షీలాకు కాంగ్రెస్ కు మధ్య పెరిగిన దూరం! | Congress had distanced itself from Dikshit's shocking statement | Sakshi
Sakshi News home page

షీలాకు కాంగ్రెస్ కు మధ్య పెరిగిన దూరం!

Published Sun, Sep 14 2014 1:36 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

షీలాకు కాంగ్రెస్ కు మధ్య పెరిగిన దూరం! - Sakshi

షీలాకు కాంగ్రెస్ కు మధ్య పెరిగిన దూరం!

ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమివ్వాలని, ఢిల్లీ ప్రజలకు కూడా అది మంచిదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ వ్యాఖ్యలు కాస్తా ఆమెకు మరింత తలనొప్పిగా మారాయి. బీజేపీ ప్రభుత్వంపై షీలా చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై కాంగ్రెస్ అలకబూనినట్లు తెలుస్తోంది. ఒకప్రక్క ఆప్ తో సహా కాంగ్రెస్ కూడా ఢిల్లీలో తాజాగా ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో షీలా వ్యాఖ్యలు పార్టీకి మింగుడు పడటం లేదు.  పార్టీ విధానాన్ని పక్కనుపెట్టి బీజేపీ అధికారం ఇస్తే మంచిదని పేర్కొనడమే ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు ప్రాధమిక సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు షీలా పరోక్షంగా తన వ్యాఖ్యల ద్వారా జై కొట్టడంతో కాంగ్రెస్ ను డైలామాలో పడేసింది.

 

దాంతో పార్టీ శ్రేణులు ఆమె వైఖరిపై గుర్రుగా ఉన్న తరుణంలో ఆమె తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే పనిలో పడింది. ఆదివారం షీలా మీడియాతో మాట్లాడుతూ..ఆ రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిని, రాజ్యాంగపరమైన నిబంధనలను మాత్రమే చెప్పానంటూ ఆమె తాజాగా తెలిపింది.  అయితే ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేయడంపై మాత్రం ఆమె మాట్లాడటానికి నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement