సాహో.. బాహుబలి | GSLV Mk3 success, several leaders congratulate ISRO | Sakshi
Sakshi News home page

సాహో.. బాహుబలి

Published Mon, Jun 5 2017 7:11 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

సాహో.. బాహుబలి - Sakshi

సాహో.. బాహుబలి

- జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3డీ1 ప్రయోగం విజయవంతం.. ఇస్రోకు అభినందనల వెల్లువ
- సమాచార రంగంలో గొప్ప ముందడుగు: వైఎస్‌ జగన్‌ 


శ్రీహరికోట/హైదరాబాద్‌:
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1 ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నూతన చరిత్రను లిఖించిన ఇస్రోకు దేశ ప్రధాని సహా కీలక నేతలు అభినందనలు తెలిపారు.

ప్రయోగం విజయవంతమైందని, భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇది చరిత్రలో నిలిచిపోయేరోజని ఇస్రో చైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ ప్రకటించగానే శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో చప్పట్లు మారుమోగాయి. ఈ విజయం.. 18 ఏళ్ల కృషికి దక్కిన ఫలితమని, భాగస్వాములైన శాస్త్రవేత్తలందరినీ అభినందిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

గొప్ప ముందడుగు: వైఎస్‌ జగన్‌
జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3డీ1 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం సమాచార రంగంలో గొప్ప ముందడుగని, అతిభారీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రగామి దేశాల సరసన భారత్‌ చేరిందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
(నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లిన ‘బాహుబలి’)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement