంతరం విజయవాడలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే నిధులు ఇస్తున్నదే తప్ప ప్రత్యేక నిధుల ఊసు లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక హోదాకు, 14వ ఆర్థిక సంఘానికి సంబంధం లేదని, మొదటి నుంచి ఈ విషయాన్ని తాను చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. హోదాపై రాజ్యసభలో జైట్లీ వ్యాఖ్యలు బాధించాయన్న చంద్రబాబు.. రాజధాని నిర్మాణం విషయంలోనూ బీజేపీ ఏపీని గందరగోళానికి గురిచేస్తున్నదని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement