కాంగ్రెస్ ప్రజెంటేషన్ ఓ సొల్లు పురాణం | harish rao fires on congress presentation | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ప్రజెంటేషన్ ఓ సొల్లు పురాణం

Published Fri, Aug 19 2016 2:27 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ ప్రజెంటేషన్ ఓ సొల్లు పురాణం - Sakshi

కాంగ్రెస్ ప్రజెంటేషన్ ఓ సొల్లు పురాణం

మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్:
సాగు నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘వాస్తవ జలదృశ్యం’ ప్రజెం టేషన్ ఓ సొల్లు పురాణమని మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. అర్థం, పర్థం లేని ప్రజెంటేషన్‌పై ఏం స్పందిస్తామని అన్నారు. గురువారం ఐడీసీ కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రిని, కాంగ్రెస్ ప్రజెంటేషన్‌పై స్పందన కోరగా ఆయన పై విధంగా స్పందించారు.

కాంగ్రెస్ హయాం నాటికే 98 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చి ఉంటే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయని,  ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు మంచీ, చెడూ తెలుసునని, ప్రాజెక్టులపై తమ చిత్తశుద్ధిని మాటల్లో కాక చేతల్లో చూపిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement