దేశంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ గవర్నర్ మాజీ ఓఎస్డీ ధన్రాజ్ యాదవ్పై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ గవర్నర్ మాజీ ఓఎస్డీ ధన్రాజ్ యాదవ్పై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది. మరో 37 మందిపై కూడా కేసులు నమోదు చేసింది. పోలీసు అధికారుల నియామకాల నోటిఫికేషన్ సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ నమోదుచేసిన కేసుల్లో పేర్కొన్నారు.
దీంతోపాటు, కుట్రపూరిత నేరం, మోసం, సంతకాల మార్పిడి, చట్టాల అతిక్రమణ, టెక్నాలజీకి చెందిన చట్టాలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలన్నీ ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆదివారం కేసు నమోదైనవారిలో పరీక్షల నిర్వహణ అధికారి పంకజ్ త్రివేది కూడా ఉన్నారు.