![బేషరతు మద్దతని ఎప్పుడూ చెప్పలేదు: షీలా దీక్షిత్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81386500844_625x300_1.jpg.webp?itok=B23-OwjJ)
బేషరతు మద్దతని ఎప్పుడూ చెప్పలేదు: షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ సర్కారుపై తీవ్రస్థాయిలో ఉద్యమం చేసిన అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపి సర్కారును ఏర్పాటుచేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి షరతులతో కూడిన మద్దతే ఉంటుందని షీలా దీక్షిత్ చెప్పారు. బేషరతు మద్దతని ఎప్పుడూ చెప్పలేదని షీలా దీక్షిత్ స్పష్టం చేశారు.అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయాన్ని షీలా దీక్షిత్ స్వాగతించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ నెరవేరుస్తుందని ఆమె అన్నారు.
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు లెప్టినెంట్ గవర్నర్‌ను కలవనున్నట్టు తెలుస్తోంది. సర్కారు ఏర్పాటు చేయాలంటూ 6.97 లక్షల ఎస్ ఎమ్ ఎస్ లు వచ్చినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.