బెంగళూరు: నగరంలోని హుబ్లికార్వార హైవేపై గురువారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందగా, 40మందికి తీవ్రగాయాలయినట్టు తెలుస్తోంది. లారీ బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ప్రమాదానికి గురైన లారీలో 100మంది విద్యార్థులు మదరసా( ఉర్దూ పాఠశాల)కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగ్రాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.