sheila dixit
-
అలసి విశ్రమించిన అలలు
చుక్క పెడితే సమాప్తం అని కాదు. ఆఖరి చరణం పాడితే అది చరమ గీతం కాదు. ‘కట్’ అంటే ప్యాకప్ కాదు. ముకుళిత హస్తాలకు అర్థం ఇక సెలవని కాదు. అంతమే లేని వాటికి మధ్య మధ్య విరామాలు, ఆగి అలుపు తీర్చుకుంటున్న అలలు. ఈ ఏడాది సాహిత్య, సంగీత, సినీ, రాజకీయ, ఆథ్యాత్మిక రంగాలలోని కొందరు సుప్రసిద్ధ మహిళల్ని కోల్పోయాం. వాళ్లు లేని లోటు తీరనిదే అయినా, వాళ్లు మిగిల్చి వెళ్లినది తరగనిది. కృష్ణాసోబ్తీ, రచయిత్రి ప్రముఖ హిందీ రచయిత్రి, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత అయిన కృష్ణా సోబ్తీ(93) ఢిల్లీలో జనవరి 25న కన్నుమూశారు. కృష్ణాసోబ్తీ రచించిన ‘మిత్రో మర్జానీ’ భారత సాహిత్యంలో నూతన శైలిని ప్రతిబింబిస్తుందని సాహితీప్రియులు అంటారు. కృష్ణాసోబ్తీ 2010 లో ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ఒక సృజనశీలిగా ప్రభుత్వ గుర్తింపులకు దూరంగా ఉండాలన్నది తన ఉద్దేÔ¶ మని ఆ సందర్భంగా ఆమె అన్నారు. వింజమూరి అనసూయాదేవి, గాయని ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్తి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్‌లో మార్చి 24 న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920 మే 12న జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన దేశభక్తి గీతం ‘జయజయజయ ప్రియ భారత’ పాటకు బాణీ కట్టింది అనసూయాదేవే. విజయనిర్మల, సినీ నటి ప్రముఖ నటి, దర్శకురాలు, సినీ నటుడు కృష్ణ సతీమణి ఘట్టమనేని విజయనిర్మల (73) జూన్ 26న తుదిశ్వాస విడిచారు. 1946 ఫిబ్రవరి 20న గుంటూరు జిల్లా నరసరావుపేటలో విజయనిర్మల జన్మించారు. పాండురంగ మహత్యం సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించారు. 1971లో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆమె అసలు పేరు నిర్మల కాగా.. తనకు సినీరంగంలో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకున్నారు. షీలా దీక్షిత్, మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ (81) జూలై 20న కన్నుమూశారు. పంజాబ్‌లోని కపుర్తలాలో 1938 మార్చి 31వ తేదీన షీలా కపూర్ (షీలా దీక్షిత్) జన్మించారు. 1984–89 సంవత్సరాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా షీలా సేవలందించించారు. రాజీవ్ హయాం లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో కేరళ గవర్నర్‌గా అయిదు నెలలు కొనసాగారు. మాంటిస్సోరి కోటేశ్వరమ్మ, విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ(94) జూన్ 30న విజయవాడలో కన్ను మూశారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925 మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డన్స్ర్ మాంటిస్సోరి స్కూళ్లను స్థాపించారు. ఛాయాదేవి, సాహితీవేత్త ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి (85) జూన్ 28న హైదరాబాద్ లోని చండ్ర రాజేశ్వర్‌రావు వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. గతంలో ఆమె కోరిన మేరకు ఆమె భౌతిక కాయాన్ని ఈఎస్ఐ వైద్య కళాశాలకు అప్పగించారు. అలాగే కళ్లను ఎల్వీ ప్రసాద్ వైద్యులు సేకరించారు. 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో మద్దాల వెంకటాచలం, రమణమ్మ దంపతులకు ఛాయదేవి జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు ఆమె భర్త. ఆయన చాలాకాలం క్రితమే చనిపోయారు. ఛాయాదేవి ఎన్నో కథలు రాశారు. బోన్సాయ్ బ్రతుకు అనే కథని 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పెట్టింది. ఆమె రాసిన ’తన మార్గం’ కథా సంపుటికి 2005 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. స్త్రీల జీవితాల్లోని దృక్కోణాలను తన కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు. కాంచన్ చౌదరి, తొలి మహిళా డీజీపీ కాంచన్ చౌదరి భట్టాచార్య (72) ఆగస్టు 26న ముంబైలో కన్నుమూశారు. 1973 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన కాంచన్ దేశంలో తొలి మహిళా డీజీపీగా చరిత్ర సృష్టించారు. కిరణ్ బేడీ తరువాత దేశంలో రెండో మహిళా ఐపీఎస్ అధికారిగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన కాంచన్ 2004 నుంచి 2007 అక్టోబర్ 31 వరకు ఉత్తరాఖండ్ డీజీపీగా పని చేశారు. సీఐఎస్ఎఫ్ అధిపతిగానూ పనిచేశారు. సుష్మా స్వరాజ్, కేంద్ర మాజీమంత్రి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) ఆగస్టు 6న కన్ను మూశారు. 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో సుష్మ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య ముగించారు. 1975 జూలై 13న స్వరాజ్ కౌశల్‌ను వివాహమాడారు. కొన్నాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుష్మ 1998లో ఢిల్లీ సీఎం అయ్యారు. 1996లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. గీతాంజలి, నటి ప్రముఖ నటి గీతాంజలి (72) అక్టోబర్ 31న కన్నుమూశారు. 1947లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచమయ్యారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో కలిపి 300 కు పైగా చిత్రాల్లో నటించారు. దేవత, సంబరాల రాంబాబు, పంతాలు పట్టింపులు, శ్రీకృష్ణ పాండవీయం, పొట్టి ప్లీడరు, తోడు నీడ వంటి చిత్రాలు గీతాంజలికి మంచి గుర్తింపును తెచ్చాయి. నానమ్మాళ్, యోగా శిక్షకురాలు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యోగా శిక్షకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వి. నానమ్మాళ్ (99) అక్టోబర్ 26న కన్నుమూశారు. నానమ్మాళ్ కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి సమీపంలో ఉన్న జమీన్ కాళియపురంలో 1920లో రైతు కుటుంబంలో జన్మించారు. తాత మన్నర్స్వామి వద్ద యోగా శిక్షణ తీసుకున్న ఆమె.. చనిపోయే వరకు కఠినమైన యోగాసనాలు వేశారు. నానమ్మాళ్ వద్ద శిక్షణ పొందిన 600 మంది ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు. వీరిలో 36 మంది ఆమె కుటుంబసభ్యులే ఉన్నారు. నానమ్మాళ్ను కేంద్ర ప్రభుత్వం 2018లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడింది.. కారణం ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన మౌలిక వసతుల అభివృద్ధిని, ప్రగతిని తొలిసారి ఓటర్లు తేలికగా తీసుకొని.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు మద్దతు ఇచ్చారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి కారణమైన కీలకాంశాల్లో ఇది ఒకటి.. అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 27న జైపూర్ సాహిత్యోత్సవంలో విడుదల కాబోతున్న తన ఆత్మకథ ‘సిటిజెన్ ఢిల్లీ: మై టైమ్స్, మై లైఫ్’లో పార్టీ ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువ ఓటర్లు మా ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను గుర్తించలేదు. నేను అధికారంలోకి రాకముందు ఢిల్లీ ఎలా ఉందో వారికి తెలియదు అని ఆమె పేర్కొన్నారు. ‘ఓటర్లలో తొలిసారి ఓటు హక్కు వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. 15 ఏళ్ల కిందట ఢిల్లీ ఎలా ఉందో వారు చూడలేదు. ఢిల్లీలోని నిరంతర విద్యుత్, ఫ్లైఓవర్లు, మెట్రోరైలు, పలు కొత్త యూనివర్సిటీలు అన్ని కూడా తమ సహజమైన హక్కులుగా వారు భావించారు. వాటిని పెద్దగా లెక్కచేయలేదు. ఆ సంతోషకర భావన అన్నది వారిలో వ్యక్తం కాలేదు’ అని దీక్షిత్ రాసుకొచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని, ప్రజల మనోభావాలను అతను ఓట్లుగా మలుచుకుంటాడని భావించలేదని ఆమె అంగీకరించారు. ‘నేనే స్వయంగా ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీ స్థానాన్ని 25వేల ఓట్ల మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయాను. ఆప్‌ను మేమంతా తక్కువగా అంచనా వేశాం’ అని పేర్కొన్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో అవినీతి ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన షుంగ్లూ కమిటీ ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని విస్మరించిందని నిందించారు. -
మా ప్రచారం సరిగా లేదు: మాజీ సీఎం
దేశ రాజధాని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోడానికి కావల్సినంత ఉధృతంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం లేదని మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ అన్నారు. ఓటర్ల తీర్పును ఆమె స్వాగతించారు. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని అనుకున్నామని, అయితే ప్రజలకు మాత్రం వాళ్ల సొంత మూడ్ ఉందని ఆమె చెప్పారు. ఈసారి పార్టీ తరఫున ఎందుకు ప్రచారం చేయలేదని అడగ్గా.. తనను ప్రచారం చేయమని ఎవరూ అడగలేదని, అడిగితే తప్పనిసరిగా ప్రచారంలో పాల్గొనేదాన్నని ఆమె అన్నారు. ఓటమికి కారణాలేంటో తెలుసుకోడానికి ఫలితాలను పార్టీ అధిష్ఠానం సమీక్షించుకుంటుందని తెలిపారు. ఓటమికి ఢిల్లీ పీసీసీ చీఫ్ అజయ్ మాకెన్దే బాధ్యత అంటారా అన్న ప్రశ్నకు మాత్రం ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు. వచ్చే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఇవే తప్పులు పునరావృతం కాకుండా ఉండాలంటే సమీక్ష తప్పనిసరిగా జరగాలన్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలను గురించి అడిగిగే.. ఓడిన వాళ్లు ఎప్పుడూ ఈవీఎంలను తప్పుపడతారని, విజేతలు అలా చేయరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములు చవిచూస్తున్నా.. మళ్లీ తిరిగి గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కూడా చాలా దశాబ్దాల పాటు అధికారానికి దూరంగా ఉన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. -
మాకూ సీఎం అభ్యర్థి కావాలి...!
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను యూపీ సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడం రాష్ట్రపార్టీ ముఖ్యనేతలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించడం, వయోవృద్ధులను కీలక పదవుల్లో నియమించడం వంటి వాటికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.అయితే షీలా దీక్షిత్ విషయంలో ఆ రెండింటికీ తూచ్ అనడం వారిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీకి సంబంధించి ఇక ప్రయోగాలు చేయొద్దని కాంగ్రెస్ హైకమాండ్‌తో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు మొరపెట్టుకుంటున్నారట... రాష్ట్ర నాయకత్వం నియామకం విషయంలో అనుసరించిన విధానాలు, పద్ధతులను పక్కన పెట్టి సంప్రదాయ పద్ధతుల్లో కొత్త నేతను నియమించాలని విన్నవించుకుంటున్నారట. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా హైకమాండ్ వ్యవహరిస్తే మాత్రం పార్టీలోని వారు ఎవరికి వారే యమునా తీరే చందం కావడం తథ్యమని పనిలో పనిగా హెచ్చరించేస్తున్నారట. అందువల్ల పార్టీలో సీనియర్‌నేత, మాజీ కేంద్ర మంత్రి అయిన ఎస్.జైపాల్‌రెడ్డిని టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తే తెలంగాణలో పార్టీ దానంతట అదే సర్దుకుంటుందని కూడా నాయకత్వం చెవిలో ముఖ్యనేత ఒకరు ఒకటే రొదపెడుతున్నారట. ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిలో విశ్వాసాన్ని కలిగించేందుకు, అధికారపార్టీ టీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు, పార్టీని నడిపించేందుకు జైపాల్‌రెడ్డి వంటి నేత ఉంటే అంతా సర్దుకుం టుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారట. తాము కూడా క్రియాశీలంగా వ్యవహరించి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా కృషి చేసేందుకు ఇది దోహదపడుతుందంటూ రాష్ట్ర నాయకులు చేస్తున్న వాదనపై అధిష్టానం కూడా ఒకింత సానుకూల ధోరణిలోనే ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది..! -
షీలాదీక్షిత్ ఎవరి ఎంపికో తెలుసా?
ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధిచెందిన ప్రశాంత్ కిషోర్ రచించిన స్క్రీన్ ప్లే ప్రకారమే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన కొనసాగుతోందని స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన చేసిన ప్రతిపాదన మేరకే యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను రంగంలోకి దింపడం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం కాదు. కానీ ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పట్టుబట్టారు. బ్రాహ్మణ వర్గం నుంచే సీఎం అభ్యర్థి ఉండాలని కూడా సూచించారు. ఆయన మొదటి ప్రాధాన్యం ప్రియాంక గాంధీకాగా, రెండో ప్రాధాన్యం షీలా దీక్షిత్. రాహుల్‌కు పార్టీలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రియాంకను రంగంలోకి దించడం పార్టీ అధిష్టానానికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నా.. షీలా దీక్షిత్‌ను రంగంలోకి దింపక తప్పలేదు. ముందుగా పార్టీ సీనియర్ నాయకుల నుంచి రాజ్‌బబ్బర్ పేరు తెరమీదకు రాగా, పార్టీలో ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన కూడా సాగడం లేదనే వదంతులు వచ్చాయి. యూపీలో ఉన్న 12 శాతం బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకోవాలంటే షీలాదీక్షిత్‌ను రంగంలోకి దించక తప్పదనే ప్రశాంత్ కిషోర్ వాదనతో కాంగ్రెస్ అధిష్ఠానం ఏకీభవించింది. యాదవులు, జాట్లకు వ్యతిరేకంగా బ్రాహ్మణులను ఆకర్షించక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. యాదవులు, దళితుల్లో ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు పట్టు ఎక్కువగా ఉంది. బీజేపీని ప్రస్తుతం రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్న బ్రాహ్మణవర్గాన్ని ఆకర్షించడమే సులువైన మార్గమన్నది కిషోర్ అభిప్రాయం. పైగా షీలా దీక్షిత్ యూపీ కోడలు కూడా. ఆమె మామ ఉమా శంకర్ దీక్షిత్ యూపీలో పేరుపొందిన బ్రాహ్మణ నాయకుడు. ఓ వ్యక్తిపైనే ప్రధానంగా ప్రచారాన్ని కేంద్రీకరించి పనిచేయడం ప్రశాంత్ కిషోర్‌కు అలవాటు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా, ఆ తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్‌పైనా దృష్టిని కేంద్రీకరించే ప్రచారవ్యూహాన్ని అమలు చేసి.. విజయం సాధించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఈసారి కూడా ప్రచారం చేయనున్నా.. పార్టీ ప్రచార బాధ్యతలను ఆమెకు పూర్తిగా అప్పగించడం లేదు. ఇదివరకు రాహుల్ గాంధీ విషయంలో చేసిన పొరపాటును ప్రియాంక గాంధీ విషయంలో చేయరాదన్నది పార్టీ అధిష్టానం ఉద్దేశం. అందుకనే పార్టీ ఈసారి అన్ని సామాజిక వర్గాల నుంచి ఎంపికచేసిన నాయకులకు పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించింది. ఫలితం ఎలా ఉంటుందో చూడాలని స్థానిక పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైతే ఆ పరాభవం బాధ్యతను ప్రియాంక గాంధీ పంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందని ఆమె మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
షీలా దీక్షిత్ కు ఏసీబీ సమన్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్ ను అధికారికంగా ప్రకటించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఆమెకు సమన్లు జారీ చేసింది. కోట్లాది రూపాయల వాటర్ ట్యాంక్ కుంభకోణంలో షీలాకు నోటీసులు జారీ చేశామని, ఆమెను ఆగస్టు 26న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా కోరామని ఏసీబీ చీఫ్ ఎమ్ కే మీనా తెలిపారు. దీనిపై స్పందించిన షీలా ఏసీబీ నుంచి తనకు నోటీసులు అందాయని ధృవీకరించారు. షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో వాటర్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. ఆ సమయంలో ఢిల్లీ వాటర్ బోర్డులో అవినీతి చోటు చేసుకుంది. దీనిపై ఆమ్ ఆద్మీ సర్కార్ విచారణకు ఆదేశించింది. ఈ క్రమం లోనే ఆమెను విచారించేందుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. -
మాజీ సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు!
ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహార్, లలిత్ గేట్లో రాజస్థాన్ సీఎం వసుంధర రాజే.. ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఎఫ్ఐఆర్లోకి ఎక్కుతున్న ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతున్నది. తాజాగా ఓ అవినీతి కుంభకోణానికి సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షత్ పేరు చేరింది. వివరాల్లోకి వెళితే.. 2014కు ముందు షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడు దఫాలు పనిచేశారు. ఆమె పదవిలో ఉన్న 15 ఏళ్లూ.. వేసవిలో ఢిల్లీ ప్రజలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసేవారు. కాగా, ఈ సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టులు, తదితర వ్యవహారాల్లో రూ. 400 కోట్ల అవినీతి జరిగినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. గత ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ.. వాటర్ ట్యాంకర్ కుంభకోణాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కుంభకోణంపై దర్యాప్తు జరిపించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం ఎల్జీ నవాజ్ జంగ్‌ను కోరింది. అనుమతి లభించడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఇటీవలే ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. అందులో మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరు పలుమార్లు ప్రస్తావనకు రావడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బీజేపీకి వత్తాసు పలకలేదు:షీలా దీక్షిత్
ఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమివ్వాలని, ఢిల్లీ ప్రజలకు కూడా అది మంచిదని వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ ఇప్పుడు ఆత్మసంరక్షణలో పడ్డారు. ఢిల్లీలో బీజేపీ సర్కారుకు జైకొట్టిన ఆమె మాటమార్చారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తాను ఎప్పుడూ కోరలేదని స్పష్టం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం సృష్టించడంతో దానిని సరిదిద్దుకునే పనిలో పడ్డారు. 'ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు తాను అనుకూలంగా ఎప్పుడూ మాట్లడలేదు. ఆ రకంగా ఎప్పటికీ వ్యాఖ్యానించను' అని షీలా తెలిపారు. ఆ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి తగిన సంఖ్యా బలం ఉంటే ఇబ్బంది ఏమిటని మాత్రమే తాను చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వాన్నే ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఒకవేళ బీజేపీ ఆ అవకాశం ఉంటే ప్రభుత్వ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
షీలాకు కాంగ్రెస్ కు మధ్య పెరిగిన దూరం!
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమివ్వాలని, ఢిల్లీ ప్రజలకు కూడా అది మంచిదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ వ్యాఖ్యలు కాస్తా ఆమెకు మరింత తలనొప్పిగా మారాయి. బీజేపీ ప్రభుత్వంపై షీలా చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై కాంగ్రెస్ అలకబూనినట్లు తెలుస్తోంది. ఒకప్రక్క ఆప్ తో సహా కాంగ్రెస్ కూడా ఢిల్లీలో తాజాగా ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో షీలా వ్యాఖ్యలు పార్టీకి మింగుడు పడటం లేదు. పార్టీ విధానాన్ని పక్కనుపెట్టి బీజేపీ అధికారం ఇస్తే మంచిదని పేర్కొనడమే ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు ప్రాధమిక సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు షీలా పరోక్షంగా తన వ్యాఖ్యల ద్వారా జై కొట్టడంతో కాంగ్రెస్ ను డైలామాలో పడేసింది. దాంతో పార్టీ శ్రేణులు ఆమె వైఖరిపై గుర్రుగా ఉన్న తరుణంలో ఆమె తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే పనిలో పడింది. ఆదివారం షీలా మీడియాతో మాట్లాడుతూ..ఆ రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిని, రాజ్యాంగపరమైన నిబంధనలను మాత్రమే చెప్పానంటూ ఆమె తాజాగా తెలిపింది. అయితే ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేయడంపై మాత్రం ఆమె మాట్లాడటానికి నిరాకరించారు. -
బీజేపీకి అవకాశం ఇవ్వాలి
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై షీలా దీక్షిత్ న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమివ్వాలని, ఢిల్లీ ప్రజలకు కూడా అది మంచిదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలు ఉండటమే మంచిదని, ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయికి బీజేపీ చేరుకుని ఉంటే బీజేపీ ఆ పనిచేయవచ్చని షీలా దీక్షిత్ గురువారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకోసం బీజేపీ ఎమ్మెల్యేల వేటలో పడిందంటూ ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో షీలా దీక్షిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్నికలు కావాలని కాంగ్రెస్‌గానీ, ఆప్‌గానీ కోరుకోవడంలేదని షీలా దీక్షిత్ అన్నారు. అయితే,..ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? మైనారిటీ ప్రభుత్వం ఎదుర్కొనే సవాళ్లేమిటి?.. ఇవన్నీ బీజేపీకి సంబందించినవేనని ఆమె అన్నారు. షీలా దీక్షిత్ వ్యాఖ్యలపట్ల బీజేపీ హర్షం వ్యక్తంచేసింది. 15 ఏళ్లపాటు ఢిల్లీలో ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ఆమెకు ప్రభుత్వం ఏర్పాటుపై రాజ్యాంగ నిబంధనలన్నీ తెలుసునని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ అన్నారు. కాగా, షీలా దీక్షిత్ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం కావచ్చని, ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుముఖంకాదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. -
చెప్పుల మాయ.. ఏసీల షీలా!!
అంది వచ్చిన అధికారాన్ని అయినకాడికి ఉపయోగించుకోవటంలో ప్రజా ప్రతినిధులు ముందుంటారు. అయితే అందుకు మహిళా ప్రజాప్రతినిధులు మినహాయింపు కాదేమో. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల సొమ్ము అడ్డంగా అనుభవించటంలో వాళ్లకు మించినవారు లేరు. ఓవైపు ఢిల్లీవాసులు కరెంట్ కోతలతో కష్టాలు పడితే అప్పట్లో ఆ పీఠాన్ని ఏలిన షీలా దీక్షిత్ మాత్రం తన అధికార నివాసంలో ఏకంగా 31 ఏసీలు ఏర్పాటు చేసుకుని ఎంచక్కా కూల్‌గా విశ్రాంతి పొందారట. సమాచార హక్కు చట్టం హక్కు కింద అడిగిన ఒక వివరణలో షీలమ్మ గారి రాజభోగం బయటపడింది. కేవలం ఏసీలే కాకుండా, 15 కూలర్లు, 25 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫయర్లు, 12 గీజర్లను వాడేసుకున్నారు. ఓ మహిళా ముఖ్యమంత్రి కొత్త చెప్పులు తెప్పించుకోవడానికి ముంబైకి ఖాళీ విమానాన్ని పంపిస్తే, మరొక ఆమె బంగారు ఆభరణాల్ని తరలించేందుకు మూడు వ్యాన్లు ఉపయోగించాల్సి వచ్చింది. ఇక దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా అధికారం చేపట్టిన ఒకామె ... అవకాశం వచ్చినప్పుడల్లా విమానాలు ఎక్కి విదేశాల్లో చక్కర్లు కొట్టారు. ఆడంబరాలను అతిగా ప్రేమించి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి కేవలం తనకు ఇష్టమైన బ్రాండు చెప్పులను తెప్పించుకోవడానికి ముంబైకి ఖాళీ విమానాన్ని పంపారు. ఈ విషయాన్ని వికీలీక్స్ బయటపెట్టడంతో అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఇక తమిళ పురుచ్చితలైవి జయలలిత ఏది చేసినా సంచలనమే. ఆభరణాలంటే తెగ మక్కువ చూపే ఆమె అక్రమాస్తుల కేసులో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆ ఆభరణాలను తరలించేందుకు అధికారులు మూడు వ్యాన్లు ఉపయోగించాల్సి వచ్చిందంటే ఊహించుకోవచ్చు. ఇక జయలలిత దగ్గర 750కి పైగా చెప్పులు కూడా ఉన్నాయని లెక్క తేల్చారు. ఇదిలాఉంటే దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా పనిచేసిన ప్రతిభా దేవీ సింగ్ పాటిల్ విదేశీ పర్యటనల వ్యయం వింటే కళ్లు గిర్రున తిరిగిపోవాల్సిందే. రాష్ట్రపతిగా పనిచేసిన ఐదేళ్లలో ఆమె విదేశీ పర్యటనల ఖర్చు 205 కోట్లు పైనే అయింది. మొత్తం 12 సార్లు 22 దేశాల్లో ఆమె పర్యటనల కోసం ఎయిరిండియాకు అయిన ఖర్చు 169 కోట్ల రూపాయిలు. ఇవన్నీ బయటకు వచ్చిన కొన్ని మాత్రమే. రాజు తలచుకుంటే...దెబ్బలకు కొదవా అన్నట్లు... కాదు కాదు... రాణులు తలచుకుంటే తమ దర్పాన్ని ఎలాగైనా ప్రదర్శించవచ్చు. -
రింగు రోడ్డులో రూ. 184 కోట్ల స్కాం
మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. రింగురోడ్డు నిర్మాణంలో ఏకంగా రూ. 184 కోట్ల అవినీతి బయటపడింది. ఢిల్లీలోని షీలాదీక్షిత్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2010లో కామన్వెల్త్ క్రీడలకు ముందు రింగ్ రోడ్ బైపాస్ నిర్మాణంలో ఈ అవినీతి జరిగిందని, దీనిపై ఏసీబీ విచారణ జరిపించాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కోరింది. దీంతో ఏసీబీ ముందుగానే ఓ ఎఫ్ఐఆర్ దాఖలుచేసి విచారణ మొదలుపెట్టింది. ఇందులో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ పాత్రను కూడా శోధించనున్నారు. సాలింగఢ్ కోట నుంచి వెలోడ్రమ్ రోడ్డు వరకు నిర్మించిన రింగురోడ్డులో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు ప్రధానమంత్రి నియమించిన షుంగ్లు కమిటీ తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా చేసి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీని మొత్తం విలువ రూ. 407 కోట్లు. ఈ ప్రాజెక్టులో సామగ్రితో పాటు కూలీల ఖర్చును కూడా కాంట్రాక్టర్లు ఎక్కువ చేసి చూపించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 184 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై ఏసీబీ విచారణతో నిగ్గుతేల్చాలని కేజ్రీవాల్ సర్కారు కోరింది. -
ఏసీబీకి ‘వీధిదీపాల’ రికార్డులు!
న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ సర్కారు హయాంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల సమయంలో వెలుగుచూసిన వీధిదీపాల కుంభకోణం కేసులో అన్ని రికార్డులను పరిశీలించనున్నట్లు శుక్రవారం ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్ సర్కార్ ఆదేశం మేరకు గురువారం ఏసీబీ మొదటి ఎఫ్ఐఆర్ నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ వీధిదీపాల కొనుగోలు ఫైల్‌ను అప్పటి సీఎం షీలాదీక్షిత్ స్వయంగా ఆమోదించారు. దాంతో ఈ కుంభకోణంలో షీలా పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సీడబ్ల్యూజీ కుంభకోణంలో అప్పటి షీలా ప్రభుత్వంతోపాటు, కార్పొరేషన్ అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాలని అవినీతి నిరోధక విభాగాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ నమోదు చేసిన మొదటి ఎఫ్ఐఆర్లో షీలాదీక్షిత్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన ఈ కొనుగోలులో అని ఒక వాక్యం చేర్చడంతో మున్ముందు ఈ కుంభకోణంలో షీలా పేరును కూడా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో ఈ వీధిలైట్ల కొనుగోలుపై పలు విమర్శలు వెల్లువెత్తడంతో దీనిపై విచారణకు మాజీ కాగ్ వి.కె.షుంగ్లూ ఆధ్వర్యంలో ఒక కమిటీని ప్రధానమంత్రి స్వయంగా నియమించారు. ఈ కమిటీ తన నివేదికలో వీధిలైట్ల కొనుగోలులో అప్పటి సీఎం షీలా అనవసరం జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు. కాగ్ 2011లో ఇచ్చిన నివేదికలోనూ ఈ విషయంలో షీలా ప్రమేయాన్ని తప్పుపట్టింది. కామెన్వెల్త్ గేమ్స్ సమయంలో పలు స్టేడియాల వద్ద రోడ్లపై విదేశీ లైట్లు ఏర్పాటు చేసినప్పుడు తగిన ప్రమాణాలను పాటించలేదని పేర్కొంది. అయితే అప్పటి సీఎం ఈ విషయంలో ప్రత్యేక ఆసక్తి చూపించడంతో ప్రభుత్వానికి రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ఏసీబీ వీధిలైట్ల కుంభకోణంపై ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. కాగా షుంగ్లూ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని ఈ కేసులో ముందుకుపోవాలని ఏసీబీ భావిస్తోంది. ‘ఈ కుంభకోణంలో నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించాం. మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఇందులో మేం ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకుని కేసు నమోదుకు అనుమతించలేదు..’ అని మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ‘కామన్వెల్త్ క్రీడల సమయంలో ఢిల్లీ సర్కార్ అధీనంలో చేపట్టిన అన్ని పనులపైనా ఏసీబీ దర్యాప్తు జరుపుతుంద’ని న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భర్తీ స్పష్టం చేశారు. -
షీలాదీక్షిత్‌కు లైట్ షాక్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్‌ను సమస్యలు చుట్టుముడుతున్నారుు. ఓ పక్క పార్టీ అధిష్టానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే, మరోపక్క కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఆమెను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. షీలాదీక్షిత్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని ఎన్నికల సమయంలో ఆప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆప్ ప్రభుత్వం.. 2010 కామన్వెల్త్ క్రీడల సమయంలో ఫ్యాన్సీ వీధిదీపాల కొనుగోలులో అవినీతి జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ గురువారం దర్యాప్తు ప్రారంభించింది. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసింది. అరుుతే ఇందులో షీలా దీక్షిత్ పేరు లేదని, తదుపరి దశలో చేర్చే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ మద్దతుతో మనుగడ సాగిస్తుండటం వల్లే ఆప్ సర్కార్ షీలాదీక్షిత్‌పై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతోందని బీజేపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సమావేశమైన ఢిల్లీ కేబినెట్.. కామన్వెల్త్ క్రీడల సమయంలో వీధిదీపాల కొనుగోలు వ్యవహారంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు జరపాల్సిందిగా ఏసీబీని ఆదేశించినట్లు పీడ బ్ల్యూడీ మంత్రి మనీష్ సిసోడియా భేటీ అనంతరం విలేకరులకు చెప్పారు. వీధిదీపాల కొనుగోలులో ప్రభుత్వానికి రూ. 31 కోట్ల నష్టం జరిగిందని అప్పట్లో దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయని అన్నారు. దీనిలో ఎమ్సీడీ అధికారుల హస్తం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయని, ఈ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశించామని మనీష్ చెప్పారు. ఇదీ నేపథ్యం - కామన్వెల్త్ క్రీడల సమయంలో ఇందిరాగాంధీ స్టేడియం, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఆకర్షణీయమైన వీధిదీపాలను అమర్చారు. అయితే ఈ లైట్లు కాషాయ రంగులో ఉండడం దీక్షిత్‌కు నచ్చలేదు. వాటిని మార్చాలన్న ఆమె ఆదేశాలతో పీడబ్ల్యూడీ ఆదరాబాదరాగా కొత్త దీపాలు ఏర్పాటు చేసింది. - కాంట్రాక్టు నియమాలను పక్కనబెట్టి సౌదీ అరేబియాకు చెందిన స్పేస్ ఏజ్ కంపెనీ నుంచి తెప్పించిన స్ట్రీట్ లైట్లను అమర్చారని, బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన స్పేస్ ఏజ్ కంపెనీని షీలాదీక్షిత్ జోక్యంతోనే బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించారనేది ఆ ఆరోపణల సారాంశం. - సీఎం హోదాలో షీలా ఈ ప్రాజెక్టుపై సంతకం చేశారు. ఐదారు వేల రూపాయలకు లభించే లైట్లను ప్రభుత్వం రూ.25,000-రూ.32,000 వెచ్చించి కొనుగోలు చేసిందని ఈ క్రీడల ఏర్పాట్లపై దర్యాప్తు జరిపిన కాగ్ పేర్కొంది.. దీనివల్ల ప్రభుత్వానికి రూ.31 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. - 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు జరిపించాలని ఆప్ ప్రభుత్వం గురువారం లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు సిఫారసు చేసింది. సిట్ విచారణలో భాగంగా అల్లర్లకు సంబంధించి మూసేసిన కేసులను, ఆచూకీ తెలియదని పేర్కొన్న కేసులను తిరగదోడి చార్జిషీట్లు దాఖలు చేస్తామని సిసోడియూ చెప్పారు. - మరోవైపు కాంగ్రెస్ హయూంలో ప్రభుత్వ ప్రకటనల వ్యవహారంపై కూడా దర్యాప్తుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్టు సమాచారం. -
రాష్ట్రం నుంచి రాజ్యసభకు షీలా దీక్షిత్!
కాంగ్రెస్ హైకమాండ్ యోచన మళ్లీ పెద్దల సభ వైపు టీఎస్ఆర్ అడుగులు కొప్పుల రాజు, ఎంఏ ఖాన్, కేవీపీలకు అవకాశం! సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆమెను రాష్ట్రం నుంచి పోటీ చేయించే అవకాశాలను అధిష్టానం పరిశీలించినట్టుగా ఇక్కడి కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. అయితే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సమయంలో దీక్షిత్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తారని తాము భావించడం లేదని పీసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీ సూచించే స్థానిక నేతలకే ఓట్లు పడతాయో లేదో తెలియుని పరిస్థితిలో ఇతర రాష్ట్రాల వారిని పంపిస్తే వారిని గెలిపించుకోవడం కత్తిమీద సామేనని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. ఇలావుండగా విశాఖపట్నం లోక్‌సభ స్థానం కోసం ఇంతకాలం పట్టుబట్టిన టి.సుబ్బరామిరెడ్డి తాజాగా రాజ్యసభకు తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయుం వల్ల విశాఖలో లోక్‌సభకు పోటీచేసినా గెలవడం సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే ఆయున మరోసారి రాజ్యసభ సీటు అడుగుతున్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నారుు. మొత్తం 6 స్థానాల్లో కాంగ్రెస్ మూడింటిని కచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉండగా, నాలుగో స్థానంపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్‌కు సాంకేతికంగా అసెంబ్లీలో 146 వుంది ఎమ్మెల్యేలున్నా వలసలతో ఆ సంఖ్య భారీగా కుదించుకుపోతోంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా కొప్పుల రాజు, ఎంఏ ఖాన్ పేర్లు ప్రవుుఖంగా వినిపిస్తున్నారుు. వూజీ ఐఏఎస్ అధికారి అరుున రాజు కాంగ్రెస్‌లో చేరి ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ టీమ్‌లో వుుఖ్యభూమిక పోషిస్తుండడంతో ఆయునకు సీటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. పదవీ విరమణ చేస్తున్న కేవీపీ రావుచంద్రరావుకు కూడా రెండోసారి అవకాశం దక్కవచ్చని పార్టీలో వినిపిస్తోంది. ‘సీమాంధ్ర’ షాక్ తప్పదా!: రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానానికి షాకిచ్చే అంశంపై సీవూంధ్రకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సవూలోచనలు జరిపారు. విభజన అంశంలో తవుకు వీసమెత్తు విలువ కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా వుుందుకు వెళ్తున్న పార్టీ పెద్దలకు గుణపాఠం నేర్పాలంటే ఇదే సరైన సవుయువుని వారు భావిస్తున్నారు. సోవువారం అసెంబ్లీ లాబీల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల వుధ్య ఈ ప్రస్తావన వచ్చింది. అక్కడినుంచి అది ఇతర జిల్లాల ఎమ్మెల్యేలకూ పాకింది. ఈ అసెంబ్లీ సమయంలో జరిగే చిట్టచివరి రాజ్యసభ ఎన్నికలు ఇవే కావడం, త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఎమ్మెల్యేలు ఎవరూ అధిష్టానం వూట వినే పరిస్థితి ఉండదని రాయులసీవు వుంత్రి ఒకరు చెప్పారు. -
బేషరతు మద్దతని ఎప్పుడూ చెప్పలేదు: షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ సర్కారుపై తీవ్రస్థాయిలో ఉద్యమం చేసిన అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపి సర్కారును ఏర్పాటుచేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి షరతులతో కూడిన మద్దతే ఉంటుందని షీలా దీక్షిత్ చెప్పారు. బేషరతు మద్దతని ఎప్పుడూ చెప్పలేదని షీలా దీక్షిత్ స్పష్టం చేశారు.అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయాన్ని షీలా దీక్షిత్ స్వాగతించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ నెరవేరుస్తుందని ఆమె అన్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు లెప్టినెంట్ గవర్నర్‌ను కలవనున్నట్టు తెలుస్తోంది. సర్కారు ఏర్పాటు చేయాలంటూ 6.97 లక్షల ఎస్ ఎమ్ ఎస్ లు వచ్చినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. -
హస్తిన హస్తానికి మరమ్మతులు
సాక్షి, న్యూఢిల్లీ: హస్తినలో పదిహేనేళ్లుగా అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కుదేలవడంపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టిసారించింది. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యం లో పార్టీకి మరమ్మతులు ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీశాఖపై ప్రత్యేకంగా దృష్టిసారించిన పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ ఇందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. యువతకు పెద్ద పీట వేయడంతోపాటు కొత్తవారికి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే సీనియర్ నాయకులను పక్కన పెట్టి 46 ఏళ్ల అర్విందర్‌సింగ్ లవ్లీకి ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని కట్టబెట్టినట్టు తెలుస్తోంది. దీనిద్వారా ఢిల్లీలో పార్టీకి యువరక్తం ఎక్కించనున్నట్టు సంకేతాలు పంపింది. పార్టీలో ఏళ్లుగా పాతుకుపోయిన నాయకులపై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకత సైతం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణంగా అధిష్టానం భావిస్తోందని కొందరు నాయకులు పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపంతో షీలాసర్కార్ 15ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లలే కపోయామని రాహూల్ గాంధీ స్వయంగా వ్యాఖ్యానించినట్టు తెలిపారు. డీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న జైప్రకాశ్ అగర్వాల్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్ మధ్య అంతరాల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కొత్త నిర్ణయాలు తీసుకున్నట్టు సమచారం. కొత్తగా డీపీసీసీ పగ్గాలు చేపట్టిన అర్విందర్‌సింగ్ లవ్లీకి షీలాదీక్షిత్‌కి సాన్నిహిత్యం ఉండడంతో ఇకపై ఎలాంటి విభేదాలు ఉండబోవన్నది అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది. యువతకు చేరువయ్యేందుకే... ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో ఓటర్లుగా ఉన్న యువతకు చేరువ కాలేకపోవడమూ ఎన్నికల్లో ఓటమికి ఓ కారణంగా పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. దీంతో యువతకు ప్రాధాన్యం పెంచితే కొత్త ఉత్సాహాన్ని పార్టీలో నింపవచ్చన్నది వారి భావన. 1987 నుంచి ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న అర్విందర్‌సింగ్ లవ్లీ 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. షీలాదీక్షిత్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పార్టీ నాయకులతో లవ్లీకి ఉన్న సాన్నిహిత్యం అంతర్గత విభేదాలు తొలగించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లోనే వీలైనంత మంది కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. కానీ షీలాదీక్షిత్‌పై ఉన్న నమ్మకంతో ఆమె సలహా మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలనే ఎక్కువ స్థానాల్లో పోటీకి దింపారు. సరిగ్గా అదే వ్యూహం బెడిసికొట్టడంతో పార్టీ నాయకత్వం మరోమారు ఆలోచనలో పడింది. కత్తిమీద సామే... పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయిన పరిస్థితుల్లో డీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న అర్విందర్‌సింగ్ లవ్లీ ఎంతో నేర్పుగా వ్యవహరించాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నిక లకు గడువు చాలా తక్కువగా ఉండడంతో పార్టీని బలోపేతం చేయడంతోపాటు, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తేవడం అంతసులువైన పనేంకాదు. ఇన్నాళ్లు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్‌గా ఉన్న జుగ్గీ జోపిడీలు, అనధికారిక కాలనీల్లో, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది. ఆ ప్రాంతాలను తిరిగి కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చడం అంత సులువేం కాదు. ఇన్నాళ్లు అధికార మంత్ర దండంతో ప్రజలను ఆకర్షించినట్టు చేసేం దుకు కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం లేదు. వీట న్నింటి నడుమ పార్టీ పూర్వవైభవం తేవడంలో లవ్లీ ఏమేరకు సఫలమవుతారో మరికొద్ది నెలల్లో తేల నుంది. మరోవైపు పార్టీ అధిష్టాన వర్గం తనపై ఉంచిన అంచనాలు అందుకుంటానన్న ఆత్మవిశ్వాసాన్ని అర్విందర్‌సింగ్ లవ్లీ వ్యక్తం చేస్తున్నారు. -
గెలిచినా.. ఓడినా షీలాకే..!
న్యూఢిల్లీ: అన్నీతానై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నడిపించిన ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్‌కే కాంగ్రెస్ పార్టీ గెలుపోటముల కీర్తి-అపకీర్తి దక్కనుంది. పదిహేనేళ్ల కాంగ్రెస్‌పాలనపై ఢిల్లీవాసులు ఆగ్రహంగా ఉన్నారని, వారంతా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మొండిచెయ్యి చూపనున్నట్టు సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి. అయితే అనూహ్య పరిణామాలతో గెలిచి తీరతామన్న ధీమా కాంగ్రెస్ నాయకుల్లో ఇంకా మిగిలే ఉంది. అదే జరిగితే ఆ క్రెడిట్ అంతా షీలాదీక్షిత్‌కే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని నిత్యం చెప్పే షీలాదీక్షిత్‌కి ఇటీవల కొన్ని సంఘటనలు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. శాంతిభద్ర తల అంశం ఆమె చేతుల్లో లేనప్పటికీ నిర్భయ ఘటనతో షీలాదీక్షిత్ ప్రతిభ మసకబారింది. అదే సమయంలో చుక్కల్లోకి చేరిన ఉల్లి, కూరగాయల ధరలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. పదిహేనేళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓటమి తప్పదన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం షీలాదీక్షిత్‌ను ఒంటరిని చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆకర్షణ కావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభలకు జనం పల్చబడడంతో ఆయన నెమ్మదిగా మెహం చాటేశారు. మొదట బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి ధీటుగా రాహుల్ సభలు నిర్వహించాలని భావించారు. ఆ తర్వాత పరిణామాలతో మరింత నష్టం జరుగుతుందని భావించిన పార్టీ అధిష్టానం రాహుల్ ప్రచార సభలు తగ్గించి ఆయనను తప్పించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం ఒక్కటంటే ఒక్కటే సభతో సరిపెట్టారు. ఇక ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ బహిరంగ సభలో పాల్గొంటారని ప్రకటించినా మోడీ సభలకు వస్తున్న స్పందన చూసి ఆ సాహసం చేయలేక విదేశీ అధ్యక్షుల పర్యటనను సాకుగా చూపి చాలించుకున్నారు. పార్టీ ఎంపీల్లోనూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జేపీ అగర్వాల్ మినహా మరెవరూ ఆసక్తి చూపలేదు. కేంద్ర మంత్రి కపిల్ సిబల్ సైతం రెండు మూడు సభలకే పరిమితమయ్యారు. అధిష్టానం మొహం చాటేసినా 75 ఏళ్ల షీలాదీక్షిత్ ఒంటి‘చేత్తో’ ప్రచారరథాన్ని నడిపించారు. పదిహేనేళ్ల పాలనలో తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మరోమారు తనను ఢిల్లీ గద్దెపై కూర్చోబెడతాయన్న ధీమాతో షీలా ఉన్నారు. -
పెరుగుతున్న ఉల్లం‘ఘనులు’..!
ఢిల్లీ ఎన్నికల్లో అతిక్రమణలపై 313 కేసులు ఆమ్‌ఆద్మీపార్టీపై 90, బీజేపీపై 68, కాంగ్రెస్‌పై 59 సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై పోటీకి దిగుతున్న అరవింద్ కేజ్రీవాల్ కూడా తాజాగా ఈ ఉల్లం‘ఘనుల’ జాబితాలో చేరారు. మతం పేరుతో ముస్లింల ఓట్లు అడిగిన కారణంగా కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం బుధవారం నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు మరో 12 రోజులే మిగిలి ఉండడడంతో ఎన్నికల అధికారులు అభ్యర్థుల ప్రచారసరళిని డేగకళ్లతో పరిశీలిస్తున్నారు. ఏమాత్రం కట్టుదాటినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఈసీ నిబంధనల కొరడా ఝులిపిస్తుండడంతో అభ్యర్థులు ఎంతో అప్రమత్తంగా మసలుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉల్లంఘనల్లో ఆప్ నేతలే టాప్.. ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం 2,908 ఫిర్యాదులు రాగా.. 313 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆమ్ఆద్మీపార్టీ నాయకులపైనే అత్యధికంగా 90 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బీజేపీ నాయకులపై 68, కాంగ్రెస్ నాయకులపై 59 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)పై కూడా 23 కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. వీరితోపాటు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న కొన్ని ప్రింటింగ్ ప్రెస్‌ల నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా నేర చరిత్ర ఉన్న 7,708 మంది వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 920 లెసైన్స్డ్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 222 మందిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
మళ్లీ ‘చే’యూతనివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ:పదిహేనే ళ్ల పాలనలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నగరాన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఢిల్లీ నగర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, మరోమారు ప్రజలు ఆదరించాలని నగరవాసులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం అంబేద్కర్‌నగర్‌లో నిర్వహించిన మమ్మత్ ర్యాలీలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, డీపీసీసీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జి షకీల్ అహ్మద్‌తో కలిసి పాల్గొన్నారు. బీజేపీ తప్పుడు వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తోందని రాహుల్ విమర్శించారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఢిల్లీలోని పేద, బలహీన వర్గాల ప్రజల్లో ఎంతో మార్పు తీసుకువచ్చిందన్నారు. పదిహేనేళ్లలో వినూత్న మార్పులు వచ్చాయన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత మెట్రో రైలుతోపాటు ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఢిల్లీ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మెట్రో రైలు మార్గాలను విస్తరించడంతోపాటు మోనోరైలును అందుబాటులోకి తెస్తామన్నారు. ఢిల్లీలోని ఉపాధి అవకాశాలతో దేశంలోని నలుమూలల నుంచి ఎంతోమంది వలసలు వస్తున్నారన్నారు. తన కుటుంబం సైతం ఢిల్లీకి వలస వచ్చిందని పేర్కొన్నారు. పదిహేనేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మరోమారు అధికారంలోకి తీసుకువస్తాయని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు వాగ్ధానాలను ఢిల్లీవాసులు నమ్మబోరన్నారు. అధికారమిస్తే వెండింగ్ మెషీన్ల ఏర్పాటు కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తే మదర్ డెయిరీ తరహాలో రాయితీ ఆహార ధాన్యాల కోసం వెండింగ్ మెషీన్లను అమరుస్తామని సీఎం షీలా దీక్షిత్ హామీని ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారు రేషన్ దుకాణాలకు వెళ్లినప్పుడు తక్కువ మోతాదులో ఆహార ధాన్యాలు ఉండటం, మొత్తానికి అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు వెండింగ్ మెషీన్లను ఏర్పాటుచేయాల్సిన అవసరముందన్నారు. అంబేద్కర్ నగర్‌లోని ఎన్నికల ర్యాలీలో ఆమె ఆదివారం పాల్గొని ప్రసంగించారు. ‘టోకెన్ల ద్వారా మదర్ డెయిరీ కేంద్రాల్లో పాలను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అదే తరహాలో రేషన్ దుకాణాల్లో రాయితీకి వచ్చే గోధుమలు, బియ్యం, పప్పులు కొనుగోలు చేసేం దుకు వచ్చే సామాన్యుల కోసం వెండింగ్ మెషీన్లను అమరుస్తామ’ని అన్నారు. గత 15 ఏళ్లలో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి గురించి ఏకరువు పెట్టారు. తమను అధికారంలోకి తీసుకొస్తే వచ్చే ఐదేళ్లలో ప్రజల తలసరి ఆదాయం ప్రస్తుతమున్న దానికి రెండింతలు చేస్తామని అన్నారు. ‘ఢిల్లీలో తలసరి ఆదాయం ఎక్కువగానే ఉంది. అయినా వచ్చే ఐదేళ్లలో రెండింతలు చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఏడాదికి రూ.రెండు లక్షలు సంపాదించే ప్రజలు అప్పటికీ నాలుగు నుంచి ఐదు లక్షలు సంపాదించేలా చర్యలు తీసుకుంటామ’ని తెలి పారు. జీవనోపాధి కోసం రోడ్డు పక్కన చిన్నచితక వ్యాపారాలు నిర్వహించే హాకర్ల కోసం ప్రత్యేక వ్యాపార జోన్లను ఏర్పాటుచేస్తామని హామీనిచ్చారు. వీరికి ప్రత్యేక జోన్లను నిర్మిస్తామని, దీంతో వ్యాపారం సజావుగా నిర్వహించుకోవచ్చన్నారు. పోలీసులు, కార్పొరేషన్ల వేధింపులు అప్పుడు ఉండవని తెలిపారు. నగరంలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో మరుగుదోడ్లు నిర్మించాలని తెలిపారు. బాధ్యతాయుతం గా వ్యవహరించే ప్రభుత్వానికే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తప్పుడు హామీలిచ్చే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, ఏఏపీలను నమ్మొద్దని కోరారు. ఢిల్లీలో మహిళలకు భద్రత లేదని ఆరోపిస్తున్న బీజేపీ వారికి ఏ విధంగా రక్షణ కల్పిస్తోందో వివరించాలని అన్నారు. పార్టీకి నిధులు ఎలా వచ్చా యో తెలపాలని ఏఏపీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌ను నిలదీశారు. పెరిగిన ఉల్లి, ఆలుగడ్డ ధరలను నియంత్రించేందుకు ఇప్పటికే తక్కువ రేట్లకు కూరగాయలు విక్రయించే ఏర్పాట్లు చేశామన్నారు. -
తెలుగువారంతా మావెంటే
కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఢిల్లీ సీఎం షీలా సాక్షి ప్రతినిధి ఎన్.సత్యనారాయణ: న్యూఢిల్లీ: హస్తినలో వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని ‘హస్త’గతం చేసుకోబోతున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 4న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యేనన్నారు. తొలిసారి రాష్ట్ర ఎన్నికల బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీని ఆమె తేలిగ్గా తీసుకున్నారు. అది రాజకీయ పార్టీనో కాదో ఎన్నికల తర్వాత తేలిపోతుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం ‘సాక్షి’కి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు... ప్రశ్న: ఈ సారి ఢిల్లీలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? జవాబు: కచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది. ఎలాంటి సందేహమూ లేదు. ప్రశ్న: ఢిల్లీలో 10 లక్షల మంది తెలుగు వారున్నారు. వారు ఎవరి వైపు మొగ్గొచ్చు? జవాబు: ఢిల్లీలో ఇంతమంది తెలుగు వారుండటం మాకెంతో గౌరవం. రాష్ట్రాభివృద్ధిలో వాళ్లది కీలకపాత్ర. వారు గతంలో మా వెంటే ఉన్నారు. ఈసారీ మావెంటే ఉంటారని నమ్ముతున్నాం. ప్రశ్న: ఆమ్ ఆద్మీ, బీజేపీల్లో మీ ప్రధాన ప్రత్యర్థి ఏది? జవాబు: ఎన్నికల్లో పోటీచేసే హక్కు అందరికీ ఉంది. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుంది. ప్రశ్న: కాంగ్రెస్ ఓటు బ్యాంకైన బడుగులు, ముస్లిం మైనారిటీల ఓట్లను ఆమ్ ఆద్మీ చీలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి? జవాబు: అదసలు రాజకీయ పార్టీనో కాదో ఇంకా తేలలేదు! ప్రజలు ఆ పార్టీ వైపు ఉన్నారో లేదో ఎన్నికల్లో తేలుతుంది. ప్రశ్న: ఆమ్ ఆద్మీ వినూత్న ప్రచారంతో ఆకట్టుకుంటోంది కదా? జవాబు: ప్రచారంతో గెలుపు సాధ్యం కాదు. ఓట్లు రావు. ప్రశ్న: మీ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, కామన్వెల్త్ క్రీడల స్కాం, ఉల్లి, టమాట ధరలు గెలుపుపై ప్రభావం చూపుతాయా? జవాబు: అవినీతికి ఆధారాలున్నాయా? ఉల్లి, టమోటా ధరలు తగ్గాయి. జనానికి పార్టీ మేనిఫెస్టో ఏమిటనేదే ప్రధానం. ప్రశ్న: ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన, మహిళలకు భద్రతపై మీ స్పందన? జవాబు: నిర్భయ ఘటన బాధాకరం. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను మా ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. సీఎం కార్యాలయంలో ‘181’ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశాం. పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు తీసుకున్నాం. -
కాంగ్రెస్ అభ్యర్థుల్లో మహిళలు ఆరుగురే
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మహిళే... దేశ రాజధానిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి మహిళే... అంటూ తమ పార్టీ గురించి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో మాత్రం మహిళలకు అంతగా ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపించడంలేదు. 70 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ జాబితాలో కేవలం ఆరుగురు మాత్రమే మహిళలున్నారు. అందులో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, మంత్రి కిరణ్ వాలియా, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ బర్ఖాసింగ్ ముగ్గురూ పాతవారే కాగా మరో ముగ్గురిని మాత్రమే కొత్తగా బరిలోకి దించుతోంది. ఈసారి రాగిణీ నాయక్, అమతా ధవన్, ధన్వంతీ చండీలాలు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాగిణీ నాయక్, అమతా ధవన్ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు కాగా ధన్వంతీ చండీలా రాజోరీ గార్డెన్ శాసనసభ్యుని సతీమణి. తొలి జాబితాలో మొదటి ముగ్గురి పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ చివరి ముగ్గురి పేర్లను మలి జాబితాలో చేర్చింది. వీరిలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ న్యూఢిల్లీ నుంచి, కిరణ్ వాలియా మాలవీయనగర్ నుంచి, బర్ఖాసింగ్ ఆర్కెపురం నుంచి పోటీచేస్తున్నారు. షీలాదీక్షిత్‌కు వ్యతిరేకంగా బీజేపీ తరఫున విజేంద్ర గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ పోటీచేస్తున్నారు. కిరణ్ వాలియా బీజేపీ అభ్యర్థి ఢిల్లీ మాజీ మేయర్ ఆర్తీ మెహ్రాతో తలపడుతున్నారు. బర్ఖాసింగ్కు ఆమ్ ఆద్మీ పార్టీ నేత షాజియా ఇల్మీతో తలపడనుండగా యువనేత రాగిణీ నాయక్ జనక్‌పురి నుంచి పోటీ చేస్తారు. ఆమె బీజేపీ సీనియర్ నేత జగ్దీశ్ ముఖీతో పోటీపడుతున్నారు. మరో యువనేత అమతా ధవన్ తిలక్‌నగర్ నుంచి పోటీ చేస్తూ ఓపి బబ్బర్ తనయుడు రాజీవ్ బబ్బర్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తిలక్‌నగర్ టికెట్ పాప్ సింగర్ దలేర్ మెహందీకి ఇస్తారన్న ఊహాగానాలు వినిపించినప్పటికీ ఆయనకు మొండిచేయి ఎదురైంది. అమతా ధవన్ మున్సిపల్ కౌన్సిలర్ కూడా. ఇక రాజోరీ గార్డెన్ టికెట్ ధన్వంతీ చండీలాకు లభించింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ధన్వంతీ భర్త దయానంద్ చండీలా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దయానంద్ చండీలాపై తీవ్ర నేరారోపణలు ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ ఆయనకు మాత్రం టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడా సీటును ఆయన భార్యకే కేటాయించారు. ధన్వంతీ అకాలీదళ్ అభ్యర్థి శ్యామ్ శర్మతో తలపడనున్నారు.