
జీ మెయిల్ యూజర్లకు గుడ్‌న్యూస్
జీ మెయిల్ వినియోగదారులకు గూగుల్ గుడ్ న్యూస్ అందించింది.
జీ మెయిల్ వినియోగదారులకు గూగుల్ గుడ్ న్యూస్ అందించింది. జీ మెయిల్ అటాచ్మెంట్ సైజ్‌ను రెట్టింపు చేసింది. ఇన్ కమింగ్ మెయిల్ సైజును రెట్టింపు చేస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇకపై, ఇతర మెయిల్స్ జీ మెయిల్ వినియోగదారులకు వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు అటాచ్ మెంట్లతో కలిపి జీమెయిల్ సైజు 25 ఎంబీ నుంచి 50 ఎంబీకి పెంచింది. ఇక మీదట 50 ఎంబీ సైజు ఉన్న ఫైల్స్ ను రిసీవ్ చేసుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పించింది. ఈ అవకాశాలు కేవలం జీ మెయిల్ యూజర్లకు మాత్రమే, అదీ ఇన్ కమింగ్ మెయిల్స్‌కు మాత్రమే అనుమతి ఉందని గూగుల్ బ్లాగ్ స్పాట్ లో స్పష్టం చేసింది. ఇది ఈ రోజు(గురువారం) నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది.
అయితే పెద్ద సైజు ఫైల్స్ రిసీవ్ చేసుకోవాలంటే ‘డ్రైవ్’ అప్లికేషన్ ను వాడుకోవాలని, ఇది ఇప్పటికే జీ మెయిల్ తో కలిసి పనిచేస్తోందని పేర్కొంది. ఈ మార్పు వినియోగదారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, అడోబ్ ఫైల్స్ లాంటి పెద్ద ఫైళ్లను రిసీవ్ చేసువడానికి సహాయపడనుంది. అయితే మెయిల్ సెండింగ్ సైజ్ మాత్రం 25ఎంబీలాగే ఉంటుందని తెలిపింది. భారీ ఫైళ్ల సెండింగ్ కోసం ఇంతకుముందులాగానే గూగుల్ డ్రైవ్ ను వాడుకోవాలని తెలిపింది. 5టీబీ దాకా ఇలా సెండ్ చేసుకోవచ్చని తెలిపింది. త్వరలోనే సెండింగ్ మెయిల్స్‌కు కూడా ఈ అవకాశాన్ని కల్పించనున్నట్టు పేర్కొంది.