ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా, దోషులకు మరణ శిక్షలు విధిస్తున్నా.. దేశంలో మహిళలపై ఆగడాలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో 19 ఏళ్ల వికలాంగురాలిని సామూహిక అత్యాచారం చేశారు. థానె జిల్లా భివండిలో ముగ్గురు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు.
ఆరు వారాల క్రితం ఈ అమ్మాయిని బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు నర్పోలి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి.వి.జాంగ్లె తెలిపారు. నిందితుల వయసు 27-35 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరిని సోమవారం రిమాండ్కు తరలించారు.