విమానం కాక్పిట్లో దుస్తులు విప్పి.. | British Airways pilot suspended after the shocking pictures emerged | Sakshi
Sakshi News home page

విమానం కాక్పిట్లో దుస్తులు విప్పి..

Published Tue, Nov 1 2016 5:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

విమానం కాక్పిట్లో దుస్తులు విప్పి..

విమానం కాక్పిట్లో దుస్తులు విప్పి..

లండన్: భూమికి 38వేల అడుగుల ఎత్తులో.. దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళుతోన్న విమానాన్ని పైలట్ ఎంత జాగ్రత్తగా నడపాలి? ఎంత బాధ్యతతో మెలగాలి? కానీ ఇవేవీ పట్టని ఓ పైలట్.. కాక్పిట్లో దుస్తులు విప్పేసి, మహిళల సాక్స్ ధరించి కాళ్లతో విమానం నడిపాడు. ప్రమాదకరమైన చర్యకు పాల్పడిన కారణంగా సదరు పైలట్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే అతని వాదన మరోలాఉంది. వివరాల్లోకి వెళితే..

బ్రిటిష్ ఎయిర్వేస్లో కెప్టెన్గా పనిచేస్తోన్న కొలిన్ గ్లోవర్(51) మధ్యతరహా, భారీ విమానాలను నడపడంలో దిట్ట. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం 777ను నడిపిన అనుభవంకూడా ఉందాయనకు. అయితే విమాన ప్రయాణం మధ్యలో కోలిన్ విపరీత చర్యలకు పాల్పడినట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చింది. వివిధ సందర్భాల్లో పోర్న్ ఫొటోలు చూస్తూ, దుస్తులు విప్పి, కాళ్లతో విమానం నడుపుతున్న ఫొటోలు బహిర్గతం కావడంతో ఎయిర్ వేస్ సంస్థ కొలిన్ను సస్పెండ్ చేసింది.

అయితే ఆ ఫొటోల్లో ఉన్నది తాను కాదని, తనపై కుట్రజరిగి ఉండొచ్చని కొలిన్ వాదిస్తున్నారు. దీంతో విమానయాన సంస్థ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ఒకవేళ ఆ ఫొటోల్లోని వ్యక్తి కొలినే అని తేలితేమాత్రం అతని పైలెట్ లైసెన్స్ శాశ్వతంగా రద్దుచేస్తామని బ్రిటిష్ ఎయిర్ వేస్ ప్రకటించింది. గతంలోనూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ పలువురు పైలట్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement