నీలిరంగు సోయగం | 'Deep Space Climate Observatory | Sakshi
Sakshi News home page

నీలిరంగు సోయగం

Published Wed, Jul 22 2015 12:19 AM | Last Updated on Tue, May 29 2018 12:54 PM

నీలిరంగు సోయగం - Sakshi

నీలిరంగు సోయగం

వాషింగ్టన్: నింగిలోని నీలిరంగు అందంతో.. చిత్రంగా మెరిసిపోతున్న మేఘమాలతో.. గోధుమ వర్ణపు ఎడారుల సొబగులతో కళ్లు జిగేలుమనిపిస్తున్న భూమాత సోయగమిది. ‘డీప్ స్పేస్ క్లైమేట్ అబ్జర్వేటరీ (డిస్కవర్)’ ఉపగ్రహానికి అమర్చిన కెమెరాతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ చిత్రరాజాన్ని చిత్రించింది. భూమిపై వెలుతురు ఉండగా ఒకవైపు అర్ధభాగం మొత్తాన్ని తీసిన మొట్టమొదటి చిత్రం ఇదేకావడం విశేషం.

ఈ నెల 6వ తేదీన భూమికి 16లక్షల కిలోమీటర్ల దూరం నుంచి డిస్కవర్ దీన్ని చిత్రించింది. అత్యధిక రెజల్యూషన్‌తో తీసిన ఈ చిత్రంలో సముద్రాలు, ఎడారులు, నదులతో పాటు చిత్రమైన ఆకృతుల్లో మేఘాలు కనువిందు చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని చూసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ‘‘మనకున్నది ఒకే భూమి. దానిని మనం రక్షించుకోవాలని ఈ చిత్రం గుర్తుచేస్తోంది..’’ అని ట్విటర్‌లో ట్వీట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement