ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు జమిల్ మహౌద్కు అక్కడి కోర్టు 12 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు జమిల్ మహౌద్కు అక్కడి కోర్టు 12 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసి పక్కదోవ పట్టించినందుకు ఆయనకు ఈ శిక్ష పడింది. మహౌద్ చేసిన నేరం వల్ల సామాజికంగా తీవ్ర పరిణామాలు సంభవించాయని, ఈక్వెడార్ ఈ రోజు వరకు ఇంకా దాని ఫలితం అనుభవిస్తూనే ఉందని కోర్టు తెలిపింది.
ప్రస్తుతం అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న మహౌద్పై రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు. 1998లో ఈక్వెడార్కు అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన, 2000 జనవరిలో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, సైనిక తిరుగుబాటు కూడా జరగడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. అయితే, తనపై ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమేనని, తాను ఏ తప్పూ చేయలేదని ఆయన అంటున్నారు.