
అభ్యంతరకర వీడియో కేసులో మరొకరి అరెస్ట్
న్యూఢిల్లీ: ఆన్ లైన్ లో అభ్యంతరకర వీడియో పోస్టు చేసిన కేసులో మరో నిందితుడిని సీబీఐ అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కటక్ కు చెందిన దేబశిష్ దేవ్(30)ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఓ యువతితో ఏకాంతంగా గడిపిన వీడియోను దుండగులు సోషల్ మీడియాలో ఆప్ లోడ్ చేశారు. వాట్సాప్ లో ఈ వీడియో బాగా సర్క్యూలేట్ అవడంతో హైదరాబాద్ కు చెందిన ఎన్జీఓ ప్రజ్వల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెల్ ఎల్ దత్తుకు లేఖ రాసింది.
సుమోటుగా విచారణ ప్రారంభించిన అత్యున్నత న్యాయస్థానం నిందితులను అరెస్ట్ చేయాలని సీబీఐను ఆదేశించింది. దీంతో స్పందించిన సీబీఐ అధికారులు గతవారం భువనేశ్వర్ కు చెందిన ప్రొపర్టీ డీలర్ సుభ్రాత్ సాహు అలియాస్ కాలియాను అరెస్ట్ చేశారు.