ఇంటర్ విద్యార్థినిపై ఇద్దరు యువకుల అత్యాచారం | Class XII student abducted and raped in UP | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థినిపై ఇద్దరు యువకుల అత్యాచారం

Published Sat, Aug 1 2015 1:03 PM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

ఇంటర్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.

ముజప్పర్ నగర్: ఇంటర్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ముజప్ఫానగర్లో సివిల్ లైన్స్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిని రాహుల్, శివం అనే ఇద్దరు యువకులు కాలేజీ నుంచి అపహరించారు. అనంతరం ఆ విద్యార్థిని సమీపంలోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

అయితే తమ కూతురిని ఇద్దరు యువకులు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement