పెళ్లి వద్దందని.. ముక్కు కోసేశారు!! | Girl's nose chopped off for refusing marriage proposal | Sakshi
Sakshi News home page

పెళ్లి వద్దందని.. ముక్కు కోసేశారు!!

Published Sat, Mar 22 2014 3:11 PM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

పెళ్లి ప్రతిపాదన తెస్తే వద్దని నిరాకరించినందుకు ఓ అమ్మాయి తన ముక్కు కోల్పోవాల్సి వచ్చింది.

పెళ్లి ప్రతిపాదన తెస్తే వద్దని నిరాకరించినందుకు ఓ అమ్మాయి తన ముక్కు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. ఫరీదా బీబీ (20) అనే యువతి తండ్రి బస్తీ షేర్వాలీలో జంషెడ్, నదీమ్ అనే ఇద్దరి వద్ద కూలిపని చేస్తుంటాడు. వాళ్లలో జంషెడ్ తన కుమారుడితో పాటు మరో ఐదుగురికి ఫరీదాను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ ఆమె అందుకు నిరాకరించింది. దాంతో ఆమెను ఇంట్లోకి ఈడ్చుకెళ్లి, చిత్రహింసలు పెట్టి.. ముక్కు కోసేశాడు. ఇంతకుముందు కూడా ఆమెను అపహరించేందుకు ఆ కుటుంబం ప్రయత్నించింది.

ఈ సంఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన లాహోర్ హైకోర్టు, దీనిపై వారం రోజుల్లోగా వివరంగా నివేదిక ఇవ్వాలని బహావల్నగర్ జిల్లా, సెషన్స్ జడ్జిని ఆదేశించింది. దాని ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది. దీంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement