చైనా పెద్ద తప్పుచేసింది: బీజింగ్ మీడియా
చైనా పెద్ద తప్పుచేసింది: బీజింగ్ మీడియా
Published Fri, Feb 24 2017 1:17 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM
బీజింగ్ : 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపి ప్రపంచ స్పేస్ రికార్డును నెలకొల్పిన ఇస్రోను పొగడ్తల్లో ముంచెత్తుతున్న బీజింగ్ మీడియా, తమ దేశానికి మాత్రం బాగానే చురకలంటిస్తోంది. భారత్కు చెందిన సైన్సు, టెక్నాలజీ నిపుణులను విస్మరించి చైనా తప్పుచేసిందని బీజింగ్ మీడియా శుక్రవారం పేర్కొంది. భారతీయ మేథోసంపత్తిని పక్కకుపెట్టి, యూఎస్, యూరప్ నుంచి వచ్చే వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ రంగ మీడియా గ్లోబల్ టైమ్స్ ఓ ఆర్టికల్ ను ప్రచురించింది. భారతీయ సైన్సు, టెక్నాలజీని ఆకట్టుకోవడానికి చైనా అసలు సరిగా పనిచేయలేదని తన ఆర్టికల్లో పేర్కొంది.
ఇస్రో ఘనవిజయం తర్వాత గ్లోబల్ టైమ్స్ భారత్ కృషిని కొనియాడుతూ పలు ఆర్టికల్లు ప్రచురిస్తూ వస్తోంది. గత కొన్నేళ్లుగా చైనా టెక్ జాబ్స్లో అనూహ్యమైన బూమ్ సాధించింది. ఫారిన్ రీసెర్చ్కు, డెవలప్మెంట్ సెంటర్లకు చైనా ఆకర్షణీయమైన దేశంగా పేరొందింది. కానీ ఇటీవల కొన్ని హై-టెక్ సంస్థలు చైనా నుంచి భారత్కు వస్తున్నాయి. తన నూతనావిష్కరణ సామర్థ్యాన్ని అలానే కొనసాగిస్తూ భారత్ నుంచి హై-టెక్ టాలెంట్ ను ఆకర్షించడం ప్రస్తుతం చైనా వద్దనున్న ఒక ఆప్షన్ గా ఆ మీడియా పేర్కొంది.
Advertisement