డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 7,173 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ బుధవారం జీవో జారీ చేశారు. ఈ పోస్టులన్నింటినీ ఆయా శాఖలు ఎంపిక కమిటీ, రాత పరీక్షల ద్వారా డెరైక్ట్ రిక్రూట్ ద్వారా భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రిజర్వేషన్లతోపాటు రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ విధానాన్ని పాటించాలని కూడా పేర్కొన్నారు. జోనల్, జిల్లాలవారీగా పోస్టుల వివరాలతో భర్తీకోసం వెంటనే ఆయా శాఖలు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు.
ప్రధానంగా రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ పోస్టులు 4,305, గ్రామ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు 1,657, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌లో నీటి సరఫరా, పారిశుద్ధ్యం విభాగాల్లో 658 పోస్టులు భర్తీ చేయనున్నారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 44 అసిస్టెంట్ ప్రొఫెసర్, 36 అసోసియేట్ ప్రొఫెసర్, 30 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ విభాగంలో 46 స్టాఫ్ నర్స్ పోస్టులు, 28 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు, 30 ఎఫ్‌ఎన్‌ఓ, ఎన్‌ఓ పోస్టులు, 23 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
7,173 పోస్టుల భర్తీ
Published Thu, Dec 5 2013 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement